వరి

ఉష్ణ వాతావరణ ఒత్తిడి

Thermal stress

ఇతర

క్లుప్తంగా

  • తెల్లని, వాడిపోయిన పూల గుత్తులు.
  • వరి ఆకులు వంకర్లు తిరిగి కాలిపోయినట్లు కనిపిస్తాయి.
  • తక్కువ మరియు చిన్న పిలకలు (కాండాలు) ఏర్పడతాయి.
  • బియ్యం గింజలు లేని బోలు ధాన్యం.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

వరి

లక్షణాలు

వరిపై ఉష్ణ వాతావరణ ఒత్తిడి యొక్క లక్షణాలు వరి పంట దశను బట్టి మారవచ్చు. ప్రారంభంలో ఈ ఒత్తిడి ఉన్నట్లయితే మొలకలుచనిపోతాయి చనిపోతాయి మరియు తక్కువ కంకులు (వరి కాండాలు) ఏర్పడతాయి. ఆకులు ముడుచుకుని కాలిపోయినట్లు కనిపించవచ్చు. పుష్పించే దశలో కంకులు బలహీనమైన పుప్పొడిని సూచిస్తూ కుచించుకుపోయి తెల్లగా మారవచ్చు. బియ్యం గింజలు ఏర్పడినప్పుడు, వేడి వాతావరణం యొక్క ఒత్తిడి, గింజల అసంపూర్ణ అభివృద్ధికి కారణమవుతుంది. ప్రధాన ఫలితం ఏమిటంటే, వేడి ఒత్తిడి వరి దిగుబడి మరియు నాణ్యత, రెండింటినీ తగ్గిస్తుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఈ సమస్య ఒక తెగులు లేదా వ్యాధి కాదు; కాబట్టి, సేంద్రీయ నియంత్రణ అవసరం లేదు.

రసాయన నియంత్రణ

ఈ సమస్య ఒక తెగులు లేదా వ్యాధి కాదు; అందువల్ల, రసాయన నియంత్రణ అవసరం లేదు.

దీనికి కారణమేమిటి?

పంట ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి మరియు సరిగ్గా పునరుత్పత్తి చేయడానికి అవసరమైన దానికంటే ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఈ రకమైన ఒత్తిడి ఏర్పడుతుంది. పగలు మరియు రాత్రి ఉష్ణోగ్రతలు రెండూ ఈ వేడి ఒత్తిడికి కారణమైనప్పటికీ పగటిపూట కంటే రాత్రి సమయంలో దీని ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ సమస్య ఇప్పుడు సర్వసాధారణంగా మారడానికి వాతావరణ మార్పులే ప్రధాన కారణం. అధిక వేడి మరియు తగినంత నీరు పెట్టకపోవడం, రెండూ ఈ సమస్యను కలిగిస్తాయని గుర్తుంచుకోవడం ముఖ్యం.


నివారణా చర్యలు

  • క్లిష్టమైన పునరుత్పత్తి దశలో వేడి వాతావరణాన్ని నివారించడానికి త్వరగా పరిపక్వం చెందే వరి రకాలను ఎంచుకోండి లేదా సీజన్‌లో ఆలస్యంగా వరి పంటను వేయండి.
  • త్వరగా పక్వానికి వచ్చే వరి అత్యంత వేడిగా ఉండే వేసవి నెలలకంటే ముందే దాని సున్నితమైన దశను దాటుతుంది, అయితే ఆలస్యంగా నాటినట్లయితే, గరిష్ట వేడి వాతావరణం తర్వాత పునరుత్పత్తి దశ జరుగుతుంది, ఇది పంటను తీవ్ర ఉష్ణోగ్రతల నుండి కాపాడుతుంది.
  • మట్టి నిర్మాణాన్ని మెరుగుపరచడానికి తగిన సాగు పద్ధతులను పాటించండి, వేర్లు నీరు మరియు పోషకాలను మరింత ప్రభావవంతంగా పొందడంలో ఇది సహాయపడుతుంది.
  • ముఖ్యంగా వేడిగాలులు వీచే సమయంలో మీ మొక్కకు నీరు పెట్టండి.
  • మీరు ఉపయోగించే మొత్తం నత్రజని మొత్తాన్ని చిన్న మోతాదులుగా విభజించండి.
  • మీరు మీ నత్రజని మోతాదు మరియు వాడకాన్ని విభజించినప్పుడు, మట్టిలోకి క్రమంగా విడుదలయ్యేలా చూసుకోవడానికి అందులో కొంత భాగాన్ని నెమ్మదిగా విడుదల అయ్యే టాప్ డ్రెస్సింగ్‌గా వర్తించండి.
  • నేల పొరలు కలవడానికి మరియు మట్టి నిర్మాణాన్ని మెరుగుపరచడానికి మట్టిని లోతుగా దున్నండి.
  • నాణ్యతను మెరుగుపరచడానికి మట్టిలో సేంద్రీయ పదార్థాలను కలపండి.
  • ఈవిధంగా చేయడం వలన మీ మొక్కలు వేడి ఒత్తిడిని నిరోధించడంలో సహాయపడే మెరుగైన పెరిగే పరిస్థితులను సృష్టిస్తాయి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి