Fruit Deformation
ఇతర
బాగా చిన్న చిన్న వెంట్రుకల వంటి అనేక పగుళ్లు టమోటో పై తొక్కపైన ఏర్పడతాయి. ఇవి కేంద్రీకృతమై ఉంటాయి. తొక్క బూడిద రంగులోకి మారడం మొదలు పెడుతుంది. ఇవి కొన్ని మిల్లీమీటర్ల పొడవు మాత్రమే ఉండి పండి పూర్తి స్థాయిలోకి ఎదిగినప్పుడు ఏర్పడడం మొదలవుతాయి. పురుగుల మందులు ప్రత్యక్షంగా తగిలిన పండ్లలో ఈ విధమైన పగుళ్లు కనపడతాయి. పురుగుల మందులు పండ్లలో సాగే గుణాన్ని తగ్గించడం వలన ఇలా పగుళ్లు ఏర్పడతాయి.
ఈ రుగ్మతకు ఎటువంటి జీవ నియంత్రణ లేదు. నివారణా చర్యల ద్వారా మాత్రమే దీనిని నివారించగలము.
వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణా చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. సరైన నివారణా చర్యలను తీసుకోవడం ద్వారా ఈ తెగులును నియంత్రించవచ్చు. ఒకసారి నష్టం కలిగితే ఇంకా దానిని మరల పూడ్చలేము. పురుగుల మందులను అధిక మోతాదులలో వాడడం లేదా ఒక దానితో ఇంకొక పురుగుల మందును కలపకుండా ఉండడం ద్వారా ఈ లక్షణాలను నివారించవచ్చు.
ఈ పగుళ్లు చిన్న పరిమాణంలో ఏర్పడినప్పటికీ ఈ రుగ్మత పండ్లు పెద్దవి అవుతున్నప్పుడు ఏర్పడే పగుళ్ళను పోలి ఉంటాయి. గ్రీన్ హౌసులో ఈ పరిస్థితి సాధారణంగా అధిక తేమ మరియు మట్టి లో తేమ శాతం మరియు పగలు రాత్రి ఉష్ణోగ్రతల మధ్యన వ్యత్యాసం వలన కలుగుతుంది. అవసరానికి అనుగుణంగా లేని నీరు ( కరువు, నీరు పెట్టడంలో నిలకడ లేకపోవడం/వర్షం, వరదలు) వలన అధిక లేదా తక్కువ పరిమాణంలో పోషకాలు మరియు కాంతి తీవ్రత కూడా ఈ పగుళ్లు ఏర్పడడానికి కారణం కావచ్చు. చివరగా సరైన పద్దతిలో వాడని లేదా అధిక మోతాదులలో వాడిన పురుగుల మందుల వలన ఈ పరిస్థితి తీవ్రత పెరగవచ్చు. పండ్లు కొత్తగా వచ్చే చిగుర్లతో పోషకాలు మరియు నీటి కోసం పండ్లు పోటీ పడడం కారణంగా పండ్లలో ఈ నష్టం మరింత అధికంగా వుండే అవకాశం చాలా అధికంగా ఉంటుంది.