ఇతరములు

గంధకం లోపం

Sulfur Deficiency

లోపం

క్లుప్తంగా

  • లేత ఆకులు ప్రభావితమవుతాయి.
  • ఆకు పరిమాణం తగ్గుతుంది.
  • ఆకులు రంగు కోల్పోతాయి: పాలిపోయిన ఆకుపచ్చ - పసుపు ఆకుపచ్చ - పసుపు.
  • సన్నని కాడలు ఊదా రంగు లోకి మారతాయి.
  • వృద్ధి కుంగిపోయింది.

లో కూడా చూడవచ్చు

58 పంటలు
బాదం
ఆపిల్
అప్రికోట్
అరటి
మరిన్ని

ఇతరములు

లక్షణాలు

గంధకం లోపం వున్న ఆకులు తరచూ మొదట పాలిపోయిన లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి, తర్వాత పసుపు-ఆకుపచ్చరంగు నుండి పూర్తి పసుపు రంగులోకి మారతాయి. కాండాలు తరుచుగా ఊదా రంగులోకి మారతాయి. ఈ లక్షణాలు, నత్రజని లోపం లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి మనం ఈ రెండింటి విషయంలో సులువుగా పొరబడవచు. అయితే, గంధకం లోపం విషయంలో అవి కొత్త, ఎగువ ఆకులలో మొట్టమొదట కనిపిస్తాయి. కొన్ని పంటలలో, ఈనెల మధ్య ప్రాంతం పాలిపోయిన రంగులోకి మారిపోతుంది లేదా ఆకు అంచుపై చుక్కలు కనపడడం జరుగుతుంది (గోధుమ మరియు బంగాళాదుంప). సాధారణంగా ఆకులు చిన్నగా వుండి సన్నగా పెరిగి నిర్జీవమైన కొనలను కలిగి ఉండవచ్చు. దూరం నుండి చూస్తే పొలంలోని ప్రభావిత ప్రాంతాలు లేత ఆకుపచ్చ లేదా ప్రకాశవంతమైన పసుపు రంగులో కనబడవచ్చు. పొడవైన నిరోధిత పెరుగుదలతో, కాండాలు సన్నగా పెరుగుతాయి. ఈ లోపం సీజన్ ప్రారంభంలో మొదలైతే మొక్క ఎదుగుదల కుంటుపడడం, పూత తగ్గడం మరియు పండ్లు/ధాన్యాలు ఆలస్యంగా పక్వానికి రావడం జరగవచ్చు. సల్ఫర్ తక్కువగా వుండే నేలలలో వేసిన మొలకలు సాధారణం కంటే అధికంగా చనిపోయే అవకాశం ఉంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

జంతువుల పెంట, ఆకులు లేదా మొక్కల రక్షక కవచం యొక్క కంపోస్ట్ మిక్స్ అనేది మొక్కలకు సేంద్రీయ పదార్థాలు, సల్ఫర్ మరియు బోరాన్ వంటి పోషకాలను అందించడానికి ఉత్తమమైనది. ఇది సల్ఫర్ లోపాన్ని అధిగమించడానికి ఒక దీర్ఘకాలిక విధానం.

రసాయన నియంత్రణ

  • సల్ఫర్ (ఎస్) కలిగిన ఎరువులు వాడండి.
  • ఉదాహరణ: ఆకులపై పిచికారీ కోసం సల్ఫర్ 90% WDG.
  • మీ నేల మరియు పంటకు ఉత్తమమైన ఉత్పత్తి మరియు మోతాదును తెలుసుకోవడానికి మీ వ్యవసాయ సలహాదారుని సంప్రదించండి.

మరిన్ని సిఫార్సులు:

  • మీ పంట ఉత్పత్తిని గరిష్ట స్థాయికి పెంచడానికి పంట సీజన్ ప్రారంభానికి ముందు మట్టి పరీక్ష సిఫార్సు చేయబడింది.
  • నాటడానికి ముందు సల్ఫర్ వేస్తే మంచిది.
  • మీ పంట పిహెచ్ బాగా ఎక్కువగా ఉంటే సిట్రిక్ యాసిడ్‌ను వాడండి.

దీనికి కారణమేమిటి?

గంధకం లోపం అనేది ప్రకృతి లేదా వ్యవసాయంలో సర్వసాధారణం కాదు. సల్ఫర్ చలించే గుణం కలది కనుక నీరు అధికంగా వున్నప్పుడు ఇది భూమిలోకి బాగా లోతుకు ఇంకిపోతుంది. తక్కువ సేంద్రీయ పదార్థాలు గల నేలలు, బాగా దెబ్బతిన్న నేలలు, ఇసుక నేలలు లేదా అధిక పి హెచ్ గల నేలలలో ఈ లోపం అధికంగా కనిపిస్తుంది. గంధకం, నేలలోని మట్టి సేంద్రీయ పదార్ధాలలో ఉంటుంది లేదా బంకమట్టి ఖనిజాలకు జతచేయబడి ఉంటుంది. మినరలైజేషన్ అని పిలువబడే ప్రక్రియ ద్వారా మట్టిలోని బ్యాక్టీరియా మొక్కలకు దీనిని అందుబాటులో ఉండేలా చేస్తాయి. అధిక ఉష్ణోగ్రతలు వున్నప్పుడు ఈ సూక్ష్మజీవుల మెరుగైన కార్యకలాపాలు మరియు పెరిగిన వాటి సంఖ్య కారణంగా ఈ ప్రక్రియ అనుకూలంగా ఉంది . మొక్కలలో గంధకం చలించకుండా ఉంటుంది మరియు ముదురు ఆకుల నుండి లేత ఆకులకు వెంటనే స్థానచలనం పొందదు. అందువలన ఈ లోపం మొదట లేత ఆకులపై కనిపిస్తుంది.


నివారణా చర్యలు

  • ఎరువులను వుపయోగించి నారుమడికి గంధకమును సరఫరా చేయండి.
  • గడ్డిని పూర్తిగా తొలగించడం లేదా కాల్చివేయడానికి బదులుగా దానిని మట్టిలోకి కలియ దున్నండి.
  • గంధకము లభ్యతను పెంచేందుకు పంట కోత తర్వాత పొడి భూమిని దున్నడం ద్వారా నేల నిర్వహణను మెరుగుపరచండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి