వరి

రైస్ స్కిప్పర్

Pelopidas mathias

కీటకం

క్లుప్తంగా

  • ఆకుల అంచులు మరియు కొనలను లార్వా తిని మొక్కలకు నష్టం కలుగచేస్తుంది.
  • లార్వా విశ్రాంతి తీసుకోవడానికి ఒక నారవంటి పదార్థంతో ఆకును వెనక్కు లేదా వేరొక వైపుకు మడత పెట్టి ఒక ఛాంబర్ ను ఏర్పరచుకుంటుంది.
  • కొన్ని పెద్ద లార్వాలు ఎక్కువ మొత్తంలో ఆకులను రాల్చి మధ్యలో ఈనెను మాత్రమే మిగులుస్తాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

వరి

లక్షణాలు

నాటిన లేత మొక్కలపై అవి మొదట దాడి చేస్తాయి. పెద్ద లార్వా అధికంగా ఆకులను రాలుస్తాయి. ఆకు కొనలను మరియు అంచులను, ఆకు పెద్ద భాగాలైన ఆకు కణాన్ని, నెమ్మదిగా ప్రధాన ఈనె వైపు సాగుతూ ఆకు మొత్తాన్ని అవి ఆహారంగా తీసుకొంటాయి. ఈ లార్వా ఆకు బ్లేడ్ నుండి ఆకు కొనలను కిందకు మడుస్తాయి లేదా ఆకు రెండు కొనలను దగ్గరకు చేర్చి ఆకులను దారంతో కుట్టినట్లు అతికిస్తాయి. ఇది ఈ పురుగులను పగటి పూట శత్రువుల నుండి రక్షించే ఒక గూడుగా ఉపయోగపడుతుంది. ఇవి చాలా ఆత్రుతతో ఉంటాయి మరియు కొన్నిపెద్ద లార్వాలు ఆకు కణజాలం మొత్తము మరియు ఈనెలను తిని ఒక్క ఆకు మధ్యభాగాన్ని మాత్రమే మిగులుస్తుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

పొలంలో రైస్ స్కిప్పర్ యొక్క సాంద్రతను వీటి సహజ శత్రువులు మరియు పరాన్నజీవులు నియంత్రించగలవు. చిన్న కందిరీగలు గుడ్ల మీద దాడి చేస్తాయి. పెద్ద కందిరీగలు మరియు టాచినీడ్ ఈగలు లార్వాను ఆశిస్తాయి. రెడువిడ్ కీటకాలు, ఇయర్ వింగ్స్ మరియు ఓర్బ్-వెబ్ సాలీళ్లు అరానిడే) ఈ పురుగులు ఎగిరే సమయంలో తింటాయి. కర్రను ఉపయోగించి వరి ఆకులను తట్టి లార్వాను తొలగించడం (తరవాత దానిని నీటిలో ముంచడం) కూడా ఉపయోగకరంగా వుంటుంది.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ తెగులు వరి పంటకు పెద్దగా నష్టం కలగచేయదు. అందువలన ఈ P. మథియాస్ తెగులును ఎటువంటి మందులను వాడనవసరం లేదు. సహజ శత్రువులు మరియు సాంప్రదాయ పద్ధతులు ఈ తెగులును నియంత్రించలేకపోతే పొలంలో నీటిని తీసివేసి క్లోర్ఫెరిఫోస్ ను పిచికారీ చేయండి.

దీనికి కారణమేమిటి?

ఇది అన్ని రకాల వరి పంటలలో కనిపిస్తుంది కానీ ఎక్కువగా వర్షాధార వరి పంటలో దీని ప్రభావం అధికంగా వుంటుంది. ఆరంజ్ మార్కింగ్ తో లేత గోధుమ రంగులో ఉండి రెక్కల పైన తెల్లటి మచ్చలు కలిగి ఉంటాయి. వాటి పేరుకు తగ్గట్టు పెద్దవి అడ్డ దిడ్డంగా మొక్కల మీద ఎగురుతూ వుంటాయి. ఆడ పురుగులు తెల్లటి లేదా పాలిపోయిన పసుపుపచ్చ రంగులో గుడ్లను పెడతాయి. వీటి లార్వాలు రాత్రిపూట చురుకుగా ఉంటాయి. ఇవి పచ్చరంగులో ఉండి తల ప్రక్క భాగంలో 50 మిల్లీమీటర్స్ సైజులో ఎర్రని నిలువు చారలు కలిగి ఉంటాయి. వీటి ప్యూపా లేత గోధుమ లేదా లేత పచ్చరంగులో ఉండి చివర భాగం కొనతేలి ఉంటుంది. కరువు, అధిక వర్షపాతం లేదా వరదలు వంటి తీవ్రమైన పరిస్థితులలో ఇవి బాగా వృద్ధి చెందుతాయి. అధికంగా పురుగుల మందులు వాడడం వలన పంటకు ప్రయోజనంగా వుండే కీటకాలు కూడా నాశనం అవుతాయి. దానివలన ఈ పురుగుల జనాభా మరింత వృద్ధిచెందుతుంది.


నివారణా చర్యలు

  • అందుబాటులో వున్నట్లైతే తెగులు నిరోధక వరి వంగడాలను ఉపయోగించండి.
  • P మతియాస్ బయటపడే సమయానికి మొక్కలు బలంగా ఎదిగేటట్టు సీజన్ కంటే ముందుగానే నాట్లు వేయండి.
  • పోలంలోకి కీటకాలు రాకుండా అడ్డుకునేందుకు మొక్కలను మందంగా నాటండి.
  • కీటకాల కోసం పొలాన్ని క్రమం తప్పక పర్యవేక్షించండి.
  • లార్వాను చేతితో తీసివేసి నీటిలో ముంచి చంపండి.
  • పురుగుల మందులు అధికమొత్తంలో వాడడం కన్నా వాటి సహజ శతృవులను ప్రోత్సహించడం మంచిది.
  • ఈ కీటకాల నుండి పంటకు నష్టం కలగకుండా ఉండడానికి మొక్కలకు సహజ నిరోధకత పెంచుటకు సరైన ఎరువులను వాడండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి