ఉల్లిపాయ

భాస్వరం లోపం

Phosphorus Deficiency

లోపం

క్లుప్తంగా

  • ఊదా రంగు ఆకులు - అంచులనుండి మొదలవుతాయి.
  • ఆకులు చుట్టుకుపోతాయి.
  • ఎదుగుదల మందగిస్తుంది.

లో కూడా చూడవచ్చు

59 పంటలు
బాదం
ఆపిల్
అప్రికోట్
అరటి
మరిన్ని

ఉల్లిపాయ

లక్షణాలు

భాస్వరం లోపం లక్షణాలు అన్ని దశలలో కనిపిస్తాయి కాని లేత మొక్కలలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇతర పోషకాల లోపాలకు భిన్నంగా, భాస్వర లోపం యొక్క లక్షణాలు సులువుగా గుర్తించగలిగేటట్టు వుండవు. ఈ లోపం తక్కువగా వున్నప్పుడు మొక్కలు మరుగుజ్జులుగా ఉండి ఎదుగుదల తగ్గిపోతుంది. ఆకులపైన స్పష్టమైన లక్షణాలను గమనించలేము. ఈ లోపం తీవ్రంగా ఉంటే కాండం మరియు ఆకు కాడలు ముదురు ఆకుపచ్చ నుండి ఊదారంగులోకి మారిపోతుంది. ముదురు ఆకుల క్రిందిభాగంలో ఆకుకొన మరియు అంచుల నుండి మొదలు అయ్యి తర్వాత మిగిలిన పొరల వరకు విస్తరించే ఊదారంగు లోకి మారిన ఆకులను గమనించవచ్చు. ఈ ఆకులు తోలు వలె అయి ఈనెలు గోధుమరంగు అల్లిక మాదిరిగా ఏర్పడవచ్చు. కొన్ని టమాటో రకాలలో కాలిన ఆకు కొనలు మరియు పచ్చరంగు కోల్పోయి పాలిపోయినట్టు అవ్వడం (కోర్రోసిస్) ఆకు అంచులపైన నిర్జీవమైన మచ్చలు ఏర్పడడం జరుగుతుంది. పూలు ఉత్పత్తవుతాయి కానీ పండ్ల దిగుబడి తక్కువగా ఉంటుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

పెరటి పెంట లేదా ఇతర పదార్థాలు (సేంద్రియ రక్షక కవచం, కంపోస్ట్) లేదా వాటి మిశ్రమాన్ని ఉపయోగించడం ద్వారా నేలలోని భాస్వరం లోపాన్ని భర్తీ చేయవచ్చు. పంట కోత తర్వాత ఆ పంట అవశేషాలను దున్ని మట్టిలోకి చేర్చడం వలన దీర్ఘకాలంలో ఈ భాస్వరం లోపాన్ని సరిదిద్దవచ్చు మరియు మట్టి నిర్మాణాన్ని మెరుగుపరచవచ్చు. సేంద్రీయ పదార్థం యొక్క కుళ్ళిపోవడం ద్వారా స్థిరంగా మొక్కకు భాస్వరం సరఫరా అవుతుంది

రసాయన నియంత్రణ

  • భాస్వరం (P) కలిగిన ఎరువులను వాడండి.
  • ఉదాహరణ: డై అమ్మోనియంఫాస్పేట్ (DAP), సింగల్ సూపర్ ఫాస్ఫేట్(SSP)
  • మీ నేల మరియు పంటకు తగిన ఉత్పత్తి, మోతాదును తెలుసుకోవడానికి మీ వ్యవసాయ సలహాదారుని సంప్రదించండి.

                                 మరిన్ని సిఫార్సులు:-

  • పంట దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి పంట సీజన్ ప్రారంభానికి ముందు మట్టి పరీక్ష సిఫార్సు చేయబడింది.

దీనికి కారణమేమిటి?

వేర్వేరు పంటల మధ్య భాస్వరం లోపం వేర్వేరుగా ఉంటుంది. ఫాస్ఫేట్ అయాన్లు మట్టి నీటిలో కరిగినప్పుడు వేర్లు వీటిని గ్రహిస్తాయి. అధిక కాల్షియం సాంద్రత కలిగిన కాల్కేరియస్ నేలల్లో భాస్వరం తక్కువగా ఉంటుంది. అయితే, చాలా సాధారణంగా, ఈ పోషకం లభ్యత పరిమితంగా ఉంటుంది, ఎందుకంటే భాస్వరం నేల కణాలకు అంటుకుని ఉంటుంది మరియు మొక్క చేత సంగ్రహింపబడదు. క్షార నేలలు మరియు ఆమ్ల నేలలు, రెండూ తక్కువ లభ్యతను కలిగి ఉంటాయి. తక్కువ సేంద్రియ పదార్థాలు లేదా ఇనుము అధికంగా ఉండే నేలలు కూడా సమస్యాత్మకంగా ఉంటాయి. సరైన వృద్ధి మరియు వేర్ల పనితీరుకు ఆటంకం కలిగించే చల్లని వాతావరణం కూడా ఈ రుగ్మతకు దారితీస్తుంది. కరువు పరిస్థితులు లేదా నీరు మరియు పోషకాలను వేర్లు ద్వారా గ్రహించడం పరిమితం చేసే వ్యాధులు, ఈ లోపం లక్షణాలను ప్రేరేపిస్తాయి. మట్టిలో తేమ, ఈ పోషకం మొక్కలకు అధికంగా అందేటట్టు చేస్తుంది. దీనివలన దిగుబడి పెరుగుతుంది.


నివారణా చర్యలు

  • మట్టి నుండి భాస్వరాన్ని సులువుగా గ్రహించగలిగే మొక్కల రకాలను ఉపయోగించండి.
  • సమతుల్యం మరియు సమర్ధవంతంగా పనిచేసే ఎరువులను ఎంపికచేసుకోండి.
  • పంటకోత తర్వాత పొలాన్ని లోతుగా దున్ని పంట అవశేషాలు భూమిలోకి వెళ్ళేటట్టు చూడండి.
  • నేల పోషకాలను సంతులనంగా ఉంచడానికి ఖనిజ మరియు సేంద్రీయ ఎరువులతో కూడిన సమగ్ర సమీకృత విధానాన్ని పాటించండి.
  • నేల తగిన పి హెచ్ ను చేరుకోవడానికి అవసరమైతే పొలంలో సున్నం వేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి