కందులు

పప్పు ధాన్యాల్లో వేరు కుళ్ళు తెగులు

Rhizoctonia solani

శీలీంధ్రం

క్లుప్తంగా

  • ఈ తెగులు వేర్ల మీద గుంతల వంటి మచ్చలు, గాయాలు, పాలిపోయిన గోధుమ రంగు, వేరు కుచించుకు పోవడం మరియి వేరు కుళ్ళిపోవడం జరుగుతుంది.
  • వేరు బుడిపెలు చిన్నగా, రంగు కోల్పోయి కళావిహీనంగా మారి తక్కువ మొత్తంలో ఉంటాయి.
  • మొలకలు వచ్చిన వెంటనే మాడిపోవడం లేదా చనిపోవడం జరుగుతుంది.
  • మొక్కల తరువాత దశలలో ఈ తెగులు సోకితే ఎదుగుదల ఆగిపోయి రంగు కోల్పోతాయి.

లో కూడా చూడవచ్చు

3 పంటలు

కందులు

లక్షణాలు

ఈ తెగులు ముఖ్యంగా వేర్లను ప్రభావితం చేస్తుంది, దానివలన మొక్క సరిగా నిలదొక్కుకోక ఎదుగుదల మందగించి దిగుబడి తగ్గిపోతుంది. వేర్ల మీద గుంటల వాంయి మచ్చలు మరియు గోధుమ రంగు లేదా నల్లగా మారిపోవడం, వేరు వ్యవస్థ కుచించుకపోవడం మరియు వేర్లు కుళ్ళిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒకవేళ మొక్కలు సరిగా పెరిగినా వేరు బుడిపెలు తక్కువ సంఖ్యలో, చిన్నగా మరియు పాలిపోయి వుంటాయి. ఈ తెగులు సోకిన విత్తనాలనుండి నుండి సాగుచేస్తుంటే, మొలకెత్తిన తరవాత మొక్కలు తెగులు బారిన పడతాయి. అయినా బ్రతికి ఉన్న మొక్కలు రంగు మరియు సత్తువ కోల్పోతాయి. మొక్కలు ఎదిగే దశలో ఈ తెగులు సోకితే ఎదుగుదల నిలిచిపోతుంది. అవకాశవాద సూక్ష్మ క్రిములు అక్కడికి చేరి ఆ కుళ్లిపోతున్న కణజాలాన్ని తింటాయి. దీనివలన లక్షణాలు మరింత దిగజారతాయి. ఈ తెగులు పొలంలో అక్కడక్కడ కనబడి పరిస్థితులు అనుకూలంగా వుంటే ఇతర ప్రాంతాలకు విస్తరిస్తుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

కొద్ది మొత్తంలో కినేతిన్ లేదా టైకోడెర్మా హర్జియానం కలిగి వున్న ద్రావణాలతో నేలలో జీవించే రకాలైన పప్పు ధాన్యాల్లో వేరు కుళ్ళు తెగుళ్ల వంటి వాటి నియంత్రణకు విత్తనాలను తడపడం ద్వారా వాడవచ్చు. ఇవి మొక్కల ఎదుగుదలను మరియు దిగుబడిని కూడా పెంచగలవు. ఈ ఉత్పత్తుల గురించి పెద్ద మొత్తంలో పరీక్షించడానికి క్షేత్ర పరీక్షలు చేయబడుతున్నాయి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ ఫంగస్ ఒకసారి మొక్క కణజాలాన్ని ఆక్రమించాక దీనికి వ్యతిరేకంగా ఎటువంటి పురుగుల మందులు వేయలేము. త్రియాబిన్డజోల్ + కార్బాథిన్, కార్బథిన్ + థిరామ్ తో విత్తన శుద్ధి చేయడం వలన మొలకలు బాగా నిలదొక్కుకుంటాను. ఇతర శీలింద్ర నాశినులు కూడా లభిస్తాయి.

దీనికి కారణమేమిటి?

మొక్కలు వృద్ధి చెందుతున్న ఏ దశలో అయినా ఈ తెగులు మొక్కలకు నష్టం కలుగచేస్తుంది. నేలలో జీవించే ఫంగల్ వ్యాధికారకాల వలన ఈ లక్షణాలు సంభవిస్తాయి. ఈ సమూహంలో రైజోక్టోనియా సోలని మరియు ఫ్యుసరియం సోలని ఉన్నాయి, ఇవి చాలాకాలం పాటు నేలల్లో జీవించగలవు. పరిస్థితులు అనుకూలంగా వున్నప్పుడు ఇవి వేరు కణజాలాన్ని ఆక్రమించి మొక్క పైభాగాలకు నీరు మరియు పోషకాల రవాణాను అడ్డుకోవడం వలన మొక్క వాడిపోవడం మరియు పత్రహరితం కోల్పోయిన లక్షణాలు కనబడుతాయి. ఈ తెగులు మొక్క కణజాలంలో పెరిగేకొద్ది ఇది చాలా తరచుగా ఈస్ ఫంగస్ తో కలసి కనబడుతుంది మరియు వేరు సాధారణ అభివృద్దిని మరియు వేరు బుడిపెలు ఏర్పడడాన్ని అడ్డుకుంటాయి. సీజన్ ప్రారంభంలో చల్లని మరియు తేమ నేలలు ఈ తెగులు వ్యాప్తి చెందడానికి అనుకూలంగా ఉంటుంది. నిజానికి, ఈ లక్షణాలు తరచుగా వరదలు సంభవించే లేదా నీరు నిలిచే ప్రాంతాల్లో ఎక్కువగా కలుగుతాయి. చివరకు నాటిన తేదీ, నాటిన విత్తనం లోతు, మొలకెత్తడం మరియు దిగుబడిపై గణనీయమైన ప్రభావం చూపుతుంది.


నివారణా చర్యలు

  • ద్రువీకరించబడిన ఆరోగ్యకరమైన విత్తనాలను మాత్రమే వాడండి.
  • ఈ తెగులుకు మంచి నిరోధకత కలిగిన విత్తనాలను ఉపయోగించండి.
  • సీజన్లో కొంచెం ఆలస్యంగా విత్తనాలను వేయడం వలన ఈ తెగులు తీవ్రత నుండి తప్పించుకోవచ్చు.
  • సమతుల్య ఎరువులను వాడండి.
  • సరైన మోతాదులో భాస్వరాన్ని పొలంలో వేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి