Cephaleuros virescens
ఇతర
సి. వీరెసెన్స్ అనే పరాన్న జీవి అయిన ఆల్గే ప్రధానంగా మామిడి ఆకులను ప్రభావితం చేస్తుంది కానీ కాండాలు మరియు కొమ్మలపై కూడా ఇవి దాడి చేస్తాయి. ఈ తెగులు సోకిన ఆకులపై రెండు నుండి నాలుగు మిల్లీమీటర్ల సైజులో గుండ్రపు ఆకుపచ్చ నుండి నారింజ రంగు మచ్చలు ఏర్పడతాయి.వీటిపై బొచ్చుతో ( ఆల్గే స్పోర్స్) ఉన్నటువంటి ఒక సృష్టంగా లేని ఎదుగుదల కనిపిస్తుంది. ఇవి అతుకుల మధ్యలో కలిసిపోతాయి. లేత కాండాలలో ఇవి పగుళ్లు కలగజేసి మొక్కలు డైబాక్ అవ్వడానికి కారణం అవుతాయి. ఆల్గల్ ఆకు మచ్చ తెగులు ఎక్కువగా అధిక ఉష్ణోగ్రతలు మరియు వర్షం కలిగిన ప్రాంతాల్లో ఎదుగుదల తగ్గిన మొక్కలలో కనిపిస్తుంది.
ఈ తెగులు తీవ్రత తక్కువగా వున్నప్పుడు తెగులు సోకిన ఆకులను మరియు కొమ్మలను తొలగించి నాశనం చేయండి. తెగులు అధికంగా వున్నపుడు బోర్డియక్స్ మిశ్రమాన్ని కాపర్ ఆధారిత ఉత్పత్తులతో కలిపి వాడండి. వేసవి కాలం మొదలైనప్పటినుండి శరదృతువు పూర్తయ్యేవరకు ప్రతి రెండు వారాలకు ఒక సారి ఈ ద్రావణాన్ని పిచికారీ చేయాలి
వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. రసాయనిక నియంత్రణ అవసరైతే కాపర్ కలిగిన శీలింద్ర నాశినులను పిచికారీ చేయండి.
ఆల్గల్ ఆకు మచ్చ తెగులు ఎక్కువగా అధిక ఉష్ణోగ్రతలు మరియు వర్షం కలిగిన ప్రాంతాల్లో కనిపిస్తుంది. పోషకాల లోపం, సరైన మురుగు నీటి సౌకర్యం లేకపోవడం మరియు ఎక్కువ లేదా అసలు నీడ లేకపోవడం ఈ తెగులుకు అనుకూలిస్తుంది. గాలి లేదా నీరు ద్వారా ఇవి ఇతర మొక్కలపైకి వ్యాపిస్తాయి. సి. వీరెస్కీన్స్ వీటి ఆతిధ్య మొక్కలపై దాడి చేసి వీటికి అందవలసిన నీరు మరియు మినరల్ లవణాలను గ్రహించివేస్తాయి. అందువల్లనే వీటిని "నీటి పారసైట్" అని కూడా అంటారు. ఆకులు రాలిపోయేవరకు ఈ ఆల్గెల్ వాటిని చుట్టి ఉంటుంది. ఆకులపై వున్న గాయాల ద్వారా లోపలి చేరే బీజాల వలన మచ్చలు ఏర్పడతాయి. గాయాలు లేని ఆకులలోపలలకు ఇవి చేరినట్టు ఆధారాలు లేవు.