చిరుధాన్యాలు

చిరుధాన్యాలలో సెర్కోస్పోరా ఆకు మచ్చ తెగులు

Cercospora penniseti

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • చిన్న చిన్న ముదురు రంగు మరియు కోలాకారంలో మచ్చలు ఆకులపైన మరియు కాండంపైన ఏర్పడతాయి.
  • నల్లని ఉబ్బెత్తుగా వున్న చుక్కలు ఈ మచ్చలపైన వృద్ధిచెందుతాయి.

లో కూడా చూడవచ్చు


చిరుధాన్యాలు

లక్షణాలు

మధ్యలో బూడిద రంగు మచ్చలు వున్న చిన్న చిన్న ముదురు రంగు మరియు కోలాకారంలో మచ్చలు ఆకులపైన మరియు కాండంపైన ఏర్పడతాయి. నల్లని ఉబ్బెత్తుగా వున్న చుక్కలు ఈ మచ్చలపైన వృద్ధిచెందుతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ తెగులుకు ఎటువంటి ప్రత్యామ్న్యాయ చికిత్స అందుబాటులో లేదు. ఈ తెగులు సంక్రమించకుండా నివారణ చర్యలను పాటించండి.

రసాయన నియంత్రణ

దీనిని నియంత్రించడానికి ఎటువంటి రసాయనాలు వాడవలసిన అవసరం లేదు. ఈ తెగులు సంక్రమించకుండా నివారణ చర్యలను పాటించండి.

దీనికి కారణమేమిటి?

అధిక ఉష్ణోగ్రతలు మరియు అధిక తేమ వాతావరణం ఈ తెగులుకు అనుకూలంగా ఉంటాయి. ఈ ఫంగస్ గాలి మరియు వర్షం ద్వారా వ్యాపిస్తుంది. ఇది పంట అవశేషాలపై మరియు కలుపు మొక్కలు వంటి ఇతర ప్రత్యామ్న్యాయ అతిధి మొక్కలపైన జీవిస్తుంది. దీనివలన దిగుబడిలో పెద్దగా నష్టం కలగదు.


నివారణా చర్యలు

  • ఈ తెగులుకు తట్టుకునే విత్తన రకాలను ఉపయోగించండి.
  • కలుపు మొక్కలను నియంత్రించండి.
  • పంట మార్పిడి పద్దతులను పాటించండి.
  • పొలంలో సరైన పరిశుభ్రతను పాటించండి - పంట అవశేషాలను తొలగించండి లేదా కాల్చివేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి