కాప్సికమ్ మరియు మిరప

చిల్లీ సెర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు

Cercospora capsici

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకులపై పెద్ద పరిమాణంలో మధ్యలో తెల్లని పదార్ధం, ముదురు రంగు రింగ్ మరియు పసుపు రంగు వలయంతో కూడిన గోధుమరంగు మచ్చలు( కప్ప కన్ను) ఏర్పడతాయి.
  • ఈ మచ్చలు విస్తరించి పెద్ద మచ్చలుగా అవుతాయి.
  • ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతాయి.
  • దీని వలన పండ్లు ఎండ దెబ్బ తింటాయి.

లో కూడా చూడవచ్చు


కాప్సికమ్ మరియు మిరప

లక్షణాలు

సంక్రమణ ప్రారంభ దశలో ఆకులపై ఎర్రటి గోధుమ రంగు అంచుతో మధ్యన లేత బూడిద రంగులో, గోధుమ రంగు గుండ్రటి మచ్చలు ఏర్పడతాయి. తరువాత ఇవి 1.5 సెంటి మీటర్ల పరిమాణం వరకూ, ఒక తెల్లని మధ్య భాగం చుట్టూ కేంద్రీకృత రింగులతో పెద్ద వృత్తాకారపు టాన్ రంగు మచ్చలుగా మారతాయి. ఒక మృదువుగా లేని నల్లని రింగ్ మరియు పసుపు రంగు వలయం మచ్చలకు 'కప్ప-కన్ను' ఆకృతిని ఇస్తాయి. ఈ మచ్చలు ఎక్కువ అయ్యేకొలదీ, క్రమంగా ఒకదానితో మరొకటి కలిసి, పెద్ద ఆకు గాయాలుగా ఏర్పడతాయి. ఈ మచ్చల మధ్య తెల్లని భాగం తరుచుగా ఎండిపోయి, రాలిపోయి ‘షాట్-హోల్’ ఎఫెక్ట్ ఇస్తుంది. సంక్రమణ యొక్క తరువాతి దశలలో ఆకులు పసుపురంగులోకి మారి వాడిపోవడం లేదా రాలిపోవడం జరుగుతుంది. దీని వలన పండ్లు ఎండ దెబ్బ తింటాయి. తీవ్రమైన సందర్భాల్లో, పండ్ల కొమ్మ మరియు కాలిక్స్ మీద కూడా మచ్చలు గమనించవచ్చు, దీని ఫలితంగా తరచుగా కాండం-కొన కుళ్ళు తెగులు వస్తుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

52°C వద్ద వేడినీటిలో విత్తనాలను 30 నిముషాల పాటు నానబెట్టి ఉంచాలి. దీనివలన విత్తనాలపైన ఫంగస్ తొలగిపోతుంది. దీనిని సరిగా చేయకపోవడం వలన విత్తనాలు సరిగా మొలకెత్తకపోవచ్చు. అందువలన ఇలా చేసినప్పుడు సరైన జాగ్రత్తలు ( అధిక ఉష్ణోగ్రతలు మరియు అధిక సమయం పాటు నీటిలో ఉంచడం చేయరాదు) తీసుకోవాలి. మచ్చలు కనిపించిన వెంటనే కాపర్ హైడ్రాక్సైడ్ ద్రావణాలను ఆకులపై పిచికారీ చేయండి. తరువాత ప్రతి పది నుండి పద్నాలుగు రోజులకు ఒకసారి వాడాలి. ఇలా పంట కోతకు మూడు నాలుగు వారాల ముందు వరకు ఈ మందులను పిచికారీ చేయాలి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. కప్తాన్ (3 గ్రా / కేజీ) తో విత్తన చికిత్స వ్యాధికి వ్యతిరేకంగా పోరాడటానికి బాగా పనిచేస్తుంది. ఈ వ్యాధిని నియంత్రించడానికి ఇతర చికిత్సలలో కాపర్ హైడ్రాక్సైడ్, క్లోరోథలోనిల్ లేదా మాంకోజెబ్ కలిగిన ఉత్పత్తుల యొక్క ఆకుల పిచికారీలు ఉన్నాయి. మచ్చలు మొదట కనిపించినప్పుడు చికిత్స ప్రారంభించాలి. తరువాత ప్రతి పది నుండి పద్నాలుగు రోజులకు ఒకసారి వాడాలి. ఇలా పంట కోతకు మూడు నాలుగు వారాల ముందు వరకు ఈ మందులను పిచికారీ చేయాలి. ఆకులకు రెండు వైపులా పిచికారీ చేయడం ముఖ్యం.

దీనికి కారణమేమిటి?

ఈ లక్షణాలు సెర్కోస్పోరా కాప్సిసి అనే ఫంగస్ వలన కలుగుతుంది. ఈ ఫంగస్ నారుమడిలో మరియు పొలంలో కూడా వ్యాపిస్తుంది. బీజాంశాలు ఒక సీజన్ నుండి ఇంకొక సీజన్ వరకు తెగులు సోకిన మొక్క అవశేషాలపై జీవించివుంటాయి. నీటి ద్వారా, వర్షం, గాలి మరియు ఆకులు ఒకదాని నుండి ఇంకొక ఆకుకు తగలడం వలన, పనిముట్ల ద్వారా మరియు పనివాళ్ల ద్వారా ఈ తెగులు వ్యాపిస్తుంది. ఆకులు తడిగా వున్నప్పుడు ఈ ఫంగస్ నేరుగా ఆకులలోకి ప్రవేశించడం వలన కూడా ఈ తెగులు వ్యాపిస్తుంది. ఈ తెగులు 23°C వద్ద వెచ్చటి ఉష్ణోగ్రతలు మరియు 77% నుండి 85% తేమ వున్నప్పుడు బాగా త్వరగా వృద్ధిచెందుతాయి. సీజన్ ముందు ఈ తెగులు సోకితే పంట దిగుబడి బాగా తగ్గిపోతుంది.


నివారణా చర్యలు

  • ఆరోగ్యకరమైన, ధృవీకరించబడిన విత్తనాలను వాడండి.
  • ఆకులపైన తడి త్వరగా ఆరడానికి మరియు పొలంలో సరైన వెంటిలేషన్ కొరకు మొక్కల మధ్యన సరైన అంతరాన్ని పాటించండి.
  • మొక్కలకు మరియు ఫంగస్ కు మధ్యన అవరోధం ఏర్పాటు చేయడానికి మట్టిపైన ఆకులతో మల్చింగ్ చేయండి.
  • కర్రలు కట్టి మొక్కలు నిటారుగా పెరిగేటట్టు చేయండి.
  • ఆకులపై తడి తగ్గించడానికి డ్రిప్ ఇరిగేషన్ ను వాడండి.
  • తెగులు లక్షణాల కోసం నారుమడులను, లేత మొక్కలను లేదా మొలకలను తరుచూ గమనిస్తూ వుండండి.
  • తెగులు సోకిన మొక్కలను తొలగించి, పొలానికి దూరంగా తరలించి నాశనం చేయండి.
  • పొలంలో మరియు పొలం చుట్టుప్రక్కల కలుపు మొక్కలను నిర్మూలించండి.
  • మొక్కలు తడిగా వునప్పుడు పొలంలో పనిచేయకండి.
  • కనీసం మూడు సంవత్సరాలకు ఒకసారి పొలంలో పంట మార్పిడి పద్దతులను పాటించండి.
  • పంట కోతల తర్వాత పంట అవశేషాలను తొలగించి నాశనం చేయండి.
  • విత్తనాలకోసం సేకరించిన పండ్లలో కాండం కుళ్ళు తెగులు లేకుండా చూడండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి