Gonatophragmium sp.
శీలీంధ్రం
సాధారణంగా ఈ తెగులు కంకులు వేసే సమయం నుండి పునరుత్పత్తి దశకు మొక్కలు చేరే సమయం మధ్యలో మొక్కలకు సంక్రమిస్తుంది. ప్రారంభంలో ఆకు ఈనెల మధ్యభాగంలో బేస్ వద్ద లేత పసుపుపచ్చ ఆకుపచ్చ నుండి లేత ఆరంజ్ రంగు మచ్చలు పిన్ సైజ్ లో కనబడుతాయి. ఈ తెగులు ముదిరే కొద్ది గాయాలు తొడుగుతో పాటు ఎర్ర చారలు లేదా గీతలను ఏర్పరుస్తూ ఆకు కొనవైపునకు వ్యాపిస్తాయి. ఈ మచ్చలు ఒక ప్రాంతంలో కలసిపోయి నిర్జీవ కణాలుగా మారతాయి. ఇది చూడడానికి ఎండిపోయినట్లు కనపడుతుంది. దీని లక్షణాలు నారింజ ఆకు ఎండు తెగులు లక్షణాల వలే వుండి తికమక పెడతాయి. తెగులు తీవ్రత ఎక్కువగా వున్నప్పుడు నారింజ ఆకు ఎండు తెగులును వేరు వేరుగా చేసి చూడడం దాదాపు అసాధ్యం. ఏమైనప్పటికీ, ఎరుపు రంగు చారలో, ఆకుకు ఒకటి లేదా రెండు మచ్చలు వుంటాయి మరియు ఇది ఆకు యొక్క కొన వైపు సాగిన చారతో ఒక నారింజ మచ్చ లక్షణంతో కనిపిస్తుంది.
ఈ తెగులుకు ఇప్పటికి జీవరసాయన నియంత్రణ అందుబాటులో లేదు. మీకు ఏదైనా తెలిసి వుంటే దయచేసి మాకు తెలుపండి.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. థియోఫనేట్ మీథైల్ గల పిచికారీలు ఈ తెగులును సమర్థవంతంగా నియంత్రిస్తాయి.
గోనటోఫ్రాగ్మియం జన్యువు యొక్క ఫంగస్ వలన వచ్చిన లక్షణాలుగా చెప్పవచ్చు. విత్తనాల ప్రారంభ దశ నుండి ఇది మొక్క మీద ఉన్నప్పటికి, మొక్కలు సాధారణంగా పునరుత్పాదక దశకు చేరుకున్నప్పుడు లక్షణాలు వృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. అధిక ఉష్ణోగ్రత, అనుకూలమైన గాలిలో తేమ, ఆకులపై అధికంగా తేమ ఉండడం మరియు అధిక మోతాదులో నత్రజని వాడడం అనేవి తెగులు వ్యాప్తికి అనుకూలమైన అంశాలు. ఇది రోగకారక కణజాలం లోకి ప్రవేశించి ఈనెల ద్వారా ఆకు యొక్క కొన వైపుకి తీసుకెళ్తున్న విషాన్ని ఉత్పత్తి చేస్తుంది, తద్వారా కొత్త రకం చారల నిర్మాణం జరుగుతుంది. ఆగ్నేయ ఆసియా మరియు భారతదేశాలలో ఎర్ర చార తెగులు వరి ఉత్పత్తికి అత్యంత ముప్పు కలిగించేది.