టమాటో

నీరు పట్టడం

Transpiration disorder

ఇతర

క్లుప్తంగా

  • ఆకులు, కాండం మరియు పండ్లపై పొక్కులు.
  • పెళుసుబారిన ఆకులు.

లో కూడా చూడవచ్చు


టమాటో

లక్షణాలు

నీటిలో నానినట్టు ఉన్న పొక్కులు మరియు ఆకుల దిగువ భాగంలో పసుపురంగు మచ్చలు ఏర్పడతాయి. ఇది ఆకులు అసాధారణంగా వంకరగా మారడానికి కారణమవుతుంది. కాండం మరియు పండ్లపై కూడా బొబ్బలు ఏర్పడవచ్చు. ఆకులు పెళుసుగా మారతాయి మరియు తాకినప్పుడు పగుళ్లు ఏర్పడతాయి. ఎందుకంటే ఈ పొక్కులు ఆకు నిర్మాణాన్ని బలహీనపరుస్తాయి. సాధారణంగా ఎడెమా మొక్క యొక్క మొత్తం ఆరోగ్యానికి హాని కలిగించనప్పటికీ విక్రయించడానికి కూరగాయలు ఆకర్షణీయంగా ఉండవు. ఇది ఆర్థికపరమైన నష్టాలకు దారి తీస్తుంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే కూరగాయల పంటల యొక్క అన్ని మృదువైన భాగాలు ఎడెమాను అభివృద్ధి చేస్తాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఈ సమస్య ఒక తెగులు లేదా వ్యాధి కాదు; కాబట్టి, సేంద్రీయ నియంత్రణ అవసరం లేదు.

రసాయన నియంత్రణ

ఈ సమస్య ఒక తెగులు లేదా వ్యాధి కాదు; అందువల్ల, రసాయన నియంత్రణ అవసరం లేదు.

దీనికి కారణమేమిటి?

ఎక్కువగా నీరు పెట్టడం, సరైన మురుగు నీరు సౌకర్యం లేకపోవడం, చల్లని మరియు మేఘావృతమైన రోజులు, అధిక తేమ ఈ వ్యాధికి కారణాలు. మొక్కలు నీటిని గ్రహించగలిగిన దానికంటే వేగంగా గ్రహించినప్పుడు ఎడెమా ఏర్పడుతుంది. తరచుగా తగినంత కాంతి లేనప్పుడు, అధిక తేమ లేదా పరిమిత గాలి ప్రసరణ, మేఘావృతమైన రోజులు లాంటి వాతావరణ పరిస్థితుల్లో ఎక్కువగా నీరు పెట్టడం వలన ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ముఖ్యంగా నీరు నిలువ వుండే నేలల్లో, క్యాబేజీ మరియు టమోటా పంటలకి ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాతావరణ పరిస్థితులు మెరుగుపడినప్పటికీ ఎడెమా వల్ల వచ్చే బొబ్బలు అలాగే ఉండిపోతాయి.


నివారణా చర్యలు

  • ముఖ్యంగా చల్లని మరియు మేఘావృతమైన రోజులలో, మొక్కలను కొద్దిగా పొడిగా ఉంచాల్సిన రోజుల్లో నీరు అధికంగా పెట్టడం మానుకోండి.
  • గాలి ప్రసరణను మెరుగుపరచడానికి వెంటిలేషన్‌ను పెంచండి మరియు మొక్కలను దగ్గరదగ్గరగా పెంచకండి.
  • వాతావరణ పరిస్థితులు ఎడెమాకు అనుకూలంగా ఉన్నప్పుడు నీరు పెట్టడం తగ్గించండి కానీ మొక్కలు పూర్తిగా ఎండిపోనివ్వవద్దు.
  • ఎల్లప్పుడూ ఉదయం మాత్రమే నీరు పెట్టండి.
  • ముఖ్యంగా మొక్కలు నెమ్మదిగా ఎదిగే కాలంలో ఎరువులను అధికంగా వాడకండి.
  • మట్టిలో పొటాషియం మరియు కాల్షియం స్థాయిలపై శ్రద్ధ వహించండి, ఈ మూలకాలు మొక్కల కణజాలాలు స్థిరపడడంలో సహాయపడతాయి.
  • కొన్ని మొక్కల రకాలు ఎడెమాకు ఎక్కువ నిరోధకతను కలిగి ఉండవచ్చు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి