Mononychellus tanajoa
పురుగు
సాధారణంగా ఈ పురుగులు లేత ఆకుల క్రిందిభాగంలో, ఆకుపచ్చ కాడలు మరియు పెండలం యొక్క అనుబంధ మొగ్గలను తింటాయి. ఇవి వాటి తమ సూది వంటి మరియు పీల్చే నోటి భాగాలను కణాలలోకి చొప్పించి సారంతో పాటు ఆకుపచ్చ పత్రహరితాన్నీ సంగ్రహిస్తాయి. ఆకులపై ఇవి తిన్న గుర్తులు సూక్ష్మమైన పసుపురంగు పాలిపోయిన చుక్కలు లాగా కంటికి కనిపిస్తాయి. తెగులు అధికంగా వున్నప్పుడు పేలవమైన పెరుగుదలతో కూడిన ఆకు మచ్చలకు దారితీస్తుంది. తరువాత ఇది చనిపోయి, రాలిపోతుంది. చివరన ఉండే రెమ్మలపైన దాడి చేయడం వలన, అది ఒక 'క్యాండిల్ స్టిక్' చిహ్నానికి దారితీసి నిర్జీవంగా చేస్తుంది మరియు చిగుర్లు రాలిపోతాయి. 2-9 నెలల వయస్సు గల పెండలం మొక్కలు ఈ తెగులుకు ఎక్కువగా గురవుతాయి. వీటి తీవ్రమైన దాడి వలన దుంప దిగుబడి 20-80% వరకు తగ్గుతుంది. అంతేకాక పెండలం కాండం యొక్క నాణ్యత కూడా తగ్గుతుంది. దీని ఫలితంగా పంట నిరంతరాయంగా వేయడానికి అంటు మొక్కల కొరత ఏర్పడుతుంది.
అనేక శత్రు కీటకాలు వీటి జనాభాను సమర్థవంతంగా తగ్గిస్తాయని తెలియవచ్చింది. అంబ్లిసియస్ లిమోనికస్ మరియు ఎ. ఇడియస్ వాడకం ఆకుపచ్చ సాలీడు ముట్టడిని 50% తగ్గించింది. వీటి శత్రువులైన టైఫ్లోడ్రోమలస్ అరిపో మరియు టి. మణిహోటి పెండలం పచ్చ సాలీడు యొక్క జనాభాను విజయవంతంగా నియంత్రిస్తాయని ఆఫ్రికాలోని అనేక దేశాలలో నిరూపించబడింది. యి. నియోజైగైట్స్ జాతికి చెందిన పరాన్నజీవి శిలీంధ్రాలు కూడా అనేక దేశాలలో మంచి ఫలితాలను చూపించాయి, దీనివలన పెండలం పచ్చ సాలె పురుగులు చనిపోతాయి. వేప నూనె సమ్మేళనాలు కలిగిన పిచికారీలు కూడా సంతృప్తికరమైన ఫలితాలను ఇస్తాయి.
అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. మోనోనిచెల్లస్ టానాజోవా పై రసాయన నియంత్రణ సిఫారసు చేయబడలేదు ఎందుకంటే ఇది నిరోధకత మరియు ద్వితీయ వ్యాధి వ్యాప్తికి దారితీస్తుంది. అకరిసైడ్ అబామెక్టిన్ మాత్రమే తెగులు నియంత్రణకు ప్రభావవంతంగా పనిచేస్తుందని కనుగొనబడింది.
ఆకుపచ్చ సాలె పురుగులు మోనోనిచెల్లస్ టానాజోవా మరియు మోనోనిచెల్లస్ ప్రోగ్రెసివస్ తినడం వలన లక్షణాలు సంభవిస్తాయి. ఇవి వాటి తమ సూది వంటి మరియు పీల్చే నోటి భాగాలను కణాలలోకి చొప్పించి సారాన్ని సంగ్రహిస్తాయి. ఇవి పెండలం పంటలో చిన్న తెగుళ్ళుగా పరిగణించబడతాయి కాని అనుకూలమైన పరిస్థితులలో, ఉదాహరణకు పొడి కాలంలో, ఇవి గణనీయమైన నష్టాన్ని కలిగిస్తాయి. ఇవి ఒక మొక్క నుండి మరొక మొక్కకు చురుకుగా కదలగలవు. కానీ గాలి మరియు నీటి తుంపర్ల ద్వారా కూడా వ్యాపించవచ్చు. అంటు మొక్కలపై ఇవి 60 రోజుల వరకు జీవించగలవు. తెగులు సోకిన మొక్కల పదార్థాలను పొలం లేదా పొలాల మధ్య రవాణా చేస్తారు కాబట్టి, తరచుగా, రైతులే వీటి ప్రధాన వాహకం. చిన్న పురుగులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇవి పెద్దవైన తర్వాత పసుపు రంగులోకి మారతాయి. ఒకే శరీర భాగం వంటి రూపాన్ని ఇచ్చే వీటి అస్పష్టమైన శరీర విభజన ద్వారా ఇవి గుర్తించబడతాయి. దీనికి రెక్కలు, కలిసివున్న కళ్ళు మరియు యాంటెన్నా ఉండదు. పెద్ద ఆడ పురుగులు, మగ పురుగుల కంటే పెద్దగా వుంటాయి మరియు 0.8 మిమీ పరిమాణం వరకు పెరుగగలవు.