బంగాళదుంప

కాల్షియం లోపం

Calcium Deficiency

లోపం

క్లుప్తంగా

  • ఆకులపైన ఒక పద్దతిలో లేని పసుపు రంగు మచ్చలు.
  • పేలవంగా వృద్ధి చెందిన లేత రెమ్మలు లేదా కాండం మరియు పండ్లు.
  • మొక్క వాలిపోతుంది.
  • ఎదుగుదల మందగిస్తుంది.

లో కూడా చూడవచ్చు

59 పంటలు
బాదం
ఆపిల్
అప్రికోట్
అరటి
మరిన్ని

బంగాళదుంప

లక్షణాలు

కొత్త రెమ్మలు మరియు ఆకులు వంటి వేగంగా పెరుగుతున్న కణజాలాలలో ఈ లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. లేత రెమ్మలు తక్కువగా వృద్ధి చెందుతాయి మరియు కాలక్రమేణా వాటి సంఖ్య తగ్గుతుంది. ప్రారంభంలో, ముదురు మరియు మధ్య వయసు ఆకులు ఆకు యొక్క వెడల్పైన భాగంలో యాదృచ్ఛికంగా చెల్లాచెదురైన పాలిపోయిన (కోరోటిక్) మచ్చలు కనిపిస్తాయి. ఈ లోపాన్ని సవరించకపోతే అవి కింద వైపుకు లేదా పైవైపుకు చుట్టుకుపోవడం ప్రారంభిస్తాయి మరియు వాటి అంచులు క్రమంగా నిర్జీవంగా అయ్యి మాడిపోతాయి. పరిపక్వ మరియు ముదురు ఆకులు సాధారణంగా ప్రభావితం చెందవు. వేరు వ్యవస్థ సరిగా అభివృద్ధి చెందదు మరియు మొక్కలు వాడిపోయే అవకాశం ఉంటుంది మరియు వాటిలో ఎదుగుదల కుంటుపడుతుంది. కాల్షియం లోపం తీవ్రంగా వున్నప్పుడు పువ్వులు ఎదగడం ఆగిపోవచ్చు మరియు కొత్త ఆకులు మాడిపోవచ్చు లేదా చనిపోవచ్చు. పండ్లు చిన్నగా ఉండి రుచి లేకుండా ఉంటాయి. దోస, మిరప మరియు టమోటాలలో, మొగ్గ చివర కుళ్లిపోతుంది. విత్తనాలు తక్కువ మొత్తంలో మొలకెత్తుతాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

చిన్న రైతులు లేదా తోటమాలులు పొడిచేసిన గుడ్ల పెంకులు మరియు బలహీనమైన ఆమ్లంతో (వినెగర్) కలిపిన గుడ్డు పెంకులను ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయంగా, నత్తగుల్లల సున్నపురాయి, బసాల్ట్ పిండి, కాల్చిన సున్నం, డోలమైట్, జిప్సం మరియు స్లాగ్ లైమ్ వంటి కాల్షియం అధికంగా ఉన్న పదార్థాలను ఉపయోగించండి. మట్టి యొక్క తేమ నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచే క్రమంలో పెంట లేదా కంపోస్ట్ రూపంలో వున్న సేంద్రీయ పదార్ధాన్ని మట్టిలో కలపవచ్చు.

రసాయన నియంత్రణ

  • కాల్షియం కలిగిన నేలలో వేసే ఎరువులు వాడండి(Ca).
  • ఉదాహరణలు: కాల్షియం నైట్రేట్, సున్నం, జిప్సం.  - మీ నేల మరియు పంటకు తగిన ఉత్పత్తి మరియు మోతాదును తెలుసుకోవడానికి మీ వ్యవసాయ సలహాదారుని సంప్రదించండి.

మరిన్ని సిఫార్సులు:

  • మీ పంట దిగుబడిని పెంచుకోవడానికి పంట సీజన్ ప్రారంభానికి ముందు మట్టి పరీక్ష సిఫార్సు చేయబడింది.
  • ఇప్పటికే ఉన్న లోపానికి నీటిలో కరిగే నైట్రేట్ ను ఆకులపై చల్లడానికి సిఫారసు చేయబడింది.
  • కాల్షియం క్లోరైడ్ ఉపయోగిస్తున్నప్పుడు, ఉష్ణోగ్రత 30 °C కంటే ఎక్కువ ఉంటే పిచికారీ చేయవద్దు.
  • పొలం తయారీ సమయంలో, నేల పి హెచ్ ఆమ్లంగా ఉంటే సున్నం వాడండి. అలాగే నేల పి హెచ్ ఆల్కలీన్ అయితే జిప్సం వాడండి.
  • నాటడానికి రెండు నుంచి నాలుగు నెలల ముందు సున్నం వాడవచ్చు.

దీనికి కారణమేమిటి?

సాధారణంగా తక్కువ మట్టి సరఫరా కంటే మొక్కలకు కాల్షియం లభ్యతతో లక్షణాలు ముడిపడి ఉంటాయి. కాల్షియం మొక్కలో సరిగా చలించదు మరియు దాని శోషణ మొక్క నీటిని పీల్చుకోవడం మరియు లోపల రవాణాతో ముడిపడి ఉంటుంది. ఈ లోపం యొక్క లక్షణాలను కొత్త ఆకులు మొదట ఎందుకు చూపిస్తాయో అనేదాన్ని దీనిని బట్టి తెలుస్తుంది. భార నేలలు మరియు సాగునీటి నేలలు కాల్షియంను కరిగించి దానిని మొక్కలు గ్రహించడంలో సహకరిస్తాయి. తక్కువగా నీటిని నిలుపుకోగల సామర్థ్యం తక్కువగా గల ఇసుక నేలలు కరువుకు గురయ్యే నేలల్లోఈ పోషకం లోపానికి గురయ్యే అవకాశం వుంది. అవసరమైనదానికంటే ఎక్కువ సమయం పొలంలో నీరుపెట్టకుండా వుంచేయడం వలన కూడా ఈ లక్షణాలు కనపడతాయి. తక్కువ pH, అధిక లవణీయత గల నేలలు లేదా అమ్మోనియం అధికంగా ఉన్న నేలలు కూడా సమస్యాత్మకం కావచ్చు. గాలిలో అధిక తేమ లేదా నేలలో ఎక్కువ నీటి పారుదల కూడా కణజాలానికి నీటి రవాణాను తగ్గించగలవు, దానివలన మొక్కలు తక్కువ మొత్తంలో కాల్షియంను శోషించుకుంటాయి.సాధారణంగా నేల pH పరిధి 7.0 మరియు 8.5 మధ్య ఉంటే మొక్క కాల్షియంను బాగా పీల్చుకుంటుంది.


నివారణా చర్యలు

  • మట్టి నుండి కాల్షియంను మెరుగ్గా సంగ్రహించగల మొక్కల రకాలను ఎంచుకోండి.
  • అవసరమైతే మట్టి పి హెచ్ ను పరీక్ష చేయించండి.
  • మరియు 7.0 మరియు 8.5 ల మధ్య మట్టి పి హెచ్ స్థాయిలను ఉంచడానికి అవసరమైతే సున్నం వాడండి.
  • మట్టిలో కాల్షియం లభ్యతను పెంచడానికి అమ్మోనియం ఆధారిత ఎరువుల వాడకాన్ని తగ్గించండి.
  • పండ్ల అభివృద్ధి ప్రారంభ సమయంలో నత్రజని కలిగిన ఎరువులు అధికంగా వేయవద్దు.
  • మొక్కల సమీపంలో పని చేస్తుంటే వేర్లకు హాని జరగకుండా జాగ్రత్తగా పడండి.
  • తరచూ నీరు పెట్టండి కాని ఎక్కువ నీరు పెట్టకండి.
  • పచ్చగడ్డి (గడ్డి, కుళ్ళిన రంపపు పొట్టు) లేదా ప్లాస్టిక్ రక్షక కవచం నేలలో తేమను నిలిపి ఉంచేందుకు సహాయపడుతుంది.
  • క్రమం తప్పకుండా పొలాన్ని పరిశీలించండి మరియు ఈ లోపం లక్షణాలు గల పండ్లను తొలగించండి.
  • పొలంలో సేంద్రియ పదార్ధాన్ని వేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి