వరి

రైస్ స్టాల్క్ స్టింక్ బగ్

Tibraca limbativentris

కీటకం

క్లుప్తంగా

  • లేత పిలకలు ఆకులు చనిపోవడం, దెబ్బతిన్న కాండాలు ( డెత్ హార్ట్) మరియు పుష్పించే దశలో తెల్ల కంకులు వైట్ హెడ్స్) చనిపోతాయి.
  • కాండాలు దెబ్బతింటాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

వరి

లక్షణాలు

నీటి పారుదల గల ప్రాంతాలలో మరియు బీడు భూమి సాగులో ఇది కనపడినప్పటికీ ఇది ముఖ్యంగా బీడు భూములలో తీవ్రంగా వుంటుంది. పెద్ద పురుగులు మరియు లార్వాలు లేత మొక్కలపై దాడి చేసి "డెడ్ హార్ట్" మరియు "వైట్ హెడ్" అను లక్షణాలకు కారణమవుతాయి. "డెడ్ హార్ట్" అంటే లేత పిలకలు చనిపోవడం మరియు కొన్ని కేసులలో కాండం మొత్తం చనిపోతుంది. జీనస్ డయాట్రియా కీటకాలవలన కూడా అదేవిధమైన లక్షణాలు కనపడతాయి. పూతదశలో ఈ కీటకాలు వరి కంకులపైన దాడిచేయడంవలన "తెల్ల కంకులు" లేదా "వైట్ హెడ్" అనే లక్షణాలు కనపడతాయి. వరి కంకులు ఎదుగుతునప్పుడు టి. లింబాటివెంట్రీస్ అనే బాక్టీరియా గింజలను పీల్చివేయడం వలన గింజలు విషపూరితం అయ్యి ఈ విధంగా తెల్ల కంకులు ఏర్పడతాయి. ఈ తెగులు పైన ఏవిధమైన నియంత్రణ లేకపోతే 80% వరకు దిగుబడి నష్టం కలుగుతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

టెలీనోమస్ జాతి కీటకాలు ఈ కీటకాల గ్రుడ్లను ఆశిస్తాయి. క్షేత్ర స్థాయిలో కొన్ని పరిస్థితులలో వీటిని ప్రవేశపెట్టబడినప్పుడు 90% వరకు గ్రుడ్లను ఈ కీటకాలు ఆశించాయి. ఇతర సహజ శత్రువులలో జీనస్ ఎఫెరియా జాతికి చెందిన కొన్ని ఈగలు కూడా ఈ తెగులుకు కారణం అయ్యే కీటకాలకు సహజ శత్రువులు. మెటారిజియం అనోసోప్లియే, బ్యూవెరియా బసియానా, పేసిలోమిసెస్ sp, కార్డిసెప్ట్స్ నూటన్స్, కొనిడియా ఆధారిత ఉత్పత్తులను కూడా ద్రావణంగా చేసి వరి పంటపై వాడవచ్చు. జీనస్ పైపర్ (0.25 నుండి 4.0%) యొక్క అన్ని జాతుల నుండి సేకరించిన ఎస్సెన్షియల్ ఆయిల్ ను గ్రుడ్లు పొదగకుండా చేస్తాయి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. వేరే ఇతర మార్గం లేనప్పుడు ఫాస్పరస్, పెరిత్రోయిడ్ లేదా కార్బమేట్ పురుగుమందులను ఉపయోగించవచ్చు.

దీనికి కారణమేమిటి?

రైస్ స్టాక్ స్టింక్ బగ్ టిబ్రక లింబాటివెంట్రిస్ కారణంగా వ్యాధి సోకుతుంది. దీని మూలస్థానం మధ్య మరియు దక్షిణ అమెరికా. ఇది వరితో పాటు సోయాబీన్, టమోటో మరియు గోధుమ పైన కూడా దాడిచేస్తుంది. ఇది సాధారణంగా కోత తరవాత పొలం బయట వుండి మళ్ళీ వరి నాటిన తరవాత ఆ కొత్తగా వేసిన పంటను ఆశిస్తుంది. పెద్ద పురుగులు మరియు చిన్న పురుగులు మొక్కలను ఆశించి తినడం మొదలుపెడతాయి. దానివలన వైట్ హెడ్స్ మరియు డెడ్ హార్ట్స్ అనే లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ధాన్యం గింజలు మరియు కాండాల నష్టంగా చెప్పవచ్చు. తక్కువ తేమ మరియు బీడు భూములలో వేసిన పంటలో ఈ నష్టం ఎక్కువగా ఉంటుంది. నీరు తక్కువగా ఉండడం వలన ఈ కీటకాలు మొక్క మొదళ్లకు అంటిపెట్టుకుని ఉంటుంది. పంట పక్వదశకు వచ్చేకొద్దీ కాండం గట్టిపడి కీటకాలు తినడానికి పనికిరాకుండా ఉండడం వలన వాటి సంతతి తగ్గుతుంది. పైరు పెరిగేకొద్ది కాండాలు ముదిరి కీటకానికి ఆహారం తగ్గి వాటి జనాభా నెమ్మదిగా తగ్గుతుంది.


నివారణా చర్యలు

  • నేలను తయారు చేయు సమయంలో పంట అవశేషాలను మరియు కలుపును పూర్తిగా తొలగించండి.
  • పంట లేకుండా వదిలేసిన పొలాలను కీటకాలు సులభంగా ఆశిస్తాయి.
  • అందువలన చుట్టుపక్కల పొలాలను సరిగా నిర్వహించండి.
  • మొక్కల మధ్యన స్ధలాన్ని (150 మొక్కలు/ప్రతి మీటర్ స్క్వేర్ కు) తగ్గించండి.
  • దానివలన మొక్కల సహజ శత్రువులనుండి రక్షించుకుంటాయి.
  • తెగుళ్లకు సహజంగా వుండే శత్రువులను కాపాడడానికి కీటక నాశినులను నియంత్రించండి.
  • నీటి నాణ్యతను గమనిస్తూ వుండండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి