పెండలం

గోధుమ రంగు ఆకు మచ్చ

Clarohilum henningsii

శీలీంధ్రం

క్లుప్తంగా

  • టాన్ రంగు కోణాకారపు మచ్చలు లేదా అతుకులు ఆకు ఉపరితలంపై గోధుమరంగు కలిగిన పైకి లేచిన అంచులతో, ప్రధాన ఈనెల వరకు ఏర్పడతాయి.
  • ఈ మచ్చల మధ్య భాగం పొడిగా మారి రాలిపోతాయి.
  • తెగులు తీవ్రత అధికంగా వున్నప్పుడు మచ్చల చుట్టూ పసుపు రంగు పాలిపోయిన వలయం వృద్ధి చెందుతుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
పెండలం

పెండలం

లక్షణాలు

భూమిపై రాలిన తెగులు సోకిన పెండలం ఆకులలో ఈ ఫంగస్ జీవిస్తుంది. ఇది గాలి లేదా వర్షపు తుంపర్ల ద్వారా కొత్త ఆకులు మరియు మొక్కలకు వ్యాపిస్తుంది. చిన్న వృత్తాకార, ఆకుపచ్చ-పసుపు మచ్చలుగా ప్రారంభమయ్యే మచ్చలకు ఎం. హెన్నింగ్సి కారణమవుతుంది. ఇవి విస్తరించినప్పుడు ప్రధాన ఆకు ఈనెలచే వేరు చేయబడడమే కాక కోణీయ ప్యాచీలుగా వృద్ధి చెందుతాయి. మొక్క లేదా ఎగువ ఉపరితలంపై లేత టాన్ నుండి వివిధ పరిమాణాలలో మరియు ముదురు గోధుమ రంగుతో, కొద్దిగా వుబ్బెతైన అంచులతో మచ్చలు ఏర్పడతాయి. కొన్నిసార్లు ఈ ప్యాచీలు దాటిన చిన్న ఆకు ఈనెలు నిర్జీవ లైన్లుగా కనిపిస్తాయి. కాలక్రమేణా, మచ్చల మధ్యభాగం ఎండిపోతుంది. తీవ్రమైన ఇన్ఫెక్షన్లలో ఆకు మచ్చలు మైసిలియం ద్వారా ఉత్పత్తి చేయబడిన విషపూరిత పదార్ధాల వలన ఏర్పడిన పసుపు రంగు వలయంతో చుట్టుముట్టబడతాయి. చివరికి ఈ మచ్చలు ఒకదానితో మరొకటి కలిసి మొత్తం ఆకును కప్పేస్తాయి. దీనివలన ఆకులు ముందుగానే రాలిపోతాయి. ఆకుల క్రింది భాగంలో ఈ మచ్చలు బూడిదరంగులో వుండి మరియు తక్కువ విసృష్టంగా ఉంటాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఫంగస్ వ్యాప్తిని నియంత్రించడానికి జీవ నియంత్రణ చర్యలు అందుబాటులో లేవు. ఈ తెగులును నివారించడానికి తెగులు లేని మొక్కలు నాటడం మరియు తగిన నివారణ చర్యలను ఉపయోగించడం చాలా అవసరం.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పెండలంలో గోధుమ రంగు ఆకు మచ్చ తెగులును థియోఫనేట్ (0.20%), క్లోర్తలోనిల్ కలిగి ఉన్న శిలీంద్ర సంహారిణి పిచికారీలతో సమర్థవంతంగా నియంత్రించవచ్చు. రాగి శిలీంద్ర నాశినులైన మెటలాక్సిల్ మరియు మాంకోజెబ్ కూడా సిఫార్సు చేయబడ్డాయి.

దీనికి కారణమేమిటి?

మైకోస్ఫెరెల్లా హెన్నింగ్సి అనే ఫంగస్ వలన ఈ లక్షణాలు సంభవిస్తాయి. ఈ ఫంగస్ తెగులు సోకిన పెండలం మొక్క ఆకులలో లేదా భూమిపై వున్న పంట అవశేషాల్లో జీవిస్తుంది. దీనికి అనుకూల పరిస్థితుల్లో ఇది గాలి లేదా వర్షపు తుంపర్ల ద్వారా కొత్త ఆకులు మరియు మొక్కలకు వ్యాపిస్తుంది. వాస్తవంగా దీని బీజాంశాలు ఆకుల ఉపరితలం క్రింద పాలిపోయిన నిర్జీవ ప్యాచీల క్రిందిభాగంలో ఉత్పత్తి అవుతాయి. వెచ్చని, తేమతో కూడిన వాతావరణం ఫంగస్ యొక్క జీవిత చక్రానికి అనుకూలంగా ఉంటుంది మరియు వ్యాధి యొక్క తీవ్రతను పెంచుతుంది. తెగులు సోకిన మొక్కలు ఇతర పొలాలకు రవాణా చేయబడినప్పుడు ఈ తెగులు సుదూర ప్రాంతాలకు విస్తరిస్తుంది. సాధారణంగా లేత ఆకుల కంటే ముదురు ఆకులు ఈ వ్యాధికి అధికంగా గురవుతాయి.


నివారణా చర్యలు

  • తెగుళ్లు లేని అంట్లను మాత్రమే ఉపయోగించండి.
  • మీ ప్రాంతంలో అందుబాటులో ఉంటే తెగులు నిరోధక మొక్క రకాలను వాడండి.
  • తోటలోనికి మంచి వెంటిలేషన్ కోసం మొక్కల మధ్య బాగా అంతరం ఉండేలా చూసుకోండి.
  • తడి సీజన్ ప్రారంభంలో మొక్కలు నాటండి.
  • దీనివలన తెగులు సంక్రమించే అవకాశం సమయానికి మొక్కలు బలంగా తయారవుతాయి (పొడి సీజన్లో 6-8 నెలల వయస్సు).
  • వ్యాధి బారిన పడటానికి ఎక్కువ అవకాశం వున్న పాత మొక్కల పక్కన కొత్త పెండలం పంటలను నాటవద్దు.
  • ఫంగస్‌ను తొలగించడానికి ఎండాకాలంలోరాలిన ఆకులను సేకరించి కాల్చివేయండి.
  • ప్రత్యామ్నాయంగా తెగులు సోకిన మొక్కలను లోతుగా పాతిపెట్టడం లేదా కాల్చివేయండి.
  • వ్యాధికారక సూక్ష్మ జీవులు పొలంలో ఎక్కడా మనుగడ సాగించడం లేదు అని నిర్ధారించుకోవడానికి ప్రతి 3 నుండి 5 సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి పాటించండి.
  • పెండలం సాగులో వాడిన పరికరాల విషయంలో మంచి పరిశుభ్రత పాటించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి