బెండ

మెగ్నీషియం లోపం

Magnesium Deficiency

లోపం

క్లుప్తంగా

  • పాలిపోయిన ముదురు ఆకుపచ మచ్చలు లేదా పసుపు రంగు మచ్చలు ఆకుల అంచుల నుండి మొదలవుతాయి.
  • ప్రధాన ఈనె పచ్చగానే ఉంటుంది.
  • తరవాత ఆకులపై ఎర్రటి లేదా గోధుమ రంగు చుక్కలు ఏర్పడతాయి.
  • ఎండిపోయిన ఆకుల కణజాలాలు చనిపోతాయి.

లో కూడా చూడవచ్చు

59 పంటలు
బాదం
ఆపిల్
అప్రికోట్
అరటి
మరిన్ని

బెండ

లక్షణాలు

ముదురు ఆకు ఈనెల మధ్యన కణజాలంపై పాలిపోయిన మచ్చలు లేదా క్లోరోటిక్ మచ్చలు, తరచుగా ఆకు అంచులనుండి మొదలై కనిపిస్తాయి. ధాన్యపు పంటల్లో మెగ్నీషియం లోపం తక్కువగా వున్నప్పుడు సన్నని పచ్చరంగు రేఖ లాగ ఏర్పడి అది మెల్లగా ఈనెల మధ్యన క్లోరోసిస్ గా మారుతుంది. ఈ లోపం తీవ్రంగా వున్నప్పుడు ఈ మచ్చలు మెల్లగా ఆకు మధ్యకు వ్యాపించి చిన్న ఈనెలు కూడా రంగు పాలిపోయినట్టు అవుతాయి. ఆకు ఈనెల మధ్య భాగంలో ఎర్రని లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తరువాత ఇవి నిర్జీవంగా మారి ఆకు అంతా వికృత రూపం సంతరించుకుంటుంది. చివరకు ఆకు అంతా ఈ పసుపు రంగు ఆక్రమించి ఆకులు ముందుగానే చనిపోయి రాలిపోతాయి. వేర్ల ఎదుగుదల నియంత్రించబడి మొక్కల సత్తువ తగ్గిపోతుంది .

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఆల్గల్ లైమ్ స్టోన్, ఎప్సమ్ సాల్ట్, డోలమైట్ లేదా లైమ్ స్టోన్ మెగ్నీషియం వంటి మెగ్నీషియం కలిగిన పదార్ధాలను ఉపయగించండి. మట్టిలో పోషకాలను సమపాళ్లలో ఉంచడానికి సేంద్రియ మల్చింగ్ , పెంట లేదా కంపోస్టును పొలంలో వేయండి. వీటిలో సేంద్రియ పదార్ధం మరియు పోషకాలు ఉంటాయి. ఇవి మెల్లగా మట్టిలోకి విడుదల చేయబడతాయి.

రసాయన నియంత్రణ

  • మెగ్నీషియం (Mg) కలిగిన ఎరువులు వాడండి.
  • ఉదాహరణలు: మెగ్నీషియం ఆక్సైడ్, మెగ్నీషియం సల్ఫేట్ (MgSO4).
  • మీ నేల మరియు పంటకు ఉత్తమమైన ఉత్పత్తి మరియు మోతాదును తెలుసుకోవడానికి మీ వ్యవసాయ సలహాదారుని సంప్రదించండి.

మరిన్ని సిఫార్సులు:

  • మీ పంట ఉత్పత్తిని మెరుగుపరచడానికి పంట సీజన్ ప్రారంభానికి ముందు మట్టి పరీక్ష సిఫార్సు చేయబడింది.
  • మెగ్నీషియం ను నేరుగా మట్టికి లేదా ఆకులపై పిచికారిగా వాడవచ్చు.

దీనికి కారణమేమిటి?

తక్కువ పోషకాలు వుండే మరియు తక్కువగా నీటిని ఒడిసిపట్టుకుని సామర్ధ్యం వుండే తేలిక రకం ఇసుక నేలలు లేదా ఆమ్ల నేలలలో ఈ మెగ్నీషియం లోపం సాధారణంగా కనిపిస్తుంది. . ఈ రకం నేలల్లో ఈ పోషకాలు మట్టిలోపలకు పీల్చుకోబడతాయి. పొటాషియం లేదా అమ్మోనియం అధికంగా వుండే నేలల్లో లేదా పొలంలో ఈ రెండు పోషకాలను అధికంగా ఉపయోగించినా సమస్య తీవ్రతరం అవుతుంది. ఎందుకంటే ఇవి రెండు మెగ్నీషియంతో మట్టిలో పోటీ పడతాయి. మొక్కలలో చక్కర రవాణాలో మెగ్నీషియం ఒక కీలకపాత్రను పోషిస్తుంది. అలాగే క్లోరోఫిల్ కణాలలో ఒక ముఖ్య భాగంగా ఉంటుంది. సరైన మోతాదులో మొక్కలకు మెగ్నీషియం అందకపోతే అది ముదురు ఆకులలో క్లోరోఫిల్ ను తగ్గించి కొత్తగా వస్తున్న మరియు ఎదుగుతున్న ఆకులకు దీనిని అందచేస్తుంది. అందువల్లనే ఈనెల మధ్య భాగం పాలిపోతుంది. కాంతి తీవ్రత ఈ లక్షణాలను బాగా ప్రభావితం చేస్తుంది. కాంతి అధికంగా వున్నట్లైతే ఈ లక్షణాలు మరింత తీవ్రమౌతాయి.


నివారణా చర్యలు

  • మట్టి పి హెచ్ స్థాయిలను పరీక్షించండి.
  • పి హెచ్ ను సరైన స్థాయికి తీసుకుని రావడానికి అవసరమైతే సున్నాన్ని పొలంలో వేయండి.పొలంలో సరైన డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటుచేసుకోండి.
  • మొక్కలకు అధిక మొత్తంలో నీరు పెట్టవద్దు.
  • అధిక మోతాదులో పోటాష్ వాడవద్దు.
  • నేలలో తేమను స్థిరంగా ఉంచడానికి సేంద్రియ పదార్ధాలతో(మల్చింగ్) మట్టిని కప్పి ఉంచండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి