Phytoplasma spp.
బ్యాక్టీరియా
ఫైటోప్లాస్మా సంక్రమణ వలన అనేక వ్యాధి లక్షణాలు సంభవిస్తాయి, అయితే ఈ వ్యాధిని పెండలం మొక్కల పైభాగంలో కలిగించే చీపురు లాంటి ఆకు విస్తరణ కారణంగా అలా పిలుస్తారు. తరచుగా ఇది చిన్న, పసుపురంగు ఆకులను ఉత్పత్తి చేస్తూ నిద్రాణమైన రెమ్మలు పెరగడానికి కారణమై మొక్క పైన "మాంత్రికుల చీపురు" ఆకారంలో కనిపిస్తుంది. కాండం క్రింది భాగం స్వల్పంగా ఉబ్బవచ్చు. ఆకులు చుట్టుకుపోవడం మరియు ఆకులపై ఆకుపచ్చ మరియు పసుపురంగు నమూనా కనిపిస్తుంది. మందపాటి బాహ్య పొరలు మరియు లోతైన పగుళ్లతో వేర్లు సన్నగా మరియు చెక్క వలే పెరుగుతాయి. కొన్నిసార్లు వేర్ల చుట్టూ వున్న పగుళ్లు ఒక వలయాన్ని ఏర్పరుస్తాయి. దీనివలన మొక్క యొక్క పైభాగాలకు నీరు మరియు పోషకాల రవాణాలో ఆటంకం కలుగుతుంది మరియు విచిత్రమైన పెరుగుదలకు దారితీస్తుంది.
పెండలం అంటు మొక్కలు లేదా విత్తనాలను ఆరు గంటల పాటు 0.01% స్ట్రెప్టోమైసిన్ ద్రావణంలో నానబెట్టడం ద్వారా మొక్కల మరణాలను తగ్గించి, విత్తనాల అంకురోత్పత్తి రేటును పెంచవచ్చు. పురుగుల వాహకాల జనాభాను నియంత్రించడానికి కొన్ని రకాల పరాన్నజీవి కందిరీగలను ఉపయోగిస్తున్నారు.
అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పెండలం ఫైటోప్లాస్మా వ్యాధికి, ప్రస్తుతానికి 100% సమర్థవంతమైన రసాయన చికిత్స అందుబాటులో లేదు. అంట్లు మరియు విత్తనాల యాంటీబయాటిక్ చికిత్సలు వేరు దిగుబడి మరియు పిండి పదార్ధాలను గణనీయంగా పెంచాయి మరియు ఫైటోప్లాస్మా యొక్క అంటువ్యాధులను నియంత్రించడానికి వాటిని ఉపయోగించవచ్చు.
మొక్కల నాళ వ్యవస్థ లోపల మాత్రమే జీవించగలిగే ఫైటోప్లాస్మా అని పిలువబడే బ్యాక్టీరియా లాంటి జీవుల ద్వారా ఈ లక్షణాలు ప్రేరేపించబడతాయి. ప్రధానంగా ఇవి పెండలం మొక్కల కణద్రవాన్ని పీల్చుకునే పిండి నల్లి వంటి కొన్ని కీటకాల ఆహారపు అలవాట్ల ద్వారా వ్యాప్తి చెందుతాయి. పొలం లేదా ప్రాంతాల మధ్య తెగులు సోకిన మొక్కల పదార్థాల వాడకం లేదా రవాణా అనేవి వీటి వ్యాప్తికి అనుకూలించే మరో ముఖ్యమైన మార్గం. ఈ వ్యాధి చాలా దేశాలలో పెండలం పరిశ్రమకు తీవ్రమైన ముప్పుగా ఉంటుంది. ఫైటోప్లాస్మా వ్యాధి యొక్క అంటువ్యాధులు పెండలం మొక్కలను వాటి వృద్ధి దశలో ప్రభావితం చేసినప్పుడు కొన్నిసార్లు ఇవి మొత్తం దిగుబడిని కోల్పోతాయి. వ్యాధి సోకిన మొక్కల పదార్థాల కదలికను పరిమితం చేయడానికి క్వారంటైన్ చర్యలు కొన్ని దేశాలలో ఉన్నాయి మరియు వాటిని మరింత బలోపేతం చేయవచ్చు.