Plasmopara viticola
శీలీంధ్రం
ఆకులపై గోధుమ రంగు వలయంతో పసుపు-ఆకుపచ్చ జిడ్డు మచ్చలు ఏర్పడతాయి. ఇవి అపక్రమ గోధుమ రంగు ప్యాచీగా మారతాయి. మచ్చల క్రింద తెలుపు నుండి బూడిద రంగు కాటన్ పొర ఏర్పడుతుంది. చిగుర్లు, టెండ్రిల్స్ మరియు పుష్పగుచ్ఛాన్ని ప్రభావితం చేయవచ్చు. పెరుగుదల తగ్గిపోతుంది. వ్యాధి పెరిగేకొద్దీ, ఈ మచ్చలు విస్తరిస్తాయి,ప్రభావిత ప్రాంతాల కేంద్రం నిర్జీవంగా మారుతుంది, ఇవి అపక్రమ గోధుమ రంగు ప్యాచీగా మారతాయి. కొన్ని వెచ్చని తేమతో కూడిన రాత్రుల తరువాత, ఈ మచ్చల క్రింద దట్టమైన, తెలుపు నుండి బూడిద రంగు కాటన్ పొర వృద్ధి చెందుతుంది. సీజన్ తరువాత పరిపక్వ ఆకులపై సంక్రమణ సంభవిస్తే, అది ఇంటర్వీనల్ క్లోరోసిస్ ద్వారా వర్గీకరించబడుతుంది. ఇది క్రమంగా ఎర్రటి గోధుమ మొజాయిక్ నమూనాను ఏర్పరుస్తుంది. చిగుర్లు, టెండ్రిల్స్ మరియు పూగుత్తులపై కూడా జిడ్డుతో కూడిన గోధుమ రంగు ప్రాంతాలు మరియు శిలీంధ్ర పెరుగుదల గమనించవచ్చు. లేత చిగుర్లు మరియు పూలు రాలిపోవడం మరియు మరుగుజ్జులుగా మారడం లేదా చనిపోవడం జరగడమే కాక ఎదుగుదల తగ్గడానికి మరియు తక్కువ దిగుబడికి దారితీస్తుంది.
మొక్కల కాలుష్యాన్ని నివారించడానికి తెగులు సంక్రమించకముందు వాడే సేంద్రీయ శిలీంద్ర నాశినులు బోర్డియక్స్ మిశ్రమం వంటి రాగి ఆధారిత శిలీంద్ర నాశినులు.
అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. రక్షిత శిలీంద్ర నాశినులు మొక్కల కాలుష్యాన్ని నివారించడానికి సహాయపడతాయి కాని వాటిని ఆకుల దిగువ భాగంలో సరిగ్గా పిచికారీ చేయాలి. రాగి ఆధారిత శిలీంద్ర నాశినులు, బోర్డియక్స్ మిశ్రమం మరియు డైతియోకార్బమేట్స్ వంటివి ఉపయోగించవచ్చు. ప్రారంభ లక్షణాలను గుర్తించిన వెంటనే ఇన్ఫెక్షన్ అనంతర శిలీంద్ర నాశినులను తప్పనిసరిగా వాడాలి. సాధారణంగా, ఫోసెటైల్-అల్యూమినియం మరియు ఫెనిలామైడ్లు తెగులు సోకిన తర్వాత ఉపయోగించే శిలీంద్ర నాశినులు.
ప్లాస్మోపారా విటికోలా అనే ఫంగస్ వల్ల ఈ లక్షణాలు సంభవిస్తాయి. వైన్ ఉత్పత్తి చేసే ప్రదేశాలలో తరచుగా వసంత ఋతువు మరియు వేసవిలో వర్షపాతం అలాగే 10°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలలో చాలా విధ్వంసకారం. మట్టిలో వుండే మొక్కల అవశేషాలపై లేదా తెగులు సోకిన చిగుర్లలో ఇవి శీతాకాలంలో మనుగడ సాగిస్తాయి. వసంతకాలంలో, గాలి మరియు వర్షపు తుంపర్లు వీటి బీజాంశాలను వ్యాపింపచేస్తాయి. బీజాంశం మొలకెత్తి ఆకుల దిగువ భాగంలో రంధ్రాల ద్వారా ఆకులోకి ప్రవేశించే నిర్మాణాలను ఉత్పత్తి చేస్తుంది. అక్కడ ఇది కణజాలాల ద్వారా వ్యాప్తి చెందడం మొదలుపెడుతుంది. చివరికి అంతర్గత కణజాలాలను మించి పెరుగుతుంది మరియు బయట ఒక ప్రత్యేకమైన బూజు పూత ఏర్పరుస్తుంది.13 నుండి 30°C మధ్య ఉష్ణోగ్రత వద్ద ఈ ఫంగస్ వృద్ధి చెందగలదు. వెచ్చని, తేమతో కూడిన రాత్రుల తరువాత, 18 నుండి 25°C ఉష్ణోగ్రత మధ్యన ఈ ఫంగస్ సరైన పెరుగుదల జరుగుతుంది.