అరటి

సిగార్ ఎండ్ రాట్

Trachysphaera fructigena

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • ఎండిన, బూడిద నుండి నల్లటి రంగు కుళ్ళు పండ్లపై ఏర్పడతాయి.
  • ఇది వ్యాపించిన ప్రాంతాలలో బూడిద ఫంగల్ ఎదుగుదల, కాలిన సిగరెట్ చివర బూడిద లాగా కనిపిస్తాయి.
  • పండ్లు నిలువ చేసినప్పుడు లేదా రవాణా చేసే సమయంలో ఈ తెగులు మొత్తం పండుకు వ్యాపిస్తుంది.
  • పండ్లు రూపు మారి వీటిపై బూజు అచ్చులు మరియు పండు తొక్కపై మచ్చలు కనిపిస్తాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

అరటి

లక్షణాలు

పొడిగా వున్న బూడిద నుండి నల్లటి రంగు కుళ్ళు పండ్లపై తయారవుతాయి. ఈ ఫంగల్ ఎదగదల సహజంగా పూత సమయంలో మొదలవుతుంది మరియు పండ్లు పండే ప్రక్రియను ఆలస్యం చేస్తాయి. ఇది వ్యాపించిన ప్రాంతాలు బూడిద ఫంగల్ ఎదుగుదల కాలుతున్న సిగరెట్ చివర బూడిద లాగా కనిపిస్తుంది. నిల్వ ఉన్నపుడు లేదా రవాణ చేసే సమయంలో ఈ తెగులు పండు మొత్తం వ్యాపిస్తుంది. దీనివలన పండు తొక్క మొత్తం రూపు మారిపోతుంది. పండ్లు రూపు మారి వీటిపై బూజు కనిపిస్తుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

బేకింగ్ సోడా ఆధారిత పిచికారీ చేయడం వలన ఈ తెగులును నియంత్రించవచ్చు. ఈ పిచికారీ తయారీలో 100 గ్రాముల బేకింగ్ సోడా 50 గ్రాముల సబ్బు ఒక 2 లీటర్ల నీటిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని తెగులు సోకిన గెలలపై పిచికారీ చేయాలి. pH లెవెల్ పెరగడం వలన ఈ తెగులు ఎదగకుండాఉంటుంది. కాపర్ శీలింద్ర నాశినులు కూడా ఈ తెగులును బాగా నియంత్రించగలవు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ తెగులు వలన పంటలో నష్టం చాల తక్కువగా ఉంటుంది. అందువలన రసాయనాలను వాడవలసిన అవసరం ఉండదు. తెగులు సోకిన గెలలపై మాంకోజెబ్, ట్రయోఫేనేట్ మిథైల్ లేదా మెథలాక్సిల్ ఒక్క సారి పిచికారీ చేసి తరువాత వీటిపై ప్లాస్టిక్ కవర్ ను కప్పివుంచాలి.

దీనికి కారణమేమిటి?

సిగార్ ఎండ్ రాట్ కుళ్ళు తెగులు అరటి మొక్కలకు సంక్రమించే తెగులు. ఇది ట్రచేస్పర ఫ్రూక్తిజేనా అనే ఫంగస్ వలన కలుగుతుంధి. ఇది గాలి లేదా వర్షం వలన వ్యాపిస్తుంది. ఈ ఫంగస్ వర్ష కాలంలో పూత దశలో వ్యాపిస్తుంది. ఇది అరటి పూల ద్వారా సంక్రమిస్తుంది. అక్కడి నుండి ఇది పండ్ల చివర్లకు వ్యాపించి సిగార్ ఎండ్ రాట్ తెగులు వలే వుండే ఎండు కుళ్ళు తెగులును కలగ జేస్తుంది. ఈ తెగులు పండ్లు ఏర్పడే ప్రారంభ దశలోనే అధికంగా ఉంటుంది మరియు ఎతైన ప్రాంతాలలో నీడ అధికంగా వున్న ప్రదేశాల్లో వేసిన అరటి పంటలోనే కనిపిస్తుంది.


నివారణా చర్యలు

  • తెగులు సోకని విత్తన రకాలు వాడాలి.
  • పొలంలో పని చేస్తున్నప్పుడు మొక్కలకు నష్టం కలగకుండా చూడాలి.
  • అరటి కాయలపై ప్లాస్టిక్ తొడుగు వాడి వర్షం నుండి కాపాడాలి.
  • అరటి ఆకులు పొడిగా ఉండేలాగా చూడాలి.
  • గుత్తులు తయారయ్యాక పూల అవశేషాల్ని తొలగించాలి.
  • ముఖ్యంగా వర్ష కాలానికి ముందు ఎండిపోయిన లేదా చనిపోయే ఆకులను క్రమం తప్పకుండా తొలగించాలి.
  • తెగులు సోకిన అరటి మొక్కలను కాల్చి వేయాలి.
  • పండ్లను చల్లని (14°C) మరియు పొడి ప్రదేశాల్లో నిలువ ఉంచాలి.
  • పొలంలో వాడే పరికరాలను పండ్లను నిలువ ఉంచే గదిని శుద్ధిచేయాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి