క్యాబేజీ

లీఫ్ వేరిగేషన్

Chimera

ఇతర

క్లుప్తంగా

  • ఆకుల పైన ప్యాచీలుగా రంగు మారిపోవడం ఈ లీఫ్ వేరిగేషన్ లక్షణంగా వుంటుంది.
  • ఆకుల కణజాలం కొంత భాగం తెలుపు నుండి పసుపు రంగులోకి మారి ఒక మొజాయిక్ నమూనాలో ప్యాచీగా కానీ లేదా వరుస నమూనాలో కానీ ఉంటుంది.
  • ఈ పరిస్థితి నష్టం కలిగించదు.
  • కొంత శాతం మొక్కలలోనే ఇలా జరుగుతుంది.

లో కూడా చూడవచ్చు

17 పంటలు

క్యాబేజీ

లక్షణాలు

ఆకుల పైన ప్యాచీలుగా రంగు మారిపోవడం ఈ లీఫ్ వేరిగేషన్ లక్షణంగా వుంటుంది. పక్కనే వున్న కణజాలం సాధారణ పచ్చ రంగులోనే ఉంటుంది. దీనివలన ఆకుల కణజాలం కొంత భాగం తెలుపు నుండి పసుపు రంగులోకి మారి ఒక మొజాయిక్ నమూనాలో ప్యాచీగా కానీ లేదా వరుస నమూనాలో కానీ ఉంటుంది. ఒకోసారి కాండంపైన కూడా ఇటువంటి మచ్చలు కనపడతాయి. కొన్నిసార్లు ఈనెల వేరిగేషన్ ఏర్పడుతుంది. అంటే ఈనెల రంగు మారిపోతుంది కానీ మిగిలిన ఆకు అంతా ముదురు పచ్చ రంగులో ఉంటుంది. మొక్కలో అధిక ప్రాంతం దీనికి ప్రభావితమైతే క్లోరోఫిల్ లేకపోవడం వలన మొక్కల ఎదుగుదల తగ్గిపోతుంది. కానీ చాలా వరకు ఈ లోపం పొలంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతుంది. దీనివలన పంట దిగుబడికి నష్టం వాటిల్లదు.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఈ సమస్యకు ఎటువంటి ప్రత్యక్ష పర్యావరణ కారణం లేనందున దీనిని నివారించడానికి ఎటువంటి జీవ చికిత్స విధానం లేదు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ లీఫ్ వేరిగేషన్ ఒక జన్యు పరమైన లేదా భౌతిక పరమైన అవలక్షణం. దీనిని నివారించడానికి ఎటువంటి రసాయనిక చికిత్స అందుబాటులో లేదు.

దీనికి కారణమేమిటి?

ఈ లీఫ్ వేరిగేషన్ పర్యావరణ పరిస్థితులతో సంబంధం లేని ఒక జన్యుపరమైన లేదా భౌతిక అవలక్షణం. దీనికి ఎటువంటి వ్యాధికారక క్రిములతో సంబంధం లేదు. ఈ లీఫ్ వేరిగేషన్ సంక్రమించడానికి ముఖ్య కారణం కొన్ని ఆకుల కణజాలంలో క్లోరోఫిల్ శాతం తక్కువగా ఉండడం. ఇది చిన్న స్థాయిలో జరుగుతుంది. దీనివలన మొక్కలకు కానీ పంట దిగుబడికి కానీ ఎటువంటి నష్టం కలగదు. కానీ కొన్ని అలంకరణ మరియు గార్డెన్లో పెంచే మొక్కలు సహజంగానే ఈ లీఫ్ వేరిగేషన్ ను కలిగి ఉంటాయి. ఇది వాటి అందంలో ఒక భాగం.


నివారణా చర్యలు

  • తెలిసిన విత్తన రకాలు/హైబ్రీడ్ నుండి ధ్రువీకరించిన విత్తనాలనే ఉపయోగించండి.
  • విత్తనాలకు జన్యుపరమైన అవలక్షణాలు లేవని నిర్ధారించుకోండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి