క్యారెట్

నెమటోడ్స్

Nematoda

ఇతర

క్లుప్తంగా

  • ఎదుగుదల మందగిస్తుంది.
  • ఆకులు పసుపు రంగు లోకి మారడం, వాడిపోవడం, ఆకుల ఆకృతి మారడం జరుగుతుంది.
  • వేర్లు ముడులు పడడం లేదా గాల్స్ వంటి నిర్మాణాలు ఏర్పడతాయి.
  • కాడలు కూడా ప్రభావితమవుతాయి.

లో కూడా చూడవచ్చు

42 పంటలు
ఆపిల్
అప్రికోట్
అరటి
చిక్కుడు
మరిన్ని

క్యారెట్

లక్షణాలు

నెమటోడ్లు మొక్కలను ఆశించడం వలన అనేక విధాలుగా నష్టం కనపడుతుంది. ఈ నష్టం వాటి జాతి, పొలంలో వున్న అతిధి మొక్కలు మరియు వాటి జనాభా మీద ఆధారపడివుంటుంది. కొన్ని నెమటోడ్ల రకాలు వాటి ఆతిధ్య మొక్కల వేర్ల ఉత్పత్తిని పెంచుతాయి మరియు రూట్ నాట్ మరియు వేరు బుడిపెలను ఉత్పత్తి చేస్తాయి. మరి కొన్ని, విస్తృతమైన వేరు గాయాలు మరియు వేరు అంతర్గత కణజాలాల క్షీణతకు కారణమవుతాయి. చాలా సందర్భాల్లో ఫంగై లేదా మట్టిలో బాక్టీరియా వలన ఈ గాయాలు రెండవసారి దాడికి గురవుతాయి. నీరు మరియు పోషకాలు మొక్కల పైభాగాలకు అందవు. సంక్రమణకు గురైన మొక్కలలో ఎదుగుదల తక్కువ ఉంటుంది మరియు వాటి ఆకులు పాలిపోతాయి. కొన్ని సార్లు కాండాలు కూడా ప్రభావితమవుతాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

కొన్ని పరిస్థితుల్లో జీవ నియంత్రణ ఏజెంట్లు పని చేస్తాయి. నెమటోఫోరా గైనోఫిలా ఫంగై మరియు వెర్టిసిల్లీయం క్లామిడోస్పోరియం వంటివి కూడా ఈ నెమటోడ్లను నియంత్రించటంలో సమర్ధవంతంగా పనిచేసాయి. బంతి మొక్కల పదార్థాలు (టగెటీస్ పటుల) మరియు కేలండ్యులా (కేలండ్యులా ఆఫీసినలిస్) సారాన్ని మట్టికి కలిపినప్పుడు కూడా వీటి జనాభాను ఒక స్థాయి వరకు తగ్గిస్తాయి

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవసంబంధమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. వీటి నివారణ పద్ధతులు నెమటోడ్ల జాతులను బట్టి ఉంటుంది. నేమటిసిడ్స్ ( డాజోమెట్) సాయిల్ ఫుమిగాంట్స్ గా చల్లటం మంచి ఫలితాలను ఇస్తుంది కానీ చాలా మంది రైతులకు వీటి వాడకం లాభదాయకం కాకపోవచ్చు. వీటిలో కొన్ని ఉత్పత్తులు ఆకులపై పిచికారిగా కూడా వాడొచ్చు.

దీనికి కారణమేమిటి?

నెమటోడ్లు చాలా చిన్న పురుగులు, ఇవి ఎక్కువగా భూమి లోనే ఉంటాయి మరియు అక్కడి నుండే ఆతిధ్య మొక్కల వేర్ల పై దాడి చేస్తాయి. సహజంగా ఇవి ప్రయోజనాన్ని కలిగించేవే కానీ వీటి జనాభా ఎక్కువ అయినప్పుడు ఇవి మొక్కలకు నష్టం కలిగిస్తాయి. వీటికి స్టైలెట్లు ఉండడం వీటి ప్రత్యేకత. ఈ స్టైలెట్లు వేర్ల లోకి చొచ్చుకొని వెళ్ళటానికి మరియు మట్టిలో వుండే మొక్కల భాగాలు మరియు కొన్ని సందర్భాలలో ఆకులు మరియు పుష్పాలపైన చొచ్చుకుపోవడానికి ఉపయోగపడతాయి. ఇవి ఆహరం తీసుకునే పద్ధతులు అనేక రకాలుగా ఉంటుంది. ఇవి అనేక సంవత్సరాలు భూమిలో జీవించి ఉండగలుగుతాయి. ఇవి మధ్యంతర అతిధుల వలన రెట్టింపు అవుతాయి. బాక్టీరియా, వైరస్ లేదా ఫంగై వల్ల కలిగే తెగుళ్లను కూడా ఇవి వ్యాపింపచేస్తాయి.


నివారణా చర్యలు

  • అందుబాటులో ఉంటే నిరోధక లేదా సహనాత్మక మొక్కల రకాలు వాడండి.
  • సంక్రమణ అధికంగా ఉన్నపుడు కొన్ని నెలల పాటు బీడుగా ఉంచండి.
  • అనేక సంవత్సరాల పాటు వివిధ రకాల మొక్కలతో పంట మార్పిడి చేయండి.
  • పొలంలో బంతి లేదా కాలండ్యులా మొక్కలు అంతరపంటగా వేయండి.
  • పొలాన్ని ప్లాస్టిక్ రక్షణ కవచం తో అనేక వారాల పాటు కప్పి ఉంచండి.
  • పొలాన్ని దున్ని దాన్ని ఎండకి ( సోలార్ రేడియేషన్) వదిలేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి