Cell injury
ఇతర
ఆకు ఈనెల మధ్య ఎండిపోయి కమిలిన మరియు లేత గోధుమ రంగు అతుకులు కనిపిస్తాయి. అదనంగా వికసించిన మరియు లేత కాయలు దెబ్బతింటాయి. ఆకుల ఉపరితలాలపై గాయాలు లేదా గుంతలు, అలాగే రంగు పాలిపోవడం, నీటిలో తడిచినట్టు వున్న కణజాలం కనబడతాయి. దెబ్బతిన్న కణజాలం కమిలిపోయి దుర్వాసన రావచ్చు. ఆకులు ముందుగానే రాలిపోవచ్చు.
ఇది సహజంగా సంభవించేది కాబట్టి జీవ నియంత్రణ సాధ్యం కాదు.
అందుబాటులో ఉంటే జీవసంబంధమైన చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమగ్ర సస్యరక్షణ విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. ఇది సహజంగా సంభవించేది కాబట్టి రసాయన నియంత్రణ సాధ్యం కాదు.
మొక్క కణజాలం లోపల మంచు ఏర్పడి, మొక్క కణాలను గాయపరిచినప్పుడు మంచు వలన కలిగే నష్టం సంభవిస్తుంది, అందువల్ల, చల్లని ఉష్ణోగ్రత కంటే మంచు ఏర్పడటం అనేదే మొక్కను నిజంగా గాయపరుస్తుంది. వేర్లు భర్తీ చేసే తేమ కన్నా అధికంగా చల్లటి గాలులు ఎప్పుడూ పచ్చగా వుండే ఆకులనుండి తేమను తొలగిస్తాయి. దీని ఫలితంగా ఆకులు, ముఖ్యంగా ఆకు కొనలు మరియు అంచులు గోధుమ రంగులోకి మారుతాయి. పూర్తిగా బలపడిన మొక్కల కంటే లేత మొక్కలు మంచుకు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది.