మామిడి

మామిడిలో తేనె మంచు పురుగు

Idioscopus spp.

కీటకం

క్లుప్తంగా

  • ఆకులు కొమ్మలు మరియు రెమ్మలు గోధుమ రంగులోకి మారి ఎండిపోతాయి.
  • కీటకాలు తేనె బంకను ఉత్పత్తి చేస్తాయి.
  • ఈ కీటకాలు బంగారు లేదా ముదురు గోధుమ రంగులో ఉంటాయి.
  • మేకు లాంటి ఆకారంతో వెడల్పుగా గుండ్రని తలా మరియు గోళాకారపు కళ్ళతో ఉంటాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

మామిడి

లక్షణాలు

ఇడియోస్కోప్స్ జాతికి చెందిన ఈ పురుగులు కొమ్మలు, లేత ఆకులు మరియు పండ్ల రసాలను పీల్చేస్తాయి. వీటి ప్రభావం ఉన్న భాగాలు గోధుమ రంగులోకి మారి రూపు మారి ఎండి పోయే అవకాశం ఉంది. కొత్త పూలు రావడం తగ్గిపోతుంది. దీని ప్రభావం పండ్ల ఎదుగుదలపై పడుతుంది. ఇవి తేనె వంటి జిగురును విసర్జిస్తాయి, దీనిపై చీమల వంటివి వచ్చి చేరతాయి. దీనివలన నల్ల బూజు తెగులు చెట్లను ఆశించే అవకాశం ఉంటుంది. ఈ ఫంగస్ ఆకుల కిరణజన్య సంయోగ క్రియపై మరియు మొక్కల సత్తువపైన ప్రభావం చూపుతుంది. ఇవి ఆకులలో, పువ్వు కాడలపై గుడ్లు పెడతాయి.దీనివలన కణజాలం నాశనమౌతుంది. ఈ తేనె మంచు పురుగులు మామిడి పంటలో ఒక తీవ్రమైన తెగులుగా చెప్పవచ్చు. దీని వలన పంట దిగుబడి 50% వరకు తగ్గుతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

మల్లాడ బోనినెన్సిస్ మరియు క్రైసోప లక్కిపెర్డ మరియు గుడ్లను తినే పోలీనెమ sp. వంటి జీవ నియంత్రణ ఏజెంట్లను వాడి వీటి జనాభాను అదుపుచేయవచు. బిఎవేరియా బస్సిన లేదా మేతరిజియం అనిసోప్లిఏ వంటి జీవ నియంత్రణ ఏజంట్లను కూడా వాడవచ్చు. ఈ ట్రీట్మెంట్ ను వారానికి 2 - 3 సార్లు చేయటం మంచిది. వేప నూనె పదార్థాలు(3%) వాడటం వలన కూడా వీటిని 60% వరకు తగ్గించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఇమిడాక్లోప్రిడ్ (0.3%), ఎండోసల్ఫాన్ (0.5%) మరియు సైపర్మేత్రిన్ (0.4%) వంటి వి వీటికి విరుద్ధంగా సమర్ధవంతంగా పనిచేస్తాయి. డిమేథోయేట్ కలిగిన కీటక నాశినులనుపిచికారీ చేయడం లేదా చెట్టు కాండంలో ఇంజెక్ట్ చేయటం కూడా మంచి ఫలితాలను ఇచ్చింది. 7 రోజులకు ఒక సారి చొప్పున పూత వచ్చే ముందు పిచికారి చేయటం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది.

దీనికి కారణమేమిటి?

తేనె మంచు పురుగులు సహజంగా వెడల్పాటి, గుండ్రపు తల కలిగి ఉంటాయి. ఇవి బంగారపు రంగు లేదా ముదురు గోధుమ రంగులో ఉంటూ, 4- 5 ఎం. ఎం. పొడవు కలిగి ఉంటాయి. ఇవి వీటి గుడ్లను పుష్పాలు, ఆకు ఈనెలు మారియు ఆకులపై పెడతాయి. దాదాపుగా 100 నుండి 200 గుడ్లని పెడతాయి. ఇవి అధిక తేమ కలిగిన ప్రాంతాలను ఎంచుకుంటాయి. పెద్ద పురుగులు ఎగురుకుంటూ వెళ్లి దగ్గరలో వున్నా ఇతర చెట్లపై కూడా ఈ తెగులును కలగచేస్తాయి. నర్సరీ మొక్కలను రవాణా చేయడం వలన కూడా ఈ పురుగులు వ్యాపించే అవకాశం ఉంది. పాత, వదిలేసినా లేదా బాగా దగ్గరగా చెట్లు వేసినా ఈ పురుగులు చాల త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది


నివారణా చర్యలు

  • చెట్ల మధ్య దూరం ఎక్కువగా ఉంచాలి.
  • తోటను క్రమంతప్పకుండా పరీక్షిస్తూ ఉండాలి.
  • తేనె పురుగు ఆశించే అవకాశం తక్కువగా ఉన్న మొక్కల రకాలను ఎంచుకోవాలి.
  • వీటి ప్రభావం ఉన్న మామిడి చెట్లను ఒక తోట నుండి ఇంకొక తోటలోకి తీసుకొని వెళ్ళకూడదు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి