ప్రత్తి

కలుపు నివారిణి వలన కలిగే నష్టం

Herbicides Cell Membrane Disruptors

ఇతర

క్లుప్తంగా

  • నీటితో నానబెట్టినట్టు వున్న ఆకు మచ్చలు.
  • ఆకులు ఎండిపోవడం మరియు కుళ్లిపోవడం జరుగుతుంది.

లో కూడా చూడవచ్చు


ప్రత్తి

లక్షణాలు

ఉపయోగించిన కలుపు నాశిని, అప్లికేషన్ సమయం మరియు మోతాదుపై లక్షణాలు ఆధారపడి ఉంటాయి. సాధారణంగా ఆకులు నీటితో నానబెట్టినట్టు వున్న గాయాలు కలిగి ఉంటాయి. తరువాత అవి ఎండిపోతాయి. మొలకలు వచ్చే ముందు ఈ మందులను వాడడం వలన కణజాలం కాలడం లేదా మొలకలు ఆవిర్భవించకపోవడం అనేవి ఈ కలుపు సంహారకాల యొక్క లక్షణం. ఆవిర్భవించిన తర్వాత ఈ మందులను వాడినప్పుడు అవి మచ్చల మాదిరిగా కాల్చడానికి కారణమవుతాయి. ఇది పారాక్వాట్ గాయాన్ని పోలి ఉండి గందరగోళం కలిగిస్తుంది. కానీ ఇది కాంస్య రంగులో ఉండదు.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

దీనికి జీవ చికిత్స అందుబాటులో లేదు. హాని మొదట జరగకుండా నివారించడానికి నివారణ మరియు మంచి వ్యవసాయ పద్ధతులు కీలకం. అధిక మోతాదు వాడినట్టు అనుమానం ఉన్నట్లయితే, మొక్కలను బాగా శుభ్రపరచడం లేదా కడగడం చేయడం వలన సహాయకారిగా ఉంటుంది.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఒక కలుపు నాశిని పిచికారీని ప్లాన్ చేయడానికి ముందు, మీరు నిర్మూలించవలసిన కలుపు రకం మీకు తెలుసు అని (ప్రాథమికంగా బ్రాడ్‌ లీఫ్ కలుపు మొక్కలు vs గడ్డి) మరియు ఈ ప్రయోజనం కోసం ఇతర పద్ధతులు బాగా సరిపోవు అని నిర్ధారించుకోండి . కలుపు నివారిణులను జాగ్రత్తగా ఎంచుకోండి, లేబుల్ ను జాగ్రత్తగా చదవండి మరియు సూచించినట్లు సూచనలు, మోతాదులను అనుసరించండి.

దీనికి కారణమేమిటి?

ఫ్లూమియోక్సాజిన్, ఫోమెసాఫెన్, లాక్టోఫెన్, కార్ఫెంట్రాజోన్, అసిఫ్లోర్ఫెన్, డిఫెనిలేథర్స్ కుటుంబానికి చెందిన పిపిఓ ఇన్హిబిటర్స్ యొక్క కలుపు నాశినుల వలన ఈ నష్టం కలుగుతుంది. క్లోరోఫిల్ ఉత్పత్తిని నిరోధించడం ద్వారా ఇవి కణ త్వచానికి అంతరాయం కలిగిస్తాయి. భంగపరుస్తాయి. కాంతి మరియు వాతావరణ పరిస్థితులను బట్టి 1 నుండి 3 రోజులలో ఆకు లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు వృద్ధి చెందడానికి కాంతి అవసరం, మరియు ప్రకాశవంతమైన, వెచ్చని రోజులలో బాగా వృద్ధి చెందుతుంది.


నివారణా చర్యలు

  • మీరు వ్యవహరించే కలుపు రకాన్ని తెలుసుకోండి (ప్రాథమికంగా వెడల్పు ఆకుల కలుపు మొక్కలు లేదా గడ్డి).
  • మీ ప్రయోజనానికి బాగా సరిపోయే కలుపు నివారిణి మందులను జాగ్రత్తగా ఎంచుకోండి.
  • లేబుల్‌ను జాగ్రత్తగా చదవండి మరియు సూచించిన విధంగా సూచనలు, మోతాదులను అనుసరించండి.
  • ఇతర మందులతో కలుపు నాశిని మందులతో కలుషితం కాకుండా ఉండటానికి పిచికారీ కంటైనర్‌ను ఎల్లప్పుడూ శుభ్రం చేయండి.
  • ఇతర పొలాలకు విస్తరించకుండా ఉండటానికి గాలులతో కూడిన పరిస్థితులలో పిచికారి చేయకండి.
  • కలుపు మొక్కలను బాగా లక్ష్యంగా చేసుకునే డ్రిఫ్ట్ తగ్గించే స్ప్రే నాజిల్‌ను ఉపయోగించండి.
  • ఫలితాలను పర్యవేక్షించడానికి పచ్చిక బయళ్ళు మరియు ఎండుగడ్డి క్షేత్రాలలో కలుపు నాశినులను ప్రయత్నించండి మరియు పరీక్షించండి.
  • వాతావరణ సూచనలను జాగ్రత్తగా గమనించండి మరియు ఎండ మరియు వెచ్చని పరిస్థితులలో పిచికారీ చేయవద్దు.
  • మందు వాడిన తేదీలు, ఉత్పత్తులు, పొలం స్థానాలు మరియు వాతావరణ పరిస్థితులతో కూడిన కార్యకలాపాల చిట్టాను ఉంచండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి