మామిడి

మామిడిలో నట్ వీవిల్

Sternochetus mangiferae

కీటకం

క్లుప్తంగా

  • పండ్లపై ఎరుపు-గోధుమ మచ్చలు, చుట్టూ నీట నానినట్టు వున్న మచ్చలతో కనిపిస్తాయి.
  • గట్టిపడిన కాషాయ రంగులో ఉన్న ద్రవాలు ఈ మచ్చల నుండి కారుతుంటాయి.
  • పండ్ల లోపలి భాగం నలుపు రంగులోకి మరి కుళ్లిపోతుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

మామిడి

లక్షణాలు

వీటి వల్ల ప్రభావితమైన పండ్లని తేలికగా కనుగొనవచ్చు. వీటి పై ఉన్న రంధ్రాలు ఎరుపు గోధుమ రంగు మచ్చలుగా కనిపిస్తాయి. గట్టిగ, కాషాయ రంగులో ఉన్న స్రావాలు ఈ మచ్చల నుండి ప్రవహిస్తుంటాయి. పండ్ల లోని లోపటి భాగం నలుపు రంగు కుళ్ళిన ద్రవ్యంగ మారుతుంది. లార్వా బయటకి వచ్చి తోలుని చొచ్చుకొని టెంక దెగ్గరికి వెళ్తాయి. దీని వల్ల పండ్లు తొందరగా రాలిపోతాయి. కొన్ని సమయాల్లో ఇవి టెంక నుండి బయటకి వచ్చి పండ్ల లోకి చొచ్చుకొని వెళ్తాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఒకోఫీల్ల స్మరాగ్డిన అనే చీమను జీవ నియంత్రణ ఏజెంట్ గా ఈ తెగులుకు విరుద్ధంగా వాడవచ్చు. వేడి మరి చల్లటి చికిత్స కూడా ఈ పురుగుల్ని అనేక దశల్లో చంపటానికి ఉపయోగపడుతాయి. కొన్ని వైరస్ వైరస్సులు కూడా S. మన్గిఫిరాయి లార్వా పై ప్రభావం చూపుతాయి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. సమర్ధవంతమైన నియంత్రణ సాధించటానికి డెల్టామేత్రిన్ ను 2 సార్లు పిచికారీ చేయాలి . మొదట పండ్లు 2-4 సెంటీమీటర్ల పరిమాణం వున్నప్పుడు మరియు రెండవసారి 15 రోజుల తరువాత పిచికారీ చేయాలి. ఇతర పదార్ధాలు కలిగిన కీటక నాశినులను ఉపయోగించడం ద్వారా కూడా ఈ S. మాగ్నిఫిరాయి ను నివారించవచ్చును.

దీనికి కారణమేమిటి?

ఈ పురుగు గుడ్డు ఆకారంతో ఉండిపొడవైన తలను కలిగి ఉంటుంది. ఆడ పురుగులు తెల్లటి గుండ్రపు గుడ్లను ఒక్కొకటి సగం పండిన లేదా పూర్తిగా పండిన మామిడి పండ్లపై పెడతాయి. ఒక 5-7 రోజుల తరువాత ఒక మిల్లీమీటర్ పొడవు వున్న లార్వా బయటకి వచ్చి పండులోకి చొచ్చుకుపోతుంది. పండు గుజ్జులోనే ఇవి ప్యూపా దశను పూర్తి చేసుకుంటాయి. పెద్ద పురుగులు పండ్లు పడిన తర్వాత వస్తాయి. మల్లి కొత్త పండ్లు వచ్చే వరకు అవి ఒకరకమైన నిద్రావస్థలో ఉంటాయి. మామిడిపళ్ళు వేరుశనగ సైజుకి పెరిగినప్పుడు ఇవి ఆకులను తినటం మొదలు పెట్టి సంపర్కం చెందడం మొదలెడతాయి. ఈ పురుగులు ఎక్కువగా పండ్లు, విత్తనాలు లేదా ఇంకా ఈ లార్వా వున్న మొక్కల భాగాలు వున్నప్పుడు, రవాణా చేయటం వల్ల వ్యాపిస్తాయి.


నివారణా చర్యలు

  • ఆరోగ్యంగా ఉన్న చెట్ల నుండి విత్తనాలు వాడాలి.
  • లార్వా దాడి నుండి తట్టుకునే పండ్లు కలిగిన రకాలని వాడాలి.
  • విధానాలని నాటే ముందు వ్యాధి కోసం పరీక్షించాలి.
  • రాలి పోయిన పండ్లని తొలగించాలి.
  • వ్యాధి సోకిన విత్తనాలని లేదా పండ్లను రవాణా చేయకూడదు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి