ఇతరములు

వెస్ట్రన్ ప్లాంట్ బగ్

Lygus hesperus

కీటకం

క్లుప్తంగా

  • లేత పండ్లపై గుంటలు పడడం, డొల్లకావడం, మచ్చలు మరియు చౌకిన మచ్చలు ఏర్పడడం ఫలితంగా పరిపక్వత చెందిన పండ్లు వైకల్యం చెందడం లేదా "పిల్లి ముఖం" గా మారడం జరుగుతుంది.

లో కూడా చూడవచ్చు

12 పంటలు
ఆపిల్
అప్రికోట్
చిక్కుడు
క్యారెట్
మరిన్ని

ఇతరములు

లక్షణాలు

ఇవి తినడం వలన పూమొగ్గలు మరియు లేత పండ్ల అభివృద్ధికి నష్టం కలిగి లేత పండ్లపై వికారమైన మచ్చలు పడడం, గుంతలు మరియు నొక్కుకుపోయినట్టువున్న మచ్చలు ఏర్పడతాయి. పంట కోసే సమయానికి పండు బాగా వైకల్యం చెందుతుంది. ఈ లక్షణాలను "పిల్లి-ముఖం" అని పిలుస్తారు, మరియు ఉపరితలంపై ద్రవం స్రవించడాన్ని గమనించవచ్చు. పండ్ల లోపలిభాగంలో నష్టం పండు ఉపరితలం క్రింద తెల్లటి కార్కి ప్రాంతాలుగా కనపడతాయి మరియు విత్తనాలు క్షీణిస్తాయి. ఇవి తినడం వలన పూమొగ్గలు మరియు రెమ్మలు కూడా వికృతంగా తయారవుతాయి. ఇవి ముడుతలు పడి చనిపోవచ్చు. ఇవి దిగుబడిని గణనీయంగా తగ్గిస్తాయి. ఈ పురుగులు రాతి మరియు పోమ్ పండ్లతో సహా చాలా విస్తృతమైన పరిధిలో అతిధి మొక్కలను కలిగి ఉంటాయి, సాగు చేయని భూమిలో సహజంగా వచ్చే వృక్షాలు మరియు ప్రక్కనే వుండే కలుపు మొక్కలు ఉన్నాయి. ఈ తెగుళ్ళు చెట్ల పంటలపై పునరుత్పత్తి చేయవు, కానీ ఈ అతిధి మొక్కల పైనుండి తోటలను ఆక్రమిస్తాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

పెద్ద కన్నుబగ్స్, డేంసెల్ బగ్స్, అసాసిన్ బగ్స్ మరియు కొలోప్స్ పెంకు పురుగు వీటిని వేటాడే కీటకాలు. మైన్యూట్ పైరేట్ బగ్ వీటి గుడ్లను ఆశిస్తాయి. పరాన్నజీవి కీటకాలలో అనాఫెస్ అయోలెస్ మరియు ట్రిసోల్కస్ హాలిమార్ఫే ఉన్నాయి, ఇవి పిల్లి ముఖం పురుగుల గుడ్లలో గుడ్లు పెడతాయి. వేప సారం ఆధారిత ఉత్పత్తులు ఎల్. హెస్పెరస్ మరియు యి. కాన్స్పెర్సస్ యొక్క జనాభాను తగ్గిస్తాయి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పిల్లి ముఖం పురుగులకు వ్యతిరేకంగా ఎస్ఫెన్వాలరేట్, ఫార్మెటనేట్ హైడ్రోక్లోరైడ్, ఇండోక్సికార్బ్ లేదా లాంబ్డా-సైహలోథ్రిన్ కలిగిన పురుగుమందులు ప్రభావవంతంగా ఉంటాయి. ఈ సమ్మేళనాలు చేపలు మరియు జల అకశేరుకాలకు చాలా విషపూరితమైనవి మరియు స్ప్రే డ్రిఫ్ట్ మరియు ఉపరితల జలాలలో చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పెరిథ్రాయిడ్ ఉత్పత్తుల యొక్క పిచికారీలు కూడా పెద్ద పురుగులను లక్ష్యంగా చేసుకుంటాయి.

దీనికి కారణమేమిటి?

సాధారణంగా "పిల్లి-ముఖం" అని పిలువబడే లక్షణాలు అనేక జాతుల పురుగుల వలన సంభవిస్తాయి, వాటిలో మొక్కల పురుగు లైగస్ హెస్పెరస్ మరియు కంపు నల్లి యూస్కిస్టస్ కాన్స్పెర్సస్ వున్నాయి. పెద్ద పురుగులు శీతాకాలంలో నేల రక్షిత పొరలో జీవిస్తాయి. సీజన్ ప్రారంభంలో ఇవి ప్రక్కనే ఉన్న పొలాల్లో వెడల్పు ఆకుల పంటలు లేదా కలుపు మొక్కలను తింటాయి. తరువాత వేసవిలో ఈ ప్రత్యామ్నాయ అతిధి పంటలు ఎండిపోతున్నప్పుడు ఇవి పోమ్ మరియు పండ్ల చెట్ల పందిరిలోకి ఎగరవచ్చు. పెద్ద పురుగులు చదునుగా, కోలగా ఉంటాయి. ఈ పురుగులు పసుపు, ఆకుపచ్చ మరియు ముదురు గోధుమ నుండి నలుపు రంగులో ఉంటాయి. అన్నింటికీ వెనుక భాగంలో పసుపు లేదా పాలిపోయిన ఆకుపచ్చ త్రిభుజం ఉంటుంది. పెద్ద కంపు నల్లి చదునైన కవచ ఆకారాన్ని కలిగి ఉండి బూడిద నుండి గోధుమ, ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కంపు నల్లి పొడవైన, కోరల వంటి పీల్చే నోటి భాగాలతో ఉండి ఎగురుతున్నప్పుడు శబ్దాలు చేస్తాయి. వెడల్పాటి ఆకులు కలిగిన కలుపు మొక్కలతో కప్పబడిన నేలతో కూడిన పండ్ల తోటలలో లేదా అల్ఫాల్ఫా పొలాలు లేదా ఇతర అతిధి మొక్కల సమీపంలో ఉన్న తోటలలో ఇవి సమస్యగా ఉంటాయి.


నివారణా చర్యలు

  • పిల్లి ముఖం కలిగిన కీటకాలను వేటాడే కీటకాలను ఆకర్షించే మొక్కలను నాటండి మరియు పురుగుమందులను విచక్షణారహితంగా వాడకండి.
  • దుర్వాసన కలిగించే పెద్ద కంపు నల్లి ఉనికి కోసం పండ్ల చెట్ల పందిరిని తరచుగా గమనిస్తూ వుండండి.
  • ప్రక్కనే ఉన్న అతిధి కలుపు మొక్కలు ఎండిపోతున్నప్పుడు లేదా సమీపంలోని అతిధి పంటలు కోసినప్పుడు వీటిని పసిగట్టడానికి క్లిష్టమైన సమయాలు.
  • ఎండుగడ్డి పొలాలు, కలుపు మొక్కలు వున్న ప్రాంతం లేదా సాగు చేయని భూమికి ప్రక్కనే ఆప్రికాట్ చెట్లను నాటవద్దు.
  • సీజన్ ప్రారంభంలో కలుపు మొక్కలను తొలగించండి.
  • పంట కోసిన రెండు వారాలలోపు పండ్ల తోటను నరకవద్దు.
  • ఎందుకంటే నేలలో ఏదైనా క్రిముల ముట్టడి చెట్ల పందిరి పైకి చేరుతుంది.
  • పెద్ద పురుగులను పట్టుకోవడానికి ఊడ్చే నెట్ ఉపయోగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి