వరి

బోరాన్ లోపం

Boron Deficiency

లోపం

క్లుప్తంగా

  • ఆకులు పసుపు రంగులోకి మారి మందంగా తయారవుతాయి.
  • ఆకులు మరియు కాండం పెళుసుగా మారతాయి.

లో కూడా చూడవచ్చు

59 పంటలు
బాదం
ఆపిల్
అప్రికోట్
అరటి
మరిన్ని

వరి

లక్షణాలు

పంట మరియు పెరిగే పరిస్థితులను బట్టి లక్షణాలు మారుతూ ఉంటాయి, కానీ సాధారణంగా అవి కొత్తగా పెరుగుతున్న మొక్కలపై మొదట కనిపిస్తాయి. సాధారణంగా లేత ఆకుల రంగు పాలిపోవడం మరియు మందంగా తయారవ్వడం మొదటి లక్షణం. పసుపు రంగు ఏకరీతిగా విస్తరించవచ్చు,, ఈనెల మధ్యన విస్తృతంగా ఉండొచ్చు లేదా ప్రధాన ఈనెల నుండి దూరాన్ని బట్టి క్రమంగా తగ్గుతూ. ఉండవచ్చు చిగుర్ల కొన వద్ద ఆకులు మరియు కాడలు పెళుసుగా ఉంటాయి మరియు వంచినప్పుడు సులభంగా విరుగుతాయి. ఆకులు ముడుచుకుపోవచ్చు (ఈనెల మధ్యభాగంలో కొద్దిగా ఉబ్బి), కొన మరియు పార్శ్వ భాగాలు వంకరపోవచ్చు. కొన్ని సందర్భాల్లో, ఆకు ఈనెలు మందంగా మరియు నిటారుగా కనిపిస్తాయి మరియు ఆకు కాడలు మెలి తిరగవచ్చు. కణుపుల మధ్య భాగం కుదించబడవచ్చు, పైభాగానికి సమీపంలో అధిక సాంద్రతతో ఆకులను ఉత్పత్తి చేయబడవచ్చు. తీవ్రత అధికంగా వున్నప్పుడు ఈ లోపం ఎదిగే మొక్కల భాగాలు నిర్జీవంగా మారడానికి కారణమౌతుంది. ఈ లోపం పెరిగే కొలదీ నిల్వ వేర్లు చిన్నగా ఉండి వేర్ల చివర్లు మొద్దుబారిపోయి చిట్లిపోవచ్చు.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

మంచి సేంద్రియ ఎరువును ఉపయోగించడం ద్వారా సేంద్రీయ పదార్థం మరియు నీరు నిలుపుదల సామర్ధ్యం గల ఆరోగ్యకరమైన నేలలు ఉండేలా చూసుకోండి.

రసాయన నియంత్రణ

  • బోరాన్ సవరణ గల ఎరువులు వాడండి (బి). -ఉదాహరణ: ఆకుల స్ప్రే కోసం డిసోడియం ఆక్టాబోరేట్ టెట్రాహైడ్రేట్ (బోరాన్ 20%).
  • మీ నేల మరియు పంటకు సరైన ఉత్పత్తి మరియు మోతాదును తెలుసుకోవడానికి మీ వ్యవసాయ సలహాదారుడిని సంప్రదించండి.

మరిన్ని సిఫార్సులు:

  • మీ పంట దిగుబడిని గరిష్టం చేయడానికి పంట కాలం ప్రారంభానికి ముందు మట్టి పరీక్ష సిఫార్సు చేయబడింది.
  • ఆకుల మీద ఉపయోగించే స్ప్రేలు అనేక పంటలపై ఆకులను దెబ్బతీస్తాయి కాబట్టి బోరాన్ ను మట్టి ద్వారా అందించడం మంచిది.

దీనికి కారణమేమిటి?

బోరాన్ లోపం సాధారణంగా అధిక పి హెచ్ గల నేలలలో కనపడుతుంది. ఎందుకంటే ఈ పరిస్థితులలో ఈ మూలకం మొక్కకు అందుబాటులో లేని ఒక రసాయన రూపంలో ఉంటుంది. తక్కువ సేంద్రీయ పదార్థం (<1.5%) గల నేలలు లేదా (పోషక వడపోతకు గురయ్యే అవకాశం ఉన్న) ఇసుక నేలలు కూడా బోరాన్ లోపానికి గురవుతాయి. ఆ సందర్భాలలో బోరాన్ వాడిన సరే ఈ లోపాన్ని సరిదిద్దకపోవచ్చు. ఎందుకంటే ఇది మొక్క శోషణకు అందుబాటులో ఉండకపోవచ్చు. ఆకుల మీది లక్షణాలు ఇతర చీడల లక్షణాలను పోలి ఉంటాయి: ఫాల్స్ స్పైడర్ మైట్, జింక్ లోపం లేదా తేలికపాటి ఇనుము లోపం. నిల్వ వేర్లపై, పొక్కు వంటి గడ్డలు మరియు పగుళ్ళు అనేవి కూడా వేరు ముడి నెమటోడ్ లేదా మట్టి తేమలో త్వరగా వచ్చే మార్పుల యొక్క లక్షణాలు కావచ్చు. కాల్షియం లోపం వల్ల చిగుర్లు మరియు వేరు చివర్లు కూడా చనిపోవచ్చు, కాని చిగురు కొనల క్రింద ఉన్న లేత ఆకులు మందంగా మారవు మరియు ఈనెల మధ్యన పసుపు రంగును వృద్ధి చేయవు.


నివారణా చర్యలు

  • మట్టికి ఎక్కువ ఎరువులు లేదా సున్నం వేయకండి.
  • పంటలకు ఎక్కువ నీరు పెట్టడాన్ని నివారించండి.
  • అధిక pH మరియు బంకమన్ను ఖనిజాలు, ఇనుము లేదా అల్యూమినియం ఆక్సైడ్లు అధికంగా ఉన్న నేలలను నివారించండి.
  • అధిక గాలి తేమ మరియు తక్కువ నేల తేమను నివారించండి.
  • మీ పొలం యొక్క పోషక స్థాయిలను పూర్తిగా అర్ధం చేసుకోవడానికి మట్టిని తరుచుగా పరీక్ష చేయుంచండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి