Apsylla cistellata
కీటకం
ఆడ పురుగులు వసంత కాలంలో ఆకుల కింది భాగంలో ఈనెల మధ్యన గోధుమ- నలుపు అండాకారపు గుడ్లు పెడతాయి. దాదాపు 200 రోజుల తరువాత నింఫ్స్ బయటకి వచ్చి దగ్గర్లో ఉన్న మొగ్గలపైకి పాకి వాటిని తినటం మొదలు పెడతాయి. గట్టిగా ఉన్న, ఆకుపచ్చ కోన్ ఆకారంలో గాల్స్ మొగ్గలు ఉండాల్సిన దగ్గర కనిపిస్తాయి. ఇది పుష్ఫీకరణం మరియు పండ్ల ఎదుగుదల జరగకుండా చేస్తుంది. ఇవి పెట్టే గుడ్ల సంఖ్య బట్టి పంటలో నష్టం ఉంటుంది. ఇది భారత దేశం మరియు బాంగ్లాదేశ్ లో చాల తీవ్రమైన తెగులు.
సిలికేట్స్ అధికంగా వుండే పారిశ్రామిక బూడిదను ఉపయోగించవచ్చును. తెగులు సోకిన కొమ్మలను లక్షణాలు కనిపించిన దగ్గర నుండి 15-30 సెంటీమీటర్ వరకు కత్తిరించాలి, దీని వలన గాల్స్ సంఖ్య తగ్గుతుంది.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. బెరుడుపై డిమెథోయేట్ పేస్ట్ (0.03%) రాయటం వల్ల చెట్టుపైకి ఎక్కి కిందకు దిగే పురుగులను నిర్మూలించవచ్చు. దీన్ని ఇంజక్షన్ ధ్వారా బెరడులోకి ఎక్కించటం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. సెల్లిడ్ తెగులు ప్రధమ దశలో ఫోస్ఫమిడాన్, మిథైల్ పెరిత్రిన్ వంటి పురుగుల మందులు పిచికారీ చేయడం కూడా మంచి ఫలితాలని ఇస్తుంది.
పెద్ద పురుగులు 3 నుండి 4 మిల్లీమీటర్ల పొడవు గోధుమరంగు నల్లటి తల మరియు రొమ్ము భాగాన్ని కలిగి లేత గోధుమ రంగు పొట్టతో ఉంటాయి. గుడ్లు దాదాపుగా 200 రోజుల తరువాత పగిలి పసుపు రంగు పురుగులు బయటకి వస్తాయి. ఇవి బయటకి రాగానే లేత మొగ్గల దగ్గరకు పాక్కుంటూ వెళ్లి వాటి సారాన్ని పీల్చేస్తాయి. ఇవి తినే సమయంలో వదిలే కెమికల్స్ ఆకుపచ్చ రంగు గుండ్రని గాల్స్ తయారు అవుతాయి. అక్కడ ఇవి పెద్దవి అయ్యేముందు 6 నెలల జీవిత కాలాన్ని మొదలుపెడతాయి. ఆ తర్వాత పెద్ద పురుగులు ఈ గాల్స్ నుండి భూమిపైన పడతాయి. అక్కడ అవి వాటిపైన వుండే కవర్ను వదిలేస్తాయి. ఆ తర్వాత అవి చెట్టుపైకి ఎక్కి సంపర్కం చేసుకుని గుడ్లను పెడతాయి.