Schizotetranychus hindustanicus
పురుగు
చిన్న చిన్న బూడిద లేదా వెండి రంగు చుక్కలు ఆకులపైన కనపడతాయి. దీనిని స్టిప్పింగ్ అని అంటారు. ఇవి ఆకు మధ్య ఈనెల వెంట ఏర్పడి తర్వాత ఆకు మొత్తం వ్యాపిస్తుంది. సాధారణంగా చెట్ల అంచుల దగ్గర వుండే ఆకులు, పండ్లు మరియు కొమ్మలు అధికంగా దాడికి గురవుతాయి. తెగులు తీవ్రత అధికంగా వున్నప్పుడు ఈ చుక్కలు పెద్ద మచ్చగా కలిసిపోయి ఆకులు లేదా పచ్చ పండు ఒకేరీతిలో వెండి రంగు లేదా కాంస్యపు రంగులో కనిపిస్తాయి. దాడికి గురైన కణజాలం మెల్లగా గట్టిపడి కుళ్లిపోతుంది. దీనివలన ముందుగా ఆకులు రాలిపోయి కొమ్మలు డై బ్యాక్ చెందడం, పండ్ల నాణ్యత తగ్గడం మరియు చెట్టు సత్తువ తగ్గడం జరుగుతుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులలో ఉదాహరణకు పొడి, గాలి వాతావరణం, ఈ లక్షణాలు మరింత తీవ్రమౌతాయి. దీనికి విరుద్ధంగా నీటి సరఫరా సరిగా చేయడం వలన ఈ తెగులు సంక్రమించడం మరియు తెగులు వలన నష్టం తగ్గుతుంది.
స్చిజోటెట్రానేచుస్ హిందుస్తానికస్ కు చాలా అధిక సంఖ్యలో సహజ శత్రువులు ఉంటాయి. ఈ క్రిములకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే వీటి సహజ శత్రువులైన కీటకాలు వీటి వ్యాప్తిని అరికట్టడానికి సరిపోతాయి. వెబ్ గూళ్ళ వలన ఫైటోసెయిడ్ మైట్స్ (ఉదాహరణకు యూసీఎస్ స్టిపులటుస్) వీటిపైన ప్రభావం చూపలేవు. జెనుస్ స్టేతోరస్ జాతికి చెందిన కొన్ని లేడీ బర్డ్స్ ఏ పురుగులను చాలా ఆతృతగా తింటాయి. ఫంగి ముఖ్యంగా వైరస్ కూడా వీటి జనాభాను నియంత్రించడంలో ప్రధాన భూమికను పోషిస్తాయి. ఉష్ణోగ్రత కూడా దీనిపైన ప్రభావం చూపిస్తుంది.
వీలైనంతవరకు ఎల్లప్పుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. విస్తృత పరిధి కల పురుగుల మందులను వాడడం వలన చెట్లకు ప్రయోజనం కలిగించే కీటకాలకు నష్టం వాటిల్లి పరిస్థితి మరింత దిగజారుతోంది కాబట్టి ఎంపిక చేసిన పురుగుల మందులు అత్యధికంగా సిఫార్సు చేయబడ్డాయి. అనేక రకాల ఆకారిసిడ్స్ ను ఒకదాని తర్వాత వాడడం వలన పురుగులు ఈ మందులకు నిరోధకతను పెంచుకోకుండా నిరోధించవచ్చు.
ఈ లక్షణాలు స్కిజోటెట్రానిచూస్ హిందుస్తానికుస్ అనే పెద్ద మరియు పిల్ల సిట్రస్ హిందూ మైట్ ఆహారం తినడం వలన కలుగుతాయి. ఇవి ఆకుల క్రింద విచిత్రమైన సాలి గూళ్ళను ( 1-3 మిల్లీమీటర్లు వ్యాసార్థం) తయారు చేసుకుంటాయి. దీనివలన ఇతర పురుగుల నుండి ఇది వేరుగా ఉండి దీనికి "నెస్ట్ వెబ్బింగ్ మైట్" అనే పేరు వచ్చింది. పెద్ద పురుగులు ఈ గూడులో నుండి బైటకు వచ్చి ఇతర ఆకులు మరియు పండ్లపై దాడి చేస్తాయి. ఇంకా పరిణితి చెందని పురుగులు గూళ్ళ క్రింద స్థిరపడతాయి. కీటకాలు మరియు పక్షులు వీటిని ఇతర చెట్లకు వ్యాపింప చేస్తాయి. కలుషితమైన పనిముట్లు మరియు తప్పుడు క్షేత్ర పద్ధతులు ఈ తెగులు ఇతర తోటలకు విస్తరించేటట్టు చేస్తుంది. నీటి సరఫరాను సరిగా చేయడం వలన ఈ తెగులు సంక్రమించడం మరియు తెగులు వలన నష్టం తగ్గుతుంది. దీనికి విరుద్ధంగా తక్కువ లేదా అధిక తేమ , అధిక గాలి, కరువు లేదా సరిగా వృద్ధి చెందని వేరు వ్యవస్థ పరిస్థితిని మరింత దిగజారుస్తుంది.