ఇతరములు

పూత రాలుట

Blossom drop

ఇతర

క్లుప్తంగా

  • లేత పువ్వుల ఆకస్మిక మరణం.
  • పువ్వులు రాలిపోతాయి.


ఇతరములు

లక్షణాలు

మొక్క వికసిస్తుంది, కానీ ఆ తరువాత తరచుగా పువ్వులు చనిపోయి రాలిపోతాయి. రాలిపోయేముందు కొన్నిసార్లు పువ్వు కాడ పసుపు రంగులోకి మారుతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

సేంద్రీయ నియంత్రణలో ప్రధానంగా నివారణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీ సేంద్రీయ ఉత్పత్తుల పెంపకానికి మొక్కల పెరుగుదల నియంత్రకాలు అనుమతించబడినవో లేదో చెక్ చేయండి. అలా అయితే, రసాయన నియంత్రణ కోసం మార్గదర్శకాలను చదవండి.

రసాయన నియంత్రణ

జిఏ3 లేదా ఎన్ఏఏ వంటి ప్రత్యేక స్ప్రేలను ఉపయోగించడం ద్వారా రైతులు తమ గ్రీన్‌హౌస్ మొక్కలపై అధికంగా పూలు నిలబడేటట్టు చేయవచ్చు. ఇవ్వబడిన సూచనల ప్రకారం, సరైన సమయంలో పువ్వులపై పిచికారీ చేయడం ముఖ్యం. ఈ స్ప్రేలు ఎల్లప్పుడూ పని చేయవని గుర్తుంచుకోండి ఎందుకంటే అనేక విభిన్న కారణాలు మొక్కలు పుష్పించడాన్ని ప్రభావితం చేస్తాయి. ఇది ప్రతి సమస్యకు పరిష్కారం కాదు.

దీనికి కారణమేమిటి?

పరాగసంపర్కం మరియు మొక్కల ఆరోగ్యానికి అంతరాయం కలిగించే కారకాలు లేదా పరాగ సంపర్కం జరగకపోవడం వల్ల పువ్వులు రాలిపోవచ్చు. తక్కువ మరియు అధిక ఉష్ణోగ్రతలు, అలాగే పువ్వులు పరాగసంపర్కం తర్వాత పువ్వుల అభివృధికి అనుకూలం కాని తక్కువ మరియు అధిక తేమ స్థాయిలు ముఖ్యమైన కారణాలు. ఎక్కువ నత్రజని వాడకం పువ్వులకు బదులుగా ఆకులు పెరగడానికి ప్రోత్సహిస్తుంది. ఇది పండ్ల అభివృద్ధిని బలహీనపరుస్తుంది. అయితే మరీ తక్కువ నత్రజని వాడినట్లైతే అది పండ్లకు సపోర్ట్ ఇవ్వలేని బలహీనమైన తీగలను కలిగిస్తుంది. తగినంత నీరు పెట్టనట్లైతే అది మొక్కలపై ఒత్తిడిని కలిగిస్తుంది మరియు ఎక్కువ నీరు పెట్టినట్లయితే మొక్కల వేర్లు ఊపిరాడకుండా చేస్తుంది, దీని వలన పువ్వులు రాలిపోతాయి. తామర పురుగులు మరియు ఇతర పురుగులు మొక్కల కణజాలాలను దెబ్బతీస్తాయి, దీని వలన పువ్వులు రాలిపోతాయి మరియు శిలీంధ్ర వ్యాధులు మొక్కలను ఒత్తిడికి గురిచేస్తాయి, దేనివలన పూవ్వులు రాలిపోతాయి.


నివారణా చర్యలు

  • మీ స్థానిక వాతావరణంలో పెరిగే మొక్కల రకాలను ఎంచుకోండి.
  • ముఖ్యంగా గ్రీన్‌హౌస్ పరిసరాలలో పరాగ సంపర్కాలు అందుబాటులో ఉన్నాయని నిర్ధారించుకోండి.
  • కీటకాలు, గాలి లేదా చేతులతో కదపడం ద్వారా పరాగసంపర్కాన్ని ప్రోత్సహించండి.
  • పుష్పాల పరాగ సంపర్కం చెందుతున్నాయా లేదా అనేది చెక్ చేయండి: పరాగ సంపర్కం చేసే కీటకాలు సందర్శించిన పువ్వులు ప్రకాశవంతమైన పసుపు నుండి మరింత గోధుమ రంగులోకి మారుతాయి.
  • సరైన సమతుల్య ఎరువులు వాడండి.
  • పొడి వాతావరణ పరిస్థితులలో మొక్కలకు ఎక్కువగా నీరు పెట్టండి.
  • శిలీంద్ర నివారణ చికిత్సలు మరియు సమర్థవంతమైన తెగులు నియంత్రణతో ఆరోగ్యకరమైన టమోటా మొక్కలను పెంచండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి