Zinc Deficiency
లోపం
జింక్ లోపం లక్షణాలు వివిధ రకాల మొక్కల మధ్యన మారుతూ ఉంటాయి కానీ చాలా లక్షణాలు ఒకేలా ఉంటాయి. తరచుగా మొక్కలలో ఆకులు ఆకుపచ్చ రంగుతో వుంటాయి. కొన్ని జాతులలో, లేత ఆకులు అధికంగా ప్రభావితమవుతాయి, కానీ ఇతర జాతిమొక్కలలో పాత మరియు కొత్త ఆకులు రెండూ ఒకే లక్షణాలను కనపరుస్తాయి. కొత్తగా వచ్చే ఆకులు తరచూ చిన్నగా, సన్నగా ఉంటాయి మరియు ముడుతలు పడిన అంచులను కలిగి ఉంటాయికాలక్రమేణా, పసుపు రంగు (క్లోరోటిక్) మచ్చలు రాగి రంగులోనికి మారగలవు మరియు చనిపోయిన (నెక్రోటిక్) మచ్చలు అంచుల నుండి పెరగడం జరగవచ్చు. కొన్ని పంటలలో జింక్ లోపం గల ఆకులు తరచూ కుదించబడిన కణుపులను కలిగి ఉంటాయి, అందుచే ఆకులు కాండం మీద పెరగడం ప్రారంభిస్తాయి (రోసెట్టింగ్). ఆకులు ఆకారం కోల్పోయి మొక్కలలో ఎదుగుదల తగ్గిపోతుంది. దీనివలన కొత్త ఆకులు (మరుగుజ్జు ఆకులు) ఏర్పడడం మరియు కణుపుల పొడవు తగ్గుతుంది.
నాటిన తర్వాత కొన్ని రోజులకు నారుమడిలో లేదా పొలంలో పశువుల పెంట వేయడం ద్వారా జింక్ లోపాన్ని నివారించవచ్చు.
వరిలో జింక్ లోపం నివారించడానికి జింక్ సల్ఫేట్ కలిగిన ఉత్పత్తులను నారుమడిలో చల్లవచ్చు. జింక్ లోపం లక్షణాలు గమనించన తర్వాత జింక్ సల్ఫేట్ 0.2-0.5% ఆకు స్ప్రేలను వారం వ్యవధిలో లేదా పదిరోజులకు ఒకసారి (3 స్ప్రేలు) ఉపయోగించండి. నేల రకం, pH మరియు ఆకులలోని జింక్ యొక్క అసలు సాంద్రత బట్టి వేయవలసిన మోతాదు సిఫార్సు చేయబడుతుంది. పైన సూచించిన పరిమితుల మీద ఆధారపడి మోతాదు ఉంటుంది. సాధారణంగా హెక్టారుకు 5 నుంచి 10 కిలోల జింక్ వాడవలసి ఉంటుంది. జింక్ ను అధికంగా వాడడంవలన జింక్ టాక్సిసిటీ రావచ్చు. విత్తనాలను జింక్ తో పూత పూయడం వలన ఈ సూక్మ మూలక లోపాన్ని తగ్గించవచ్చు. ప్రత్యామ్నాయంగా విత్తనాలు వేసే ముందు 2-4% జింక్ ఆక్సైడ్ ద్రావణంలో విత్తనాలను నానబెట్టి వాడవచ్చు.
జింక్ లోపం అనేది క్షార నేల (అధిక pH), సేంద్రీయ పదార్థం తక్కువగా ఉండే ఇసుక నేలలలో ప్రధాన సమస్య. అధిక స్థాయిలో నేల భాస్వరం మరియు కాల్షియం (సున్నపురాయి నేలలు) కూడా మొక్కలకు జింకు లభ్యతను ప్రభావితం చేస్తాయి. నిజానికి, భాస్వరం వాడకం జింక్ వినియోగంపై విరుద్ధమైన ప్రభావాలు చూపవచ్చు. సున్నపురాయి లేదా సుద్ద (సున్నం) వంటి కాల్షియం అధికంగా ఉండే పదార్ధాలను చేర్చడం కూడా నేల ఆమ్లతను తగ్గించడమే కాక మొక్కల జింక్ వినియోగాన్ని తగ్గిస్తుంది (నేలలోని స్థాయిలు మారనప్పటికీ). ఏపుగా పెరిగే దశలో నేలలు చల్లగా మరియు తడిగా ఉన్నప్పుడు కూడా జింకు లోపం ఒక సమస్యగా తయారవుతుంది.