టమాటో

టమోటో జిప్పరింగ్

Physiological Disorder

ఇతర

క్లుప్తంగా

  • నిర్జీవమైన మృత కణాలు పండు చుట్టూ ఏర్పడతాయి.
  • పండు తయారౌతున్నప్పుడు తక్కువ ఉష్ణోగ్రతలు మరియు అధికతేమ వలన ఈ రుగ్మత కలుగుతుంది.
  • ఈ రుగ్మత రాకుండా నివారించవచ్చు కానీ ఒకసారి వస్తే దీనికి ఎటువంటి చికిత్స లేదు.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

టమాటో

లక్షణాలు

ఇది ఒక భౌతిక రుగ్మత. దీని వలన గోధుమరంగు నిర్జీవమైన మచ్చలు పండు అంతటా ఏర్పడతాయి. దీనివలన ఆ ప్రాంతంలో పండు చీలుతుంది. ఈ చారలు పండుపై కొద్ది భాగంలో ఏర్పడతాయి. ఇవి పండు కాడ నుండి పండు క్రింద వరకు ఒక జిప్పర్ వలె ఏర్పడతాయి. అందువల్లనే ఈ చారలకు ఈ పేరు వచ్చింది. సాధారణంగా పండు పైతొక్క రూపు మారిపోయి గుజ్జు లోపల వరకు ఈ చారలు ఏర్పడతాయి. దెబ్బతిన్న కణాలు వాటి సాగే గుణాన్ని కోల్పోయి పండ్లు సరిగా వృద్ధి చెందవు. ఒక్కసారి ఈ చారలు ఏర్పడితే వీటిని తగ్గించడానికి ఇంక ఏమి చేయలేము.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఈ రుగ్మతకు ఎటువంటి జీవ నియంత్రణ చికిత్స లేదు. నివారణా చర్యల ద్వారా మాత్రమే దీనికి చికిత్సను చేయగలము.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణా చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. నివారణా చర్యల ద్వారా మాత్రమే దీనికి చికిత్స చేయగలము.

దీనికి కారణమేమిటి?

ఇది ఒక భౌతిక రుగ్మత. పూత దశ చివర్లో, పండు తయారౌతున్నప్పుడు తక్కువ ఉష్ణోగ్రతలు మరియు అధిక తేమ వలన ఈ రుగ్మత కలుగుతుంది. పండ్లు తయారౌతున్నప్పుడు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పుప్పొడి రేణువులు అండాశయం గోడకు అతుక్కుని ఉండిపోవడం వలన పండు పైతొక్క పైన చారలు వృద్ధి చెందుతాయి. ఉష్ణోగ్రత సున్నితత్వం అనేది ఒక్కొక్క మొక్క రకానికి ఒక్కొక్కలాగా ఉంటుంది. మిగతా వాటితో పోలిస్తే కొన్ని టొమాటో రకాలు బాగా సున్నితంగా ఉంటాయి. బీఫ్ స్టీక్ టొమాటోలు ఈ రుగ్మతకు బాగా దెబ్బతింటాయి.


నివారణా చర్యలు

  • చలి వాతావరణాన్ని తట్టుకునే రకాలను పెంచండి.
  • పూత దశ మరియు పండు ఏర్పడే దశలలో సరైన పర్యావరణ పరిస్థితులను కల్పించండి.
  • తక్కువ రాత్రి ఉష్ణోగ్రతలు మరియు తీవ్రమైన తేమ పరిస్థితులను నివారించండి.
  • చారలు పడిన పండ్లను ముందుగానే తొలగించి మొక్కల సత్తువ వ్యర్థం అవ్వకుండా చూడండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి