టమాటో

టమాటో లో పెరిగిన పగుళ్ళు

Fruit Deformation

ఇతర

5 mins to read

క్లుప్తంగా

  • పండ్ల పైతొక్కపై చాలా అధికంగా ఒత్తిడి పడడం వలన అవి సాగే గుణం కోల్పోయి పైతొక్క పై పగుళ్లు ఏర్పడతాయి.
  • కాండం చుట్టూ కూడా ఈ పగుళ్లు ఏర్పడతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

టమాటో

లక్షణాలు

పండ్ల పైతొక్క పగిలిపోవడం మరియు చీలిపోవడం జరుగుతుంది. ఈ పగుళ్లు ఒకొక్క పండులో ఒక్కొక్క పరిమాణంలో ఉండవచ్చు. ఇవి ముఖ్యంగా పండు యొక్క పైభాగం చుట్టూ ఏర్పడతాయి. ఒకే ప్రాంతంలో ఒకే విధమైన గుండ్రని గాయాలు ఏర్పడడం వలన వివిధ రకాల భౌతిక సమస్యలు వస్తాయి. కొన్ని సార్లు మొగ్గ కొన కూడా ప్రభావితం అవుతుంది. పండ్లు ఎంత చిన్నగా వున్నప్పుడు ఈ సమస్య వస్తే, పగుళ్ల వలన జరిగే నష్టం అంత ఎక్కువగా వుంటుంది. పండు దాని తొక్క కన్నా అధికంగా ఎదగడం వలన ఈ రుగ్మత ఏర్పడుతుంది: తొక్క సాగే గుణం ఒత్తిడికి గురై చిన్న పగుళ్లు ఏర్పడి చివరికి అవి చీలిపోయి తెరుచుకుంటాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ సమస్యకు ఎటువంటి జీవ చికిత్సలు అందుబాటులో లేవు. దీనిని నివారణా చర్యలతో మాత్రమే నియంత్రించగలము.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లప్పుడూ నివారణా చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ రుగ్మతను సరైన నివారణా పద్దతులను పాటించడం వల్ల మాత్రమే నివారించగలము. నత్రజని అధిక వాడకాన్ని తగ్గించి మట్టిలో పొటాషియం స్థాయిలను గమనిస్తూ వుండండి.

దీనికి కారణమేమిటి?

పండ్లు అకస్మాత్తుగా ఒకేసారి వృద్ధి చెందడం వలన ఈ పగుళ్లు మరియు చీలికలు ఏర్పడతాయి. మొక్క అధికంగా నీటిని గ్రహించడం దీనికి కారణం అని చెప్పవచ్చు. చల్లని వాతావరణం నుండి తడి వాతావరణంలోకి మారడం, అధిక తేమ నుండి వెచ్చని మరియు పొడి వాతావరణంలోకి మారడం వంటి వాతవరణంలో అకస్మాత్తుగా వచ్చే మార్పులు వలన, మొక్క అకస్మాత్తుగా ఎదగడం వలన ఈ విధంగా జరుగుతుంది. సమతుల ఎరువులను వాడడం ద్వారా ఈ రుగ్మతను నివారించవచ్చు. ఉదాహరణకు పువ్వులు మరియు పండ్లు వృద్ధి చెందుతున్నప్పుడు అధిక నత్రజని వాడకం మరియు తక్కువ మోతాదులో పొటాషియం వాడడం వలన పండు అధికంగా వృద్ధి చెంది ఈ పగుళ్లు ఏర్పడతాయి.


నివారణా చర్యలు

  • పగుళ్లు ఏర్పడని విత్తన రకాలను ఎంచుకోండి.
  • అధిక మొత్తంలో నీరు పెట్టకండి.
  • ఒక్కసారే నీరు పెట్టకుండా స్థిరమైన పద్ధతిలో సరిపడా మొత్తంలో నీరు పెట్టండి.
  • రాబోయే తీవ్రమైన వాతావరణ మార్పులను పసిగట్టి అధిక తేమ శాతం మరియు తక్కువ సూర్యకాంతి వుండే సమయాలలో జాగ్రత్తలు తీసుకోండి.
  • మొక్కలు ఒత్తిడిని తట్టుకునే విధంగా సరైన సంఖ్యలో ఆకులు మరియు పండ్లు వుండేటట్టు చూసుకోండి.
  • అధిక మోతాదులో నత్రజని ఎరువులను వేయడం మరియు తక్కువ మోతాదులో పొటాషియం వేయడం చేయవద్దు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి