Iron Toxicity
ఇతర
ఇనుప ధాతువు విష ప్రభావం వరి పంట జీవిత చక్రం మొత్తంలో కనబడుతుంది. ప్రపంచంలోని వివిధ భాగాలలోని లోతట్టు ప్రాంతాల్లో సాగు చేసే వరిలో ఇది సంభవిస్తుంది. మొక్కల కణజాలంలో మెరుగైన శోషణ మరియు ఇనుప ధాతువు అధికంగా చేరడం విషపూరిత సమ్మేళనాల ఉత్పత్తికి దారితీస్తుంది. ఇది క్రమంగా పత్రహరితాన్ని నశింప చేయడం మరియు భౌతిక ప్రక్రియలకు అంతరాయం కలగచేస్తుంది. ఫలితంగా ఆకులు గోధుమ లేదా కాంస్య రంగులోకి మారతాయి. మొక్క వేరు ప్రాంతంలో ఇనుప ధాతువు అధిక సాంద్రత, మొక్క యొక్క వేరు ఆరోగ్యాన్ని బలహీనపరిచి అనేక ముఖ్యమైన పోషకాలను కావలసిన స్థాయిలో తీసుకోలేని పరిస్థితి కలిగిస్తుంది. దీనివలన దిగుబడి గణనీయమైన స్థాయిలో(10-100%) తగ్గుతుంది.
ఈ రుగ్మతకు ఎటువంటి జీవనియంత్రణ పద్ధతులు అందుబాటులో లేవు.
నేలల్లో ఇనుప ధాతువు విష ప్రభావం ఒక సమస్య కావచ్చు కనుక ఈ రుగ్మతను నిర్మూలించుటకు సరైన మోతాదులో రసాయన ఎరువులను వాడడం( ముఖ్యంగా పొటాషియం) మరియు సున్నం వేయడం ముఖ్యం ముఖ్యమైనవి. మాంగనీస్ ను రసాయన ఎరువులతో కలిపి వాడడం వలన మొక్క గ్రహించే ఇనుప ధాతువును తగ్గించదానికి సహాయపడుతుంది. ఆమ్ల నేలలకు సున్నం ఎక్కువగా సిఫార్స్ చేయబడింది. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేని పొలాల్లో ఇనుము మరియు సేంద్రియ పదార్థాలు అధికంగా కలిగిన నేలల్లో అధిక మోతాదులో సేంద్రియ పదార్ధాల (పెంట, గడ్డి) అధిక వాడకాన్నినివారించండి. అమోనియం సల్ప్ఫేట్(అధిక ఆమ్లతత్వం) బదులుగా నత్రజని ఎరువుల రూపంలో యూరియాను వాడండి.
మొక్క యొక్క వేర్ల భాగంలో ఇనుము అధికంగా పేరుకుపోవడం వలన ఇనుప ధాతు విషప్రభావం ఏర్పడుతుంది. ఈ రుగ్ముత వరద నేలలతో ముడిపడిఉంటుంది మరియు ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో సాగు చేసే వరి ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. సరిపడా నీరు వున్న నేలలు సరైన ఇనుము నిలువను మొక్కకు అవసరమైనంత తీసుకునే విధంగా చేస్తుంది. అధిక చర్యలు, ఆమ్ల నేలలు, నేల యొక్క ఆక్సిజనేషన్ మరియు భూసార స్థాయిలు కూడా ఈ పోషక సేకరణ మరియు శోషణలో పాత్రను పోషిస్తాయి. ఏరోబిక్ గా (సాధారణ ఆక్సిజన్ స్థాయిలు) వున్నప్పుడు 5.8 లోపు పి హెచ్ గల మరియు నాన్ ఏరోబిక్ గా (తక్కువ ఆక్సిజన్ స్థాయిలు) వున్నప్పుడు 6.5 లోపు పి హెచ్ గల నీరు ఎక్కువ కలిగిన నేలలలో ఇనుప ధాతువు విషప్రభావం కనపడుతుంది. పంట యొక్క ఒక నిర్దిష్ట పెరుగుదల స్థాయి వద్ద నేలలో సున్నం వేయడం, నేల సత్తువను పెంచడం, మరియు నేల నుండి నీరు బయటికి పోయేటట్టు చేయడం వంటి తగిన నిర్వహణ పద్దతులు. నేలలో మాంగనీస్ ఇనుముతో పోటీ పడుతుంది, కనుక ఈ సూక్ష్మ పోషకాన్ని చేర్చడం వలన మొక్క ఇనుప ధాతువును గ్రహించడాన్ని కొంత వరకు తగ్గిస్తుంది.