Wind Damage on Cucumber
ఇతర
తీవ్రమైన కరువు పరిస్థితులలో పెరిగే మొక్కల లక్షణాలు ఈ గాలి వలన కలిగే నష్టం యొక్క లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి. బలమైన గాలులు వీ స్తున్నప్పుడు అప్పుడే విత్తిన విత్తనాలు మట్టిలోనుండి పైకి వచ్చే అవకాశం ఉంది. కొత్తగా మొలకెత్తిన మొలకలు సాండ్ బ్లాస్టింగ్ వలన నష్టానికి గురవుతాయి. నిరంతర గాలి ఒత్తిడి వలన ముదురు మొక్కలలో ఆకులు వాడిపోయి కొన్నాళ్లకు ఎండిపోయి పెళుసుగా తయారవుతాయి. ఆకులు అంతర్నాళ క్లోరోసిస్ లక్షణాలను కలిగివుండి కొన్ని తీవ్రమైన పరిస్థితులలో చిన్న చిన్న ముక్కలుగా చింపబడినట్టుగా మారతాయి. ఇలా నిరంతరం గాలి ఒత్తిడికి గురికావడం వలన మొక్కల ఎదుగుదల తగ్గిపోతుంది. సీజన్లో తరువాత సమయంలో పువ్వులకు నష్టం కలగడం, పండ్లకు గాయాలు అవ్వడం వంటి లక్షణాలు కనపడతాయి. ఇలా దెబ్బతిన్న పండ్లపైన మొటిమల లాంటి మచ్చలు ఏర్పడడం వలన ఇవి అమ్మకానికి పనికిరావు. పువ్వులు సరిగా నిలబడకపోవడం వలన దిగుబడిలో నష్టం మరియు పండ్ల నాణ్యత తగ్గడం జరుగుతుంది.
గాలి వలన కలిగే నష్టాన్ని నివారించడానికి ఎటువంటి జీవ నియంత్రణ పద్దతి అందుబాటులో లేదు. పవన నిరోధకాలు ఏర్పాటు చేయడం వంటి నివారణా చర్యల ద్వారా ఈ నష్టం కలగకుండా నివారించవచ్చు.
వీలైనంతవరకు ఎల్లప్పుడూ నివారణా చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పంటను కొనసాగించాలా వద్ద అన్నది నిర్ణయించడానికి పంటకు ఎంత నష్టం జరిగింది అన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎటువంటి చికిత్స చేయాలి అనేది పంట దశ పైన కూడా ఆధారపడివుంటుంది. తీవ్రమైన పరిస్థితులలో మొక్కలకు ఫంగల్ మరియు బ్యాక్టీరియల్ వ్యాధులు సంక్రమించకుండా చికిత్స పద్దతులను ఎంచుకోవాలి. ఉదాహరణకు దెబ్బతిన్న మొక్కల భాగాలను కత్తిరించడం మరియు శిలీంద్ర నాశినులు మరియు యాంటీ బ్యాక్టీరియల్ ఉత్పత్తుల వాడకం వంటివి.
ఈ లక్షణాలు గాలి వలన ఏర్పడతాయి. ముఖ్యంగా నిరంతరం బలమైన గాలులు వీచే ప్రాంతాలు మరియు పవన నిరోధకాలు లేని పొలాలలో ఈ లక్షణాలు కనపడతాయి. గాలిలోకి లేచిన ఇసుక రేణువులు మరియు కదులుతున్న కొమ్మల వలన ఈ నష్టం కలగవచ్చు. గాలి వేగం, మొక్కలు ఈ పరిస్థితిని ఎదుర్కున్న సమయం మరియు మొక్క ఎదుగుదల దశను బట్టి ఈ లక్షణాల తీవ్రత ఆధారపడి ఉంటుంది. ఇసుక నేలల్లో పండించే లేత దోస మొక్కలు ఈ నష్టానికి గురయ్యే అవకాశం అధికంగా ఉంటుంది. కొమ్మలు కదులుతూ ఉండడం వలన ఆకులపైన మరియు పండ్లపైన గాయాలు ఏర్పడతాయి. ఇలా దెబ్బతిన్నకణజాలంపైన బాక్టీరియా మరియు ఫంగి నివాసం ఏర్పరచుకుని వాటిని కుళ్లిపోయేటట్టు చేస్తాయి. మొక్కలు తిరిగి కోలుకోవడం అన్నది మొక్క ఎదిగే దశ, మట్టిలో తేమ మరియు వాతావరణం మీద కూడా ఆధారపడి వుంటుంది.