పిస్తా

పిస్తా పంటలో వడదెబ్బ

Abiotic Sunburn

ఇతర

క్లుప్తంగా

  • అంచుల నుండి ఆకులు వాలిపోవడం మరియు పసుపు రంగులోకి మారడం మొదలవుతుంది.
  • ఆకులు రాలిపోయిన తర్వాత పండ్లు మరియు బెరడు కూడా ప్రభావితమవుతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
పిస్తా

పిస్తా

లక్షణాలు

అబియోటిక్ సన్‌బర్న్ అంటే ప్రత్యక్ష సూర్యకాంతి మరియు అధిక ఉష్ణోగ్రతల కలయిక వల్ల చెట్లకు కలిగే నష్టం. ఈ కారకాలు మొక్కల కణజాలంలో తేమను మారుస్తాయి. దీనివలన ప్రారంభంలో లేత ఆకులు వాడిపోతాయి. ఈ ఆకులు క్రమంగా లేత ఆకుపచ్చ రంగులోకి మారుతాయి మరియు 2-3 రోజుల తర్వాత చివరికి పైభాగంలో మరియు అంచుల దగ్గర గాయాలు ఏర్పడటం ప్రారంభమౌతుంది. ఎండిపోయిన గాయాలు తరువాత ఆకు ఈనెల మధ్య ప్రాంతానికి పురోగమిస్తాయి. నీటి ఎద్దడి లేదా కీటకాల దాడి కారణంగా ఆకులు రాలిపోవడం వల్ల కూడా బెరడు ఎండిపోతుంది. అక్కడ, అవి పగుళ్లు మరియు క్యాంకర్లగా మారుతాయి, చివరికి ఇవి చనిపోయిన ప్రాంతాలుగా కాండం మీద వృద్ధి చెందుతాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

సూర్యరశ్మిని భౌతికంగా నిరోధించడానికి తెల్లటి బంకమట్టి లేదా పౌడర్ సూత్రీకరణలను ఆకులు మరియు కాండం పై స్ప్రే చేయవచ్చు. ఇది ఉష్ణోగ్రతలను 5-10 °C తగ్గిస్తుంది. కాల్షియం కార్బోనేట్ లేదా స్ఫటికపు సున్నపురాయి ఆధారిత ఉత్పత్తులు కూడా సిఫార్సు చేయబడ్డాయి. కార్నౌబా మైనపు ఉత్పత్తులు మొక్కలకు సహజ సన్‌స్క్రీన్‌గా పనిచేస్తాయి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. ఎరువుల సప్లిమెంట్‌గా వాడే అబ్సిసిక్ యాసిడ్ ఆపిల్ వంటి పండ్లకు వడదెబ్బ నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది మరియు ఇతర పంటలలో కూడా పని చేస్తుంది. ఆకుల ద్వారా నీటి నష్టాన్ని తగ్గించే పాలీ-1-పి మెంథీన్ ఆధారిత యాంటీ-ట్రాన్స్పిరెంట్ ఉత్పత్తులు కూడా కొన్ని అధ్యయనాలలో మంచి ఫలితాలను చూపించాయి.

దీనికి కారణమేమిటి?

అధిక సౌర వికిరణం, అధిక గాలి ఉష్ణోగ్రతలు మరియు తక్కువ సాపేక్ష ఆర్ద్రత ఉన్న ప్రాంతాల్లో పెరిగిన చెట్లలో వడ దెబ్బ గాయం సాధారణం. ఎత్తైన ప్రదేశాలలో అతినీలలోహిత (UV) రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎత్తు కూడా ఒక పాత్ర పోషిస్తుంది. ఆకులు, పండ్లు మరియు బెరడుపై లక్షణాలు కనిపిస్తాయి. మొక్క రకం, దాని ఎదుగుదల దశ, మట్టిలో తేమ వంటి అంశాలపై కూడా వడదెబ్బ సంభవించడం మరియు తీవ్రత ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా, పండ్లు వృద్ధి చెందే సమయంలో గాలి ఉష్ణోగ్రత మరియు ఎండ కాసే సమయం ఎక్కువగా ఉన్నప్పుడు వడదెబ్బ తీవ్రంగా ఉంటుంది. ఒకదాని తర్వాత మరొక రకమైన వాతావరణం రావడం కూడా ముఖ్యమైనదే: అందువల్ల, చల్లని లేదా తేలికపాటి వాతావరణం తర్వాత ఆకస్మికంగా వేడిగా, ఎండగా ఉన్నప్పుడు కూడా నష్టం జరగవచ్చు.


నివారణా చర్యలు

  • వడదెబ్బని తట్టుకోగల రకాలను ఉపయోగించండి.
  • నేల నీటి నిలుపుదల సామర్థ్యాన్ని పెంచడానికి వరుసల మధ్య కవర్ పంటలను ఉపయోగించండి (ఉదాహరణకు పైనాపిల్ తోటలో మొక్కజొన్న లేదా కంది).
  • పంట యొక్క నీటి అవసరాలకు బాగా సరిపోయేలా నీరు పెట్టండి.
  • చెట్టుకి ఒత్తిడి మరియు వడదెబ్బను నివారించడానికి వేడి గాలులు వీచే సమయంలో లేదా ముందుగా నీరు పెట్టండి.
  • వేసవిలో ఎక్కువగా కత్తిరించడం మరియు ఆకులను తొలగించడం చేయకండి.
  • పందిరి ద్వారా గాలి కదలికను మెరుగుపరచండి.
  • మొక్క లేదా చెట్టు స్ప్రింక్లర్ కూలింగ్ సిస్టమ్స్ ను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.
  • అవసరమైతే షేడ్ నెట్‌ని కూడా ఉపయోగించవచ్చు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి