ప్రత్తి

చిన్న కొమ్ముల మిడత మరియు ఉష్ణమండల మిడత

Oxya intricata & Locusta migratoria manilensis

కీటకం

క్లుప్తంగా

  • ఆకులు మరియు రెమ్మల మీద కొరికిన గుర్తులు వుంటాయి మరియు ఆకు అంచులలో చాలా భాగం కత్తిరించబడి వుంటాయి.
  • పువ్వుల కాడల యొక్క మొదలు దెబ్బతిని తెల్లటి బుడిపెలు ఏర్పడడానికి కారణం అవుతుంది.
  • కంకులు కత్తిరించబడవచ్చు.

లో కూడా చూడవచ్చు


ప్రత్తి

లక్షణాలు

మిడత ఆకులను తిని అంచుల వద్ద నష్టం కలిగించడమే కాక ఆకును పెద్ద మొత్తంలో కొరికి నష్టపరుస్తాయి. అవి రెమ్మల వద్ద కూడా కొరుకుతాయి మరియు తరచుగా గుత్తులను విడగొడతాయి. వడ్ల గింజల మీద గుడ్లు, పసుపుపచ్చ మరియు గోధుమ రంగు లార్వాలు, పెద్దవి ఆకులను తిన్న గుర్తుల వంటివి ఈ తెగులు యొక్క ఇతర లక్షణాలు.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

కందిరీగలు, పరాన్నజీవి కీటకాలు మరియు పురుగులు, చీమలు, పక్షులు, కప్పలు, గూడును అల్లుకునే సాలెపురుగులు వంటి సహజంగా దొరికే జీవ సంబంధ ఏజెంట్లను ప్రోత్సహించండి. లార్వా జనాభాను తగ్గించుటకు వాటిని నష్టపరిచే శిలీంద్రంను, ఎంటొమోపతోజెనిక్ ఫంగస్ (మెటారిజమ్ అక్రిడమ్) ఉపయోగిస్తారు. ఉప్పు నీరు, వరి తవుడుతో కలిపి ఇంట్లో తయారు చేసిన విషపు ఎరలను వాడండి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. 10% కంటే తక్కువ నష్టం జరిగిన సందర్భాలలో వరి పొలాల్లో మిడతలను నియంత్రించడానికి ఆకులపై పిచికారీ చేసే పురుగుమందు స్ప్రేలను ఉపయోగించండి. గుళికలను వాడడం వలన ఉపయోగం ఉండదు. పెద్ద పురుగులను పట్టుకొనుటకు విషపూరితమైన బైట్ ట్రాప్స్ వాడండి. క్రోరోఫైరిఫోస్, బప్రోఫెజిన్, డైనోటేఫురన్, ఎటోఫెన్ప్రాక్స్ వంటి రసాయనాలను వీటి నియంత్రణకు వాడవచ్చు. వరి నాటడానికి ముందు వరి గట్లను మాలాథియాన్, క్వినాల్ ఫాస్ లేదా ఎండోసల్ఫాన్ తో శుద్ది చేయవచ్చును. మలాథియాన్‌ చల్లడానికి ముందు వరి గట్లను శుభ్రం చేయండి. ఇతర FAO సిఫార్సు చేయబడిన రసాయనాలలో బండియోకార్బ్ 80% WP @ 125 గ్రాములు / ఒక హెక్టారుకు, క్లోర్‌పైరిఫాస్ 50% EC @ 20EC @ 480గ్రాములు / ఒక హెక్టారుకు, డెల్టామెత్రిన్ 2.8% EC @ 450గ్రాములు / ఒక హెక్టారుకు సిఫారస్సు చేయబడినది.

దీనికి కారణమేమిటి?

గుడ్లు మరియు పెద్ద వాటి కారణంగా ఆకులు మరియుగుత్తుల మీద లక్షణాలుఏర్పడుతాయి. నీరు నిలువ వుండే వాతావరణం (ఉదా. వరి మడులు) దీని అభివృద్దికి అనుకూలం. మిడతలు 5 మిమీ నుండి 11 సెం.మీ వరకు పొడవు ఉంటుంది, మరియు అవి పొడవుగా మరియు సన్నగా లేదా పొట్టిగా మరియు లావుగా ఉంటాయి. ఆకుపచ్చ లేదా గడ్డి రంగులో ఉన్నందున అవి తమ పరిసరాల్లో సులభంగా కలిసిపోగలవు. ఆడకీటకాలు వరి ఆకుల మీద పసుపు గుడ్లు పెడతాయి. పెద్దకీటకాలలో రెక్కలు అభివృద్ధి అయ్యి, పెద్ద సంఖ్యలో గుమిగూడి వలస పోవచ్చు.


నివారణా చర్యలు

  • గుడ్లను మరియు పిల్ల పురుగులను నాశనం చేయుటకు వరి గట్లను శుభ్రం చేయండి.
  • నష్ట లక్షణాల కొరకు మరియు మిడత నింఫ్స్ లేదా పెద్దవాటి ఉనికి కోసం పొలాన్ని క్రమం తప్పకుండా గమనిస్తూ వుండండి.
  • రాత్రిపూట నెమ్మదిగా వుంటాయి కనుక ఆకుల నుండి పెద్దవాటిని పట్టుకోండి.
  • పురుగును నీటిలో ముంచేందుకు సీడ్ బెడ్ వేయండి.
  • చిన్న సీడ్ బెడ్స్ ను కీటకాలను పట్టుకొనుటకు ఒక నెట్ తో ఊడవండి.
  • కలుపు మొక్కలను తొలగించండి.
  • తెగులును నివారించడానికి సహాయపడే కీటకాల సంతతికి నష్టం కలిగించే రసాయనాలను తరచుగా వాడడం చేయవద్దు.
  • చలికాలంలో పంట కోత తరవాత గుడ్లు తినే భక్షకాలకు లోపలి గుడ్లు కనబడే విధంగా పొలాన్ని లోతుగా దున్నండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి