Opogona sacchari
కీటకం
ఈ తెగులు మొక్కలు బాగా ఎదిగే సమయంలో పూత సమయంలో లేదా కోతలు పూర్తయిన తర్వాత కూడా కలగవచ్చు. పెద్ద పురుగులు దెబ్బతిన్న మొక్కలు మరియు వాటి భాగాల పై దాడి చేస్తాయి. లార్వా వల్లనే అధికంగా నష్టం జరుగుతుంది. ఇవి సహజంగా కుళ్లిపోతున్న మొక్క భాగాల పై దాడిచేస్తాయి. అవశేషాల్ని తిన్న అనంతరం ఇవి ఆరోగ్య కరమైన మొక్క పదార్థాలపై( వేర్లు, కాండం, ప్రక్క రెమ్మలు,కాడలు మరియు పండ్లు) దాడి చేస్తాయి. విత్తనాలు కూడా దాడికి గురిఅవ్వచ్చు. ప్రధమ లక్షణాలు గొట్టాల వలె కనిపిస్తాయి కానీ తెగులు ప్రాధమిక దశలో సులువుగా కనిపించవు. తరువాత దశలలో మాత్రమే ఈ తెగులు కనబడుతుంది. మొక్కలో కండ భాగం మొత్తం ఈ పురుగులు తినిస్తాయి. ఆకులు వాలిపోయినట్టు కనిపిస్తాయి. ప్రతికూల పరిస్థితులలో ఆకులు రాలిపోయి మొత్తం చెట్టు పడిపోవచ్చు.
గ్రీన్ హౌస్ ప్రయోగాల్లో స్టెయిన్ర్నెమా ఫెల్టిఎ, హెటెరోర్హాబీడీటీస్ బాక్టేరోఫోర మరియు హెటెరోర్హాబీడీటీస్ వంటి నెమటోడ్స్, లార్వా కు విరుద్ధంగా సమర్ధవంతంగా పనిచేశాయి. గ్రీన్ హౌస్ ప్రయోగాల్లో స్టెయిన్ర్నెమా ఫెల్టిఎ, హెటెరోర్హాబీడీటీస్ బాక్టేరోఫోర మరియు హెటెరోర్హాబీడీటీస్ వంటి నెమటోడ్స్, లార్వా కు విరుద్ధంగా సమర్ధవంతంగా పనిచేశాయి బాసిల్లస్ తూరంగియాన్సీస్ కూడా ఉపయోగించవచ్చు.
ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే జీవ చికిత్సలు కలసిన నివారణ చర్యలతో కూడిన సమన్వయ పద్దతులు వాడటం మంచిది. చికిత్స కొరకు మీరు ఇమిడాక్లోప్రిడ్ కలిగిన ఉత్పత్తులను వాడవచ్చు
ఈ తెగులు ఒపోగొన సచ్చరి జాతికి చెందిన లార్వా వల్ల కలుగుతుంది. రాత్రి వేళల్లో సంచరించే ఈ పురుగులు ముదురు గోధుమ రంగు శరీరం కలిగి , దాదాపు 11 మిల్లీమీటర్ల పొడవు కలిగి 18-25 మిల్లీమీటర్ల రెక్కల వ్యాప్తి కలిగి ఉంటాయి. ముందు రెక్కలు గోధుమ, కొన్ని సార్లు పెద్ద బ్యాండ్లు కలిగి ఉంటాయి. వెనుక రెక్కలు బూడిద రంగు అంచులు కలిగి ఉంటాయి. ఆడ పురుగులు దాదాపుగా 50 నుండి 200 గుడ్లు గుంపులుగా మొక్కల కణజాలంలో పెడతాయి. ఒక 12 రోజుల తరువాత తెల్లటి లేదా లేత ఆకుపచ్చ లార్వా పగులుతాయి. లార్వా ముదురు ఎరుపు నుండి గోధుమ రంగు తల కలిగి ఇరు పక్కల కన్ను వంటి మచ్చలు కలిగి ఉంటాయి. 50 రోజుల్లో లార్వా దాదాపుగా 26 మిల్లీమీటర్ల వరకు పెరుగుతాయి. 20 రోజుల తరువాత పెద్ద పురుగులు బయటకి వస్తాయి. వీటి ఎదుగుదలకు చల్లటి మరియు పొడి వాతావరణాలు సహకరిస్తాయి