Gastropoda
ఇతర
స్లగ్స్ మరియు నత్తలు, ఆకులు, కాండాలు, పువ్వులు, దుంపలు మరియు గడ్డలను తింటూ పంటలలో తీవ్రమైన అలజడిని కలగచేసే విస్తారంగా వ్యాపించిన చీడలు. అవి ఇష్టం వచ్చినట్టు తింటాయి మరియు తరచూ ఆకుల్లో పెద్ద రంధ్రాలను వదిలివేస్తాయి కాని కాండం, పువ్వులు, దుంపలు మరియు గడ్డలను కూడా ప్రభావితం చేస్తాయి. బంగాళాదుంపలలో, ఇవి చర్మంలో గుండ్రని ఉపరితల రంధ్రాలను తయారు చేయవచ్చు లేదా దుంపలలోకి విస్తృతమైన కుహరాలను త్రవ్వి, గణనీయమైన నష్టాన్ని కలిగిస్తాయి. మొక్కల ఆకులు మరియు నేల ఉపరితలంపై వెండి బురద బాటలను చూడవచ్చు. ఇవి ముఖ్యంగా లేత, మృదువైన మొక్కలను త్వరగా ఆశిస్తాయి మరియు నిజానికి ఇవి చిన్న మొలకలను మొత్తంగా తినేయగలవు.
సేంద్రీయ సాగులో ఫెర్రిక్ ఫాస్ఫేట్ ఆధారిత గుళికలను ఉపయోగించడం ఆమోదించబడింది. హెడ్జ్ హోగ్స్, పక్షులు, కప్పలు, బావురు కప్పలు, బ్లైండ్ వార్మ్స్ మరియు నేల కుమ్మరపురుగులు వంటి వేటాడే జీవులను మంచి క్షేత్ర నిర్వహణ పద్ధతుల ద్వారా ప్రోత్సహించాలి.
వీలైనంతవరకు ఎల్లప్పుడూ నివారణా చర్యలతో కూడిన జీవసంబంధమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. చాలా వైవిధ్యభరితమైన వీటి జీవిత చక్రం కారణంగా, స్లగ్స్ రసాయన నియంత్రణలకు దూరంగా ఉంటాయి. వీటిని వాటి రంధ్రాల నుండి బైటకు రప్పించడానికి మెటాల్డిహైడ్ ఆధారిత గుళికలను ఉపయోగించండి. స్లగ్స్ మరియు నత్తలు చురుకుగా ఉన్నప్పుడు వర్షం తర్వాత వాటిని వెదజల్లండి
నత్తలు మరియు స్లగ్స్ కుళ్ళిన సేంద్రీయ పదార్థం, మరియు పలు రకాల పంటల యొక్క ఆకులు, వేర్లు మరియు దుంపలను ఆహారంగా తీసుకుంటాయి. ఇవి మొక్క కాండాలు లేదా పురుగులు తయారు చేసిన పగుళ్లు మరియు సొరంగాలను ఉపయోగించే భూమి లోపల జీవించే జీవులు. ఇవి కేవలం సంపర్కంలో పాల్గొనడానికి మాత్రమే భూమి ఉపరితలానికి వస్తాయి. దుంపలపై తొక్కకు చిన్న గుండ్రని రంధ్రాలు చేస్తాయి లేదా దుంపల లోపల వరకు విస్తారమైన రంధ్రాలు చేయవచ్చు. ఫలితంగా గణనీయమైన నష్టం కలిగిస్తాయి. స్లగ్స్ తడి వాతావరణ పరిస్థితుల్లో వృద్ధి అవుతాయి, కాబట్టి ఈ చీడ ప్రధానంగా మంచు కురిసిన రాత్రులు లేదా వర్షపాతం తర్వాత సంభవిస్తుంది. కొద్దిపాటి చలిని ఇవి బాగా తట్టుకుంటాయి. మరల వసంత కాలంలో ఇవి చురుకుగా ఉంటాయి.