నిమ్మజాతి

తీక్షణమైన ఎండ తీవ్రత వలన టమాటా మాడిపోవడం

Abiotic Sunburn

ఇతర

క్లుప్తంగా

  • ఆకులు వాడిపోవడం మరియు పసుపు రంగులోకి మారడం జరుగుతుంది.
  • ఆకులు రాలిపోయినతర్వాత ఆకులు రాలిపోయిన తర్వాత పండ్లు మరియు బెరడు కూడా ప్రభావితమవుతాయి.

లో కూడా చూడవచ్చు

59 పంటలు
బాదం
ఆపిల్
అప్రికోట్
అరటి
మరిన్ని

నిమ్మజాతి

లక్షణాలు

నేరుగా ఎండ సోకడం మరియు అధిక ఉష్ణోగ్రతల వలన మొక్కలు, పొదలు లేదా చెట్లు మాడిపోవడం నష్టానికి కారణం అవుతుంది. ఈ కారకాలు మొక్కల కణజాలంలో తేమను మార్చేస్తాయి, మొదట లేత, చిగురు ఆకులు వాడిపోవడం జరుగుతుంది. ఈ ఆకులు క్రమంగా లేత ఆకుపచ్చ రంగులోకి మారుతాయి మరియు 2-3 రోజుల తరువాత వాటికి కొన వద్ద మరియు అంచుల వద్ద గాయాలు ఏర్పడతాయి. ఈ మాడిన గాయాలు తరువాత ఆకు మధ్యలోకి పాకుతాయి. కరువు ఒత్తిడి లేదా కీటకాల దాడి కూడా పండ్లు లేదా బెరడుకు సోకడం వలన తీక్షణమైన ఎండ తీవ్రతకు దారి తీసి ఆకులు రంద్రాలు పడడానికి దారి తీస్తుంది. బెరడులో పగుళ్లు మరియు చీలికలు ఏర్పడుతాయి, చివరికి ఇవి కాండంలో చనిపోయిన భాగాలగా అయిపోతాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

సూర్యరశ్మి సోకకుండా వైట్ క్లే లేదా టాల్క్ సమ్మేళనాలని ఆకుల మీద మరియు కాండం మీద చల్లవచ్చు. ఇది ఉష్ణోగ్రతలను 5-10°C వరకు తగ్గిస్తుంది. కాల్షియం కార్బోనేట్ లేదా క్రిష్టలైన్ లైమ్ స్టోన్ పై ఆధారపడిన ఉత్పత్తులు కూడా సిఫార్సు చేయబడడ్డాయి. కార్నోబా మైనపు ఉత్పత్తులు మొక్కలకు సహజ సన్ స్క్రీన్ గా పనిచేస్తాయి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఎరువుల సప్లిమెంట్ గా ఉపయోగించే అబ్సెసిక్ యాసిడ్, సన్ బర్న్ నష్టాన్ని ఆపిల్స్ వంటి పంటలలో తగ్గించుటకు ఉపయోగపడడమే కాక మరియు ఇతర పంటలలో కూడా పనిచేస్తుంది. పాలి-1-పి మీథేన్ ఆధారిత యాంటీ-ట్రాన్స్పిరాంట్, (నీరు ఆవిరి అవ్వని) ఆకులలోని నీరు అవిరి కావడాన్ని తగ్గించినట్లు కొన్ని పరిశోధనలో తేలింది.

దీనికి కారణమేమిటి?

సాధారణంగా అధిక సూర్యరశ్మి సోకే, అధిక గాలి ఉష్ణోగ్రతలు మరియు తక్కువ సాపేక్ష ఆర్ద్రత ఉన్న ప్రాంతాల్లో పెరిగే మొక్కలు లేదా వృక్షాలలో సన్ బర్న్ గాయం అవుతుంది. అధిక ఎత్తులో అతినీలలోహిత (UV) రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది కావున ఎత్తు కూడా దీనిలో పాత్ర పోషిస్తుంది. ఆకులు, పండ్లు మరియు బెరడు మీద ఈ లక్షణాలు కనిపిస్తాయి. సన్ బర్న్ యొక్క సంభవం మరియు తీవ్రత, మొక్క రకం, దాని పెరుగుదల మరియు నేల తేమ వంటి అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది. గాలిలో ఉష్ణోగ్రత మరియు సూర్యరశ్మి సోకే గంటలు వంటివి పండు ఏర్పడు సమయంలో తీవ్రంగా వుంటాయి. వాతావరణ మార్పులు కూడా చాలా ముఖ్యమైనవి. అందువలన చల్లని లేదా తేలికపాటి వాతావరణం వున్నప్పుడు అకస్మాత్తుగా వేడి, ఎండ వాతావరణానికి మారడం వలన కూడా నష్టం జరగగలదు.


నివారణా చర్యలు

  • తీక్షణమైన ఎండను బాగా తట్టుకునే రకాలను నాటండి.
  • పంటకు అవసరం మేరకు నీటిని పెట్టండి.
  • నీటి ఒత్తిడి మరియు తీక్షణమైన ఎండ నుండి ఉపశమనం కొరకు ఎండ తీవ్రత పెరగకముందే నీరు పెట్టండి.
  • వేసవి కాలంలో మొక్కలను అధికంగా కత్తిరించడం మరియు ఆకులు పీకటం చేయవద్దు.
  • తోటలో గాలి ప్రసరణను మెరుగుపరచండి.
  • నీడ కొరకు అవసరమైతే నెట్ లేదా పండ్లకు సంచి తొడగడం కూడా చేయవచ్చు.
  • నేల నీటిని నిలుపుకొను సామర్థ్యంను పెంపొందించుకోవడానికి వీలుగా సాళ్ళ మధ్యన కవర్ క్రాప్స్ ను (ఉదాహరణకు పైనాపిల్ తోటలో మొక్కజొన్న లేదా బఠానీ) వాడండి.
  • మొక్క లేదా చెట్టు స్ప్రింకర్లను కూడా వాడవచ్చు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి