వరి

బయోంఫలరియా నత్తలు

Biomphalaria spp.

ఇతర

క్లుప్తంగా

  • సాధారణంగా వీటివలన వరికి నష్టం తక్కువ.
  • షిస్టోసోమియాసిస్ అని పిలువబడే, మనష్యులకు సోకే అవకాశం వున్న వ్యాధి యొక్క పరాన్నజీవులకు ఈ నేతలలో కొన్ని రకాలు మధ్యస్థ వాహకాలుగా ఉంటాయి.
  • స్థానిక జనాభాకు నష్టం కలిగించడాన్ని నివారించడానికి మంచి నీరు మరియు పారిశుధ్య సౌకర్యాలు అవసరం.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

వరి

లక్షణాలు

సాధారణంగా వీటివలన వరికి నష్టం తక్కువ. షిస్టోసోమియాసిస్ అని పిలువబడే మనష్యులకు సోకగలిగే వ్యాధి పరాన్నజీవులకు ఈ నత్తలల్లో కొన్ని మధ్యస్థ వాహకాలు కనుక ఈ నత్త మానవులకు వైద్యపరంగా ముఖ్యమైన వ్యాధిగా ఉండటం వలన జాగ్రత్త వహించాలి. ఈ పరాన్నజీవి షిస్టోసోమియాసిస్ అని పిలువబడే ఒక వ్యాధి మనుషులకు సంక్రమించడానికి కారణం అవుతుంది. ఈ పరాన్నజీవి (సరస్సులు, చెరువులు, నదులు, డ్యాములు, చిత్తడి నేలలు మరియు వరి పొలాలు) కలిగిన నత్తలు నివసించే కలుషితమైన మంచి నీటిలో వీటిని మానవుడు తాకడం వలన వ్యాపిస్తుంది. ఇది ముఖ్యంగా కాలువ నీటి ద్వారా, వాగులు, వంకలు మరియు వరదల ద్వారా విస్తరిస్తుంది. ఈ నత్తలు జలపాతాలు మరియు బావుల నీటిలో వుండే ప్రత్యేకమైన రసాయనిక చర్య వలన వీటిలో నివాసం వుండవు. స్థానిక జనాభాకు నష్టం కలగకుండా ఉండడానికి సరైన మంచి నీరు మరియు పారిశుధ్య సౌకర్యాలు అవసరం.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

తిలాపియా లేదా గప్పీ వంటి జాతుల చేపలను చెరువులలో పెంచడం బయోంఫలరియా జనాభాను నియంత్రించడానికి ఒక సమర్ధవంతమైన పద్దతి. షిస్తోసోమియాసిస్ ను కలిగించే ఈ వాహకాలను లేకుండా ఉంచడంలో చేపల చెరువులను నిర్వహించడం అనేది కీలకమైనది.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ప్రాజిక్వంటేల్ అనే ఒక సమ్మేళనం మనుషులలో షిస్తోసోమియాసిస్ కు ఒక ప్రాధమిక చికిత్స. ఈ మందు యొక్క ఒక డోస్ సంక్రమణ యొక్క భారాన్ని మరియు లక్షణాల యొక్క తీవ్రతను తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్ తిరిగి సంభవించే అవకాశం ఉన్నందువలన మళ్ళీ కలుషిత నీటిలో పనిచేయరాదు. ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి నత్తలను నియంత్రించడం అవసరం.

దీనికి కారణమేమిటి?

బియోంఫలారియా రకానికి చెందిన, తాజా నీటిలోని గాలిని పిల్చే నత్తల వలన వరి మొక్కలకు నష్టం జరుగుతుంది. అన్నిబియోంఫలారియా జాతులు మగ మరియు ఆడ అవయవాలను కలిగివుండే ద్విలింగ అమరిక గలవి మరియు స్వీయ మరియు క్రాస్ ఫలదీకరణ సామర్థ్యం గలవి. గుడ్లను 5-40 బ్యాచ్లలో విడతల వారీగా పెడుతాయి, ప్రతి బ్యాచ్ జెల్లీ-వంటి పదార్ధంతో కప్పబడి ఉంటుంది. 6-8 రోజుల వ్యవధిలో గుడ్లు పొదగబడుతాయి మరియు వేసిన పంటను బట్టి మరియు వాతావరణ అనుకూలతను బట్టి 4-7 వారాల వ్యవధిలో అవి పక్వానికి వస్తాయి. ఉష్ణోగ్రత మరియు ఆహార లభ్యత వంటివి వీటి ముఖ్యమైన నిరోధక అంశాలలో కొన్ని. ఒక సంవత్సరం జీవించే ఈ నత్తలు వీటి జీవిత కాలంలో 1000 గుడ్ల వరకు పెడతాయి.


నివారణా చర్యలు

  • ఈ నత్తల ఉనికి కోసం పొలాలను పరిశీలించండి.
  • ఈ నత్త మానవులకు వైద్యపరంగా ముఖ్యమైన వ్యాధిగా ఉండటం వలన జాగ్రత్త వహించాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి