వంకాయ

కలుపు మందుల వలన కలిగే నష్టం

Herbicides Growth Regulators

ఇతర

క్లుప్తంగా

  • ఆకులు రూపు మారడం.
  • సాగినట్టున్న కొమ్మలు, ఆకు కాడలు మరియు ఈనెలు పొడవుగా మారడం.
  • ఆకులు రంగు మారడం.

లో కూడా చూడవచ్చు


వంకాయ

లక్షణాలు

కలుపు నివారిణులు వాడిన కొద్ది రోజులలోనే వీటి వలన కలిగే నష్టం యొక్క లక్షణాలు బయటపడతాయి. వాటిని ఎదుగుతున్న లేత ఆకులలో చూడవచ్చు. ఆకులు ముడుచుకుపోవడం, వంగిపోవడం, లేదా వంకర్లు తిరగడం, కాండం మరియు ఆకు కాడలు సాగినట్టుగా అవ్వడం( పట్టీ లాగ అవ్వడం) మరియు పైభాగంలో బుడిపెలు వృద్ధి చెందడం జరుగుతుంది. ఇది వాటికి ఒక స్ట్రాప్పింగ్ లేదా విచెస్ హాండ్స్ రూపును ఇస్తుంది. ఆకుల ఈనెలు ఒకదానికి ఇంకొకటి సమాంతరంగా ఉంటాయి. ఆకులు చాలా త్వరగా రంగు మారిపోతాయి. ఇవి పసుపు నుండి తెలుపు ఆ తర్వాత గోధుమ రంగులోకి మారతాయి. ముదురు ఆకులు మరియు పెద్దవైన ప్రత్తి కాయలు వంటి ఎదిగిన భాగాలకు ఎటువంటి నష్టం కలగదు.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

దీనికి ఎటువంటి జీవ నియంత్రణ చికిత్స లేదు. హాని మొదట జరగకుండా నివారించడానికి నివారణ మరియు మంచి వ్యవసాయ పద్ధతులు కీలకం. అధిక మోతాదు అనే అనుమానం ఉన్నట్లయితే, మొక్కలను బాగా కడగాలి లేదా శుభ్రం చేయాలి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లప్పుడూ నివారణా చర్యలతో కూడిన జీవసంబంధమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. కలుపు మొక్కల వాడకం ప్లాన్ చేసుకునే ముందు మీరు ఎటువంటి కలుపు మొక్కలమీద ఈ మందులను ఉపయోగిస్తున్నారో మరియు ఈ కలుపు మొక్కలను ( సాధారణంగా వెడల్పు ఆకు కలుపు మొక్కలు vs గడ్డి రకాలు) తొలగించడానికి మరి ఇంకా ఎటువంటి ఇతర పద్ధతులు అనుకూలంగా లేవు అని నిర్ధారించుకోండి. చాలా జాగ్రత్తగా కలుపు నివారణ మందులను ఎంచుకోండి. డబ్బా పైన వున్న లేబుల్ ను చదివి దానిపైన సూచించిన సూచనలను, మోతాదును అనుసరించండి.

దీనికి కారణమేమిటి?

ప్రత్తి మొక్కలు, ముఖ్యంగా ఎతైన ప్రదేశాలలో పెంచే గోసుప్పియం హిర్సుటుం మరియు పిమా కాటన్ G. బార్బడెన్సె వంటి మొక్కలు, 2,4-D లేదా డికంబా మందులకు చాలా సున్నితంగా ఉంటాయి. ఈ కలుపు మందులు ఫెనోక్సి ఎసిటిక్ యాసిడ్లు లేదా కృత్రిమ ఆక్సిన్స్ (గ్రూప్ I) చెందినవి అయివుండి వెడల్పు ఆకు కలుపు మొక్కల రకాలను నియంత్రించడానికి వాడతారు. సమయం కానీ వేళలు, తప్పుడు ఫార్ములాను వాడడం లేదా వ్యతిరేక వాతావరణ పరిస్థితుల వలన మొక్కల ఎదుగుదల తగ్గి ప్రత్తి మొక్కలు దెబ్బతింటాయి. ప్రక్క పొలాల్లో ఈ మందులు వాడడం వలన మీ పొలంలో పంట కూడా దెబ్బతినవచ్చు. సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం వలన ఈ లక్షణాలు మరింత తీవ్రతరం కావచ్చు. ఈ లక్షణాలు ఎంతకాలం ఉంటాయన్నది వాడిన మోతాదు బట్టి ఉంటుంది. అధిక మోతాదులలో ఈ మందులను వాడడం వలన కొన్ని కణుపులు నుండి మొత్తం మొక్క ప్రభావితమౌతుంది. చాలా తక్కువ మోతాదులలో వాడినప్పటికీ కూడా ఇవి పంటలకు నష్టం కలుగచేస్తాయని అర్ధం చేసుకోవడం ముఖ్యం.


నివారణా చర్యలు

  • మీరు ఏ రకం కలుపు మొక్కల నివారణకు ప్రయత్నిస్తున్నారో తెలుసుకోండి (సాధారణంగా వెడల్పు ఆకు కలుపు మొక్కలు vs.గడ్డి రకాలు) వీటికి సరిపడే కలుపు మందులను జాగ్రత్తగా ఎంచుకోండి.
  • డబ్బా పైన లేబుల్ ను జాగ్రత్తగా చదివి దానిపైన ఉన్నసూచనలను మరియు మోతాదుల వివరాలను అనుసరించండి.
  • వివిధ రకాల కలుపు మందులతో కలుషితం కాకుండా ఉపయోగించిన తర్వాత పిచికారీ చేయడానికి ఉపయోగించిన డబ్బాను శుభ్రంగా కడగండి.
  • ప్రక్కన పొలాల్లోకి ఈ మందులు చేరకుండా ఉండడానికి గాలి వీస్తున్న సమయంలో కలుపు నివారణ మందులను వాడకండి.
  • కలుపు మొక్కలపైన మాత్రమే గురిగా ఈ మందులను వాడడానికి సన్నని నాజిల్ ను పిచికారీ చేయడానికి వాడండి.
  • ఈ మందులను పచ్చిక బయళ్లు మరియు పొలాల్లో ముందుగా వాడి ఫలితాలను గమనించండి.
  • వాతావరణ సూచనలను గమనిస్తూ వర్షం వచ్చే సమయాలలో వీటిని వాడకండి.
  • ఉపయోగించిన తేదీ, ఉత్పత్తులు, వాడిన ప్రాంతం మరియు వాతావరణ పరిస్థితులు వంటి వివరాలను ఒక పట్టికలో పొందుపరచండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి