Glomerella cingulata
శీలీంధ్రం
మొదటి లక్షణాలుగా చుట్టూ కేంద్రీకృత వలయాలతో, నొక్కుకుపోయినట్టు వుండే వృత్తాకార గాయాలు కనిపిస్తాయి. తేమతో కూడిన వాతావరణ పరిస్థితులలో, మృదువైన ముదురు గోధుమ రంగు పండు కుళ్ళు సంభవిస్తుంది. పొడి వాతావరణ పరిస్థితుల్లో, పండు నిర్జలీకరణం చెందుతుంది మరియు మమ్మీ లాగ మారుతుంది. ఈ రెండు సందర్భాల్లో, పండ్లు ముందుగానే రాలిపోతాయి. పండ్లు పక్వానికి వచ్చే సమయంలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.
పుష్పించే దశ ముందు మరియు కాయలు పక్వానికి వచ్చే దశలో ఆరియోబాసిడియం పుల్లన్‌ల యొక్క కొన్ని ఎండోఫైటిక్ జాతులను వాడినట్లైతే, కొలెటోట్రిచమ్ ఎస్‌పిపికి వ్యతిరేకంగా అధిక రక్షణను అందించడం గమనించబడింది.
అందుబాటులో ఉంటే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. పుష్పించే ముందు ఒకసారి మరియు పండ్లు ఏర్పడేటప్పుడు మరొకసారి, స్ట్రోబిలురిన్స్, మాంకోజెబ్ లేదా రాగి ఆధారిత శిలీంద్రనాశినులతో పిచికారీ వేయండి, . ఒకసారి పిచికారి చేసిన తర్వాత కూడా ఇంకా ఇన్ఫెక్షన్ మిగిలి ఉంటే ఈ మందులను రెండవసారి కూడా వాడాలి. చెట్టుపై మిగిలిపోయిన కోతలు మరియు కణజాలాల ద్వారా తిరిగి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి మొక్కల కత్తిరింపు తర్వాత ఈ మందులను వాడండి
గ్లోమెరెల్లా సింగ్యులాటా అనే శిలీంధ్రం మొక్కల కణజాలంలో నిద్రాణంగా ఉంటుంది, ఆపై బాగా తేమ లేదా పొడి పర్యావరణ పరిస్థితులలో సక్రియం అవుతుంది. వెచ్చని మరియు తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా పుష్పించే దశలో మరియు పంట కోతకు ముందు, గ్లోమెరెల్లా సింగ్యులాటా వృద్ధికి అనుకూలంగా ఉంటాయి. మమ్మీ గా మారి ఇంక చెట్టుకే వున్న ఏండ్లు ,మరియు ఆకులపై లేదా తెగులు సోకిన మొక్క తొక్క చెక్క కణజాలంపై ఈ వ్యాధి కారక సూక్షజీవులు జీవించి ఉంటాయి.