Pseudopezicula tetraspora
శీలీంధ్రం
ప్రారంభంలో ఆకులపై మసకగా, పసుపు మచ్చలు కనిపిస్తాయి ఐతే ఆకులు సూర్యుడికి వ్యతిరేకంగా పట్టుకున్నప్పుడు వీటిని చాలా సులభంగా గుర్తించవచ్చు. ఈ మచ్చలలోని ద్వితీయ ఈనెలు గోధుమ రంగులో కనిపిస్తాయి. మచ్చలు విస్తరించినప్పుడు ఇవి పసుపు నుండి ఎర్రటి గోధుమ రంగులోకి మారుతాయి మరియు అవి ప్రధాన ఈనెల ద్వారా వేరు చేయబడినందున కోణాకారంలోకి మారతాయి (వ్యాధి యొక్క సాధారణ పేరు). ఆకు కణజాలం నిర్జీవంగా మారడం వలన, ఆరోగ్యకరమైన మరియు వ్యాధి కణజాలాల మధ్య పసుపు అంచును ఏర్పరుస్తాయి. ఎరుపు ద్రాక్ష రకాల విషయంలో, ఈ అంచు ఎరుపు రంగులో ఉంటుంది. సీజన్ చివరలో సంక్రమించే అంటువ్యాధులు ఆకులపై మచ్చల చుక్కలు వృద్ధి చెందడం ద్వారా వర్గీకరించబడతాయి మరియు ఇవి ముందుగానే రాలిపోతాయి. తెగులు సోకిన పూగుత్తులు ఎండిపోవడానికి కారణమవుతాయి. బొట్రిటిస్ ఎండు తెగులు వలె కాకుండా, ఈ తెగులు ద్రాక్ష కాడలకు మాత్రమే సంక్రమిస్తుంది. ఆకుల కాడకు సంక్రమించదు.
ఈ వ్యాధికి వ్యతిరేకంగా జీవ చికిత్సలు అందుబాటులో లేవు. భారీ నష్టాలను నివారించడానికి, తీవ్రంగా తెగులు సోకిన కొమ్మలను లేదా మొత్తం మొక్కలను తొలగించి, పండ్ల తోటకు దూరంగా లోతుగా పూడ్చడం లేదా కాల్చివేయడం ద్వారా వాటిని నాశనం చేయడం ఒక్కటే ఉత్తమమైన మార్గం. కలుపు బాగా తీయుట మరియు పారిశుధ్య కార్యక్రమాలు కూడా సిఫార్స్ చేయబడ్డాయి.
అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. వర్షాకాలం ముందు మాంకోజెబ్ కలిగిన శిలీంద్ర నాశినులను వాడి ఈ వ్యాధిని నియంత్రించవచ్చు.చిగుర్లు వచ్చే సమయంలో దీనిని వాడాలి. పండ్లు ఏర్పడే దశ మొత్తం, ఇంకా వర్షపు వాతావరణంలో మరింతగా ఈ రక్షణను కొనసాగించాలి.
పి. టెట్రాస్పోరా అనే ఫంగస్, శీతాకాలంలో ద్రాక్షతోటపై తెగులు సోకిన ఆకులలో జీవించి వుంటుంది. అందు వలన ఆకులు లేని నిద్రావస్థ సమయంలో కోత, ఈ శిలీంధ్రాలకు చోటివ్వదు. వసంత ఋతువులో తడి వాతావరణంలో శిలీంధ్ర బీజాంశం ఈ రాలిన ఆకుల నుండి విడుదలవుతుంది అలాగే గాలి మరియు నీటి తుంపర ద్వారా కొత్త ఆకులు మరియు పూల కాడలకు వ్యాపిస్తుంది. కుళ్ళిన ఆకులపై జీవించివున్న ఫంగస్ నుండి వసంత ఋతువులో సాధారణంగా ఒక సారి మాత్రమే సంక్రమణ జరుగుతుంది. అనేక రోజుల స్థిరమైన వర్షపాతం తరువాత, అప్పుడప్పుడు, తీగతో ఇంకా జతచేయబడే వున్నా కూడా తెగులు సోకి చనిపోయిన ఆకుల కణజాలంపై బీజాంశం ఏర్పడుతుంది. ఎదుగుతున్న కాలంలో తేమ పరిస్థితులు కొనసాగితే ద్వితీయ అంటువ్యాధులకు ఈ బీజాంశం కారణమవుతుంది. చాలా సంవత్సరాల వరకూ ఈ వ్యాధి కనిపించకపోయినా, దీర్ఘకాలం వర్షాలు పడిన సంవత్సరాలలో తీవ్రతరం కావడాన్ని ఇది వివరిస్తుంది.