లో కూడా చూడవచ్చు

1 పంటలు

టమాటో

లక్షణాలు

మొక్కల కాండం మీద గడ్డలు, చిన్న గుబ్బలు, వాపు లేదా చిన్న నూగు లాంటి వేర్లు. కాండం మీద వివిధ ప్రదేశాలలో ఇవి కనిపిస్తాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

పంటకు హానిచేయని ఈ సమస్యకు ఎటువంటి జీవ నియంత్రణ అవసరం లేదు; దీనిని నివారించడానికి కేవలం నివారణ చర్యలను అనుసరించండి.

రసాయన నియంత్రణ

పంటకు హానిచేయని ఈ సమస్యకు ఎటువంటి రసాయన నియంత్రణ అవసరం లేదు; దీనిని నివారించడానికి కేవలం నివారణ చర్యలను అనుసరించండి.

దీనికి కారణమేమిటి?

ఇవి పంటకు హాని కలగచేయవు, అయినప్పటికీ ఇవి టొమాటో మొక్క ఒత్తిడికి లోనవుతుందనే సంకేతం కావచ్చు. ఈ ఒత్తిడికి కారణం వేరు వ్యవస్థ దెబ్బతినడం, నీరు సరిగా పెట్టకపోవడం, అధిక తేమ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు. ఈ ఒత్తిడి కారకాలను నియంత్రించడానికి మరియు పరిస్థితులకు అనుగుణంగా మారడానికి ఇది మొక్క వేర్లు యొక్క సహజ ప్రతిస్పందన. నిర్దిష్ట పరిస్థితులలో (అదనపు తేమ, నీటి కొరత) ఉంచిన కొన్ని రకాల టమోటాలు ఈవిధమైన వేర్లను ఉత్పత్తి చేయగలవని కూడా గమనించాలి. సాంప్రదాయ రకాలలో ఈ వేర్ల అభివృద్ధికి ఎక్కువ అవకాశం ఉంది.


నివారణా చర్యలు

  • బలమైన వేర్లు పెరగడానికి టొమాటో కాండాన్ని లోతుగా, మొదటి ఆకులు ఎక్కడ మొదలవుతాయో అక్కడివరకు మట్టిలో నాటండి.
  • మట్టి మెత్తగా ఉండి నీరు నిలువ ఉండకుండా ఉండేలా చూసుకోండి మరియు తేమను స్థిరంగా ఉంచడానికి సేంద్రీయ రక్షక కవచాన్ని ఉపయోగించండి.
  • మొక్కలకు లోతుగా నీరు పెట్టండి కానీ బాగా తరచుగా పెట్టకండి ఇది మొక్క వేర్లు లోతుగా పెరగడంలో సహాయపడతాయి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి