పర్యావరణపరంగా మరియు ఆర్థికంగా స్థిరమైన వ్యవసాయం దిశగా వ్యవసాయంలో డిజిటల్ పరివర్తనను నడిపిస్తున్నాం.
గత కొన్ని సంవత్సరాలుగా, ప్లాంటిక్స్ డిజిటల్ మొక్కల వ్యాధి నిర్ధారణ మరియు సాగు నిపుణుడిగా స్థిరపడింది. ఈ రోజు, మేము మా రెండు యాప్స్, ప్లాంటిక్స్ మరియు ప్లాంటిక్స్ పార్టనర్ తో ఒక డిజిటల్ పర్యావరణ వ్యవస్థలో చిన్న-స్థాయి రైతులు మరియు సరఫరాదారులను అనుసంధానిస్తున్నాము. అనుకూలీకరించిన పరిష్కారాలు, విశ్వసనీయ ఉత్పత్తులు మరియు విశ్వసనీయ సేవలను అందించడం మా ప్రాధమిక లక్ష్యాలు. మేము ఇప్పటికే రైతుల యొక్క సాగు మరియు పంట సంబంధిత లక్షలాది ప్రశ్నలకు సమాధానం ఇచ్చాము మరియు వందల వేల మంది రిటైలర్లతో డిజిటల్ అనుసంధానం చేసాము.
అనుకూలీకరించిన పరిష్కారాలు, నమ్మకమైన ఉత్పత్తులు మరియు విశ్వసనీయ సేవలు మా ప్రాథమిక లక్ష్యాలు. 2022 లో, మేము రైతుల నుండి 5 కోట్లకు పైగా సాగు మరియు పంటల సంబంధిత ప్రశ్నలకు సమాధానమిచ్చాము మరియు మేము 100,000 కంటే ఎక్కువమంది రిటైలర్‌లను డిజిటల్‌గా అనుసంధానించాము.
134,000 రోజువారీ క్రియాశీల యాప్ వినియోగదారులు
ప్రతి 1,5 సెకండ్లకు 1 వ్యాధి నిర్ధారణ
177 దేశాలు మరియు 18 భాషలలో అందుబాటులో ఉంది
40 కంటే ఎక్కువ బ్రాండ్లను మరియు 1000 కంటే ఎక్కువ ఉత్పత్తులను డెలివరీ చేస్తోంది
10 భారతీయ రాష్ట్రాలలో పనిచేస్తోంది
100,000 కంటే ఎక్కువ మంది రిటైలర్ల ద్వారా విశ్వసించబడింది
250+ ప్లాంటిక్స్ ఉద్యోగులు
మా ఆఫీసులు
బెర్లిన్ · ఇండోర్
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) మరియు సహ వ్యవస్థాపకురాలిగా, సిమోన్ స్ట్రే పర్యావరణపరంగా మరియు ఆర్థికంగా స్థిరమైన వ్యవసాయం వైపు, వ్యవసాయంలో డిజిటల్ పరివర్తనకు దారితీసే విజన్‌ను అందించే దిశగా ప్లాంటిక్స్ ను నడిపిస్తున్నారు.
సిమోన్ లైబ్నిజ్ విశ్వవిద్యాలయం, హనోవర్ నుండి భౌగోళిక శాస్త్రంలో ఎంఎస్ డిగ్రీ ను కలిగి వున్నారు. ఉద్యోగ రీత్యా ఆమె బెర్లిన్, అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్, పశ్చిమ ఆఫ్రికా, గాంబియా మరియు ఇండియా మొదలగు దేశాలను సందర్శించారు. అక్కడ ఆమె మొదటి-స్థాయి అనుభవం సంపాదించారు మరియు సన్నకారు రైతుల అవసరాలను అర్థం చేసుకున్నారు.
నీరు, వ్యవసాయ మరియు ఇంధన మౌలిక సదుపాయాలలో స్వయం సమృద్ధి సాంకేతిక పరిష్కారాలను రూపొందించడానికి గ్రీన్ డెజర్ట్ ఇ.వి అనే ఎన్జిఓను కూడా సిమోన్ విజయవంతంగా అభివృద్ధి పరిచారు.
ప్లాంటిక్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO) మరియు సహ వ్యవస్థాపకుడు అయిన రాబర్ట్ స్ట్రే, ప్లాంటిక్స్ యొక్క అత్యాధునిక సాంకేతికత మరియు వ్యవసాయ డేటాబేస్ యొక్క రూపశిల్పి. రాబర్ట్ లైబ్నిజ్ విశ్వవిద్యాలయం, హనోవర్ నుండి భౌగోళిక శాస్త్రంలో ఎంఎస్ డిగ్రీని కలిగి వున్నారు.
ప్లాంటిక్స్‌లో ఆయన ప్రాథమికంగా సమర్థవంతమైన, లాభదాయకమైన మరియు సురక్షితమైన సాంకేతిక వనరులను ఉపయోగించడానికి మరియు కొత్త మౌలిక సదుపాయాల వ్యవస్థలను అమలు చేయడానికి కంపెనీ వ్యూహాన్ని రూపొందించడంపై దృష్టి పెడతారు.