ఇతరములు

భౌతిక ఆకు మచ్చ తెగులు

PLS

ఇతర

క్లుప్తంగా

  • అనేక పరిమాణాల్లో మచ్చలు మరియు రంగుల్లో అనేక రకాల లక్షణాలు ఆకులపైన ఏర్పడతాయి.
  • మొక్కల అన్ని ఆకులపైనా, ఆకు ఈనెల వరకూ పరిమితమై, సాధారణంగా పదునైన అంచులు కలిగిన చుక్కల నమూనా కనపడుతుంది.
  • (ముదురు ఆకులకు మాత్రమే పరిమితమై ఉండి ఫంగి తో విస్తరించి).

లో కూడా చూడవచ్చు

2 పంటలు
బార్లీ
గోధుమ

ఇతరములు

లక్షణాలు

పంట రకం బట్టి, సీజన్ మరియు పంట యాజమాన్య పద్ధతులు బట్టి ఈ తెగులు లక్షణాలు పరిమాణంలో మరియు రంగులో మారుతూ ఉంటాయి. కొన్ని తృణ ధాన్యాల పంటల్లో పసుపు లేదా నారింజ రంగు సూక్షమైన చుక్కలు వృద్ధి చెందితాయి. మరియు ఇతర పంటల్లో గోధుమ లేదా ఎర్రని గోధుమ రంగు చుక్కలు ఏర్పడతాయి. కొన్నింటిలో ఈ మచ్చలు పెరిగి నీటిలో నానిన వేలి ముద్ర మచ్చల వలె మారతాయి. ఈ లక్షణాలురాగి రంగు మచ్చ తెగులు, నెట్ బ్లాట్చ్ తెగులు మరియు సెప్టోరియా ఆకు మచ్చ తెగులు వంటి ఫంగి తెగుళ్ళ లక్షణాలుగా పొరపాటు పడొచ్చు. కానీ ఈ మచ్చలు భౌతిక ఆకు మచ్చ తెగులు వలన ఏర్పడితే ఈ మచ్చలు మొక్క అన్ని ఆకులపైన ఏర్పడతాయి. అదే ఫంగస్ తెగుళ్లు సాధారణంగా మొక్కల క్రింది భాగంలో మొదలవుతాయి. ఈ తెగులు వలన ఏర్పడిన మచ్చలు పదునైన అంచులు కలిగి ఆకు ఈనెల వరకూ పరిమితమై ఉంటాయి. (ఫంగితో విస్తరించి ఉంటాయి).

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఈ తెగులుకు ఎటువంటి జీవన నియంత్రణ పద్ధతులు అందుబాటులో లేవు. మీకు ఏమైనా తెలిస్తే దయచేసి మాకు తెలియచేయండి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. మట్టిలో pH తటస్థంగా లేదా తక్కువగా ఉంటే దీనిని సరిదిద్దడానికి పోటాష్ ను పొటాషియం క్లోరైడ్ రూపంలో పొలంలో వాడాలి. మట్టిలో అధిక స్థాయిలో pH వున్నప్పుడు పోటాష్ వాడకం వలన పెద్దగా ఫలితం ఉండదు.

దీనికి కారణమేమిటి?

శీతాకాలంలో వేసే గోధుమ పంటలో ఈ తెగులు అధికంగా కనపడుతుంది. కానీ ఇతర తృణధాన్యాల పంటలు కూడా దీని ప్రభావానికి గురవుతాయి. పర్యావరణ కారకాల వలన కణజాలం ఆక్సిడైజ్ కావడంతో ( ఉదాహరణకు సూర్యరశ్మి వలన మొక్కల పైభాగంలో ఆకులకు కలిగే నష్టం లేదా మట్టిలో క్లోరైడ్ శాతం తక్కువగా ఉండడం) ఈ రుగ్మత ఏర్పడుతుంది. ఒక సారి చల్లని, మేఘావృతమైన మరియు తడి వాతావరణం వెంటనే వేడి, అధిక సూర్య రశ్మి పరిస్థితులు వంటి వాతావరణ పరిస్థితులు వంటి ఇతర వత్తిడులు ఈ రుగ్మతకు కారణంమౌతాయి. ఆకు కాడల పైభాగం మొదళ్ళ వద్ద పుప్పొడి మరియు నీరు చేరడం కూడా దీనికి ఒక కారణం అవుతుంది. ఈ ఆకు మచ్చ తెగులును రాగి రంగు మచ్చలు, నెట్ బ్లాట్చ్ మరియు సెప్టోరియా ఆకు మచ్చ తెగులుగా పొరపాటు పడే అవకాశం ఉంటుంది. కానీ ఈ తెగుళ్లకు ఇది దిగుబడిపైన ప్రభావం చూపించదు. అందువలన శీలింద్ర నాశినులను వాడాలా వద్దా అనేది నిర్ణయించే ముందు ఈ మచ్చలు తెగులు వలన కలిగినవో కావో అన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం.


నివారణా చర్యలు

  • మీ ప్రాంతంలో అందుబాటులో ఉంటే తెగులు నిరోధక రకాలను వాడండి.
  • పంటను క్రమం తప్పకుండ గమనిస్తూ ప్రయోగశాలలో ఈ తెగులును తనిఖీ చేయించండి.
  • తక్కువ క్లోరైడ్ కలిగిన నేలల్లో పంటను వేయకండి మరియు ఈ పోషకం కొరకు మట్టిని తరుచుగా గమనిస్తూవుండండి.
  • ఎరువులతో పాటు పొటాషియం క్లోరైడ్ రూపంలో పోటాష్ ను వుపయోగించండి.(మట్టిలో తక్కువ మోతాదులో pH వున్నప్పుడు మాత్రమే).

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి