పెండలం

పెండలంలో పొలుసు వ్యాధి

Aonidomytilus albus

కీటకం

క్లుప్తంగా

  • కాండం, చిగుర్లు మరియు కొన్నిసార్లు ఆకు భాగాలు ప్రభావితమవుతాయి.
  • ఇవి తెల్లని చిన్న పురుగులు మరియు స్రావాలతో పూత పూయబడి ఉంటాయి.
  • కాండం ఎండిపోయి గాలికి విరిగిపోతుంది.
  • మొక్క ఒక పొద లాగ కనిపిస్తుంది.
  • ఇవి వెండి-తెలుపురంగు పైపూతతో కోలాకారపు, ఆల్చిప్ప లాంటి పొలుసుల్లాగా ఉంటాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
పెండలం

పెండలం

లక్షణాలు

పిల్ల పురుగులు కణద్రవ్యాన్ని పీల్చడానికి కాండం చుట్టూ చేరతాయి. చివరికి దీనిపై తెల్లటి స్రావాలతో "పూత" పూస్తాయి. ప్రక్క రెమ్మలు, ఆకు కాడలు మరియు ఆకు యొక్క దిగువ భాగానికి కూడా ఈ వ్యాధి అప్పుడప్పుడూ సంక్రమిస్తుంది. ఆకులు పాలిపోయి, ఎండిపోయి, రాలిపోతాయి. అయితే తీవ్రంగా దాడికి గురైన మొక్కలు కుంగిపోతాయి. నాటిన సమయంలో తెగులు సోకినప్పుడు పొలంలో తెగులు లక్షణాలుగా అంటు వద్ద ప్యాచీలు ఏర్పడతాయి. పిల్ల పురుగులు అధికంగా తినడం వలన కాడలు ఎండిపోయి, బలహీనపడతాయి. దీనివలన ఇవి తరచుగా గాలికి విరిగిపోతాయి. వొరిగిపోయిన కాండం స్థానంలో మొక్క మళ్ళీ కొత్త చిగుర్లను ఉత్పత్తి చేస్తుంది. దీనివలన తెగులు సోకిన మొక్క విస్తారమైన కొమ్మలతో గుబురుగా కనిపిస్తుంది. ఈ మొక్కల్లో వేరు అభివృద్ధి పేలవంగా ఉంటుంది, మరియు దుంపలు తినడానికి పనికిరావు. పురుగుల దాడి మరియు కరువుతో గతంలో బలహీనపడిన మొక్కలలో లక్షణాలు మరింత తీవ్రంగా ఉంటాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

అంట్లను నాటడానికి ఉపయోగించే ముందు పెండలం వేర్లనుండి సేకరించిన ద్రవ సారంలో 60 నిమిషాల పాటు ముంచి ఉంచడం, A. ఆల్బస్‌ను చంపుతుంది. వేడి నీటిలో కూడా ముంచవచ్చు కాని ఇది తక్కువ ప్రభావవంతంగా ఉంటుంది. కాండాలను నిలువుగా నిల్వ చేయడం కూడా ముట్టడిని తగ్గించిందని గమనించబడింది. చిలోకోరస్ నైగ్రిటస్ వంటి కొన్ని కోకినెల్లిడ్ శత్రువులు కూడా వీటి జనాభాను తగ్గించడంలో సహాయపడతాయి. సేంద్రీయ ఎరువుల వాడకం ద్వారా లేదా సేంద్రియ పదార్థాలను కలపడం ద్వారా నేల సారం మెరుగుదల కూడా సహాయపడుతుంది.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. నివారణా చర్యగా, ముట్టడిని నివారించడానికి నిల్వ చేసే సమయంలో కాండాలను డైమెథోయేట్, డయాజిన్, మిథైల్ డెమిటన్ లేదా మలాథియాన్ (సూత్రీకరణలను బట్టి 0.01 నుండి 0.05%) ద్రావణాలలో 5 నిమిషాలు పిచికారీ చేయవచ్చు లేదా ముంచవచ్చు. నాటడానికి ముందు మలాథియాన్, డయాజినిన్ లేదా డైమెథోయేట్ కలిగిన ద్రవాలలో అంటు మొక్కలను ముంచడం వలన పెండలంలో పొలుసు వ్యాధిని నివారిస్తుంది.

దీనికి కారణమేమిటి?

అయోనిడోమైటిలస్ ఆల్బస్ అనే పొలుసు కీటకం వలన లక్షణాలు సంభవిస్తాయి. ఇది మొక్కలపై మనుగడ సాగిస్తూ మొక్కను ఆహారంగా తింటుంది. ఇది గాలి లేదా జంతువు / మానవ సంపర్కం ద్వారా వ్యాప్తి చెందవచ్చు. తిరిగి నాటడం కోసం అంటు మొక్కల వంటి తెగులు సోకిన మొక్కల పదార్థాల రవాణా కూడా ఈ వ్యాధిని చాలా దూరం వ్యాపింపచేస్తుంది. ఆడ పురుగులు మొక్కలను తిని మొగ్గల పొలుసుల క్రింద గుడ్లు పెడతాయి. కొన్ని రోజుల తరువాత చిన్న పురుగులు పొదగబడి, మొక్క ఇతర భాగాలకు పాకుతాయి. అక్కడ ఇవి కాళ్ళు కోల్పోయి నిశ్చలంగా ఉండిపోతాయి. ఇవి గుంపుగా కాండం యొక్క కణద్రవ్యాన్ని తింటాయి మరియు మొక్కలో నీటి పరిమాణాన్ని తగ్గిస్తాయి. పెద్ద పురుగులు తెల్లని మైనపు స్రావాన్ని ఉత్పత్తి చేస్తాయి మరియు వెండి-తెలుపు రంగు పూతతో కోలాకారపు మరియు ఆల్చిప్పల్లాంటి పొలుసులుగా వృద్ధి చెందుతాయి. మగ పురుగులు రెక్కలు కలిగివుండి, తక్కువ దూరాలకు ఎగురుతాయి. మరియు ఆడ పురుగులు రెక్కలు లేకుండా నిశ్చలంగా ఉంటాయి. భారీ వర్షాలు మరియు ప్రచండమైన గాలులు మొక్కల నుండి వ్యాధికారక కణాలను తొలగించవచ్చు. దీనికి విరుద్ధంగా, సుదీర్ఘ పొడి పరిస్థితులు మొక్కలను మరింతగా తెగులుకు గురి చేస్తాయి మరియు దాని వ్యాప్తికి అనుకూలంగా ఉంటాయి.


నివారణా చర్యలు

  • వీలైతే నాటడానికి ధృవీకరించబడిన మూలాల నుండి పొలుసులు లేని అంట్లను మాత్రమే ఉపయోగించండి.
  • మీ ప్రాంతంలో అందుబాటులో ఉంటే నిరోధక రకాలను ఉపయోగించండి (కొన్ని జాతులు ఉన్నాయి).
  • గాలి మరియు విస్తరించిన పగటి కాంతి మొక్కలకు సులభంగా అందడానికి ఆరోగ్యంగా వున్న కాండాలను నీడలో నిలువుగా ఉంచాలి.
  • మొక్కల మధ్య తగినంత స్థలం పెండలంలో పొలుసు వ్యాప్తి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  • పొలాన్ని గమనిస్తూ, తెగులు సోకిన కాండాలను నాశనం చేయండి.
  • ముట్టడి తరువాత పంటకు వ్యాపించకుండా నివారించడానికి పంట మార్పిడిని ప్లాన్ చేయండి.
  • మళ్ళీ నాటడానికి ముందు కనీసం మూడు రోజులు పొలాన్ని బీడుగా ఉంచండి.
  • ఎగుమతి చేసే మరియు దిగుమతి చేసుకున్న పెండలం అంట్లను వ్యాధి లక్షణాల కోసం పరిశీలించండి.
  • తెగులు సోకిన పెండలంను రవాణా చేయవద్దు, కానీ వెంటనే కాల్చడం లేదా లోతుగా పాతిపెట్టడం ద్వారా నాశనం చేయండి.
  • పురుగుమందుల అధిక వినియోగాన్ని నివారించండి, ఎందుకంటే ఇవి పొలుసుల యొక్క సహజ శత్రువులను చంపవచ్చు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి