ప్రత్తి

పొటాషియం లోపం

Potassium Deficiency

లోపం

క్లుప్తంగా

  • ఆకులు పసుపు రంగులోకి మారతాయి.
  • ప్రధాన ఈనెలు ముదురు పచ్చ రంగులోనే ఉంటాయి.
  • ఆకులు చుట్టుకుని ముడుచుకుపోతాయి.
  • ఎదుగుదల మందగిస్తుంది.

లో కూడా చూడవచ్చు

58 పంటలు
బాదం
ఆపిల్
అప్రికోట్
అరటి
మరిన్ని

ప్రత్తి

లక్షణాలు

పొటాషియం లోపం స్వల్పంగా వున్న సందర్భాల్లో, ఆకు అంచులు మరియు కొనలు పసుపు రంగులోకి మారతాయి. తరువాత ఆకు కొన మాడిపోతుంది. ఆకు కొన వద్ద కాలినట్లు అయి తరవాత ఆకు ఈనెల మధ్యన పాలిపోయినట్లు అవుతుంది, కానీ ఈనెలు మాత్రం పచ్చగానే ఉంటాయి(ఇంటర్వెనల్ క్లోరోసిస్). ఈ లోపాన్ని వెంటనే సవరించకపోతే ఈ భాగాలు ఎండిపోయిన, తోలు రంగులా లేదా గోధుమరంగు చారికలుగా( కణ నాశనం) మారి ఆకు అంచు నుండి మధ్య ఈనెకు వ్యాపిస్తాయి. కానీ ప్రధాన ఈనె ఆకుపచ్చగానే ఉంటుంది. తరచుగా ఆకులు చుట్టుకుపోయి, ముడతలు పడి ముందుగానే నశించిపోతాయి. లేత ఆకులు చిన్నగా, నిస్తేజంగా ఉండి ఒక కప్ ఆకారం లోకి మారతాయి. పొటాషియం లోపం వున్న మొక్కల యొక్క ఎదుగుదల తగ్గిపోయి త్వరగా వ్యాధుల బారిన పడడమేగాకా నీటి ఎద్దడికి మరియు మంచుకు త్వరగా ఒత్తిడికి లోనవుతాయి. కొన్ని సందర్భాల్లో, పండ్లు తీవ్రంగా వైకల్యం చెందుతాయి

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

సంవత్సరంలో కనీసం ఒకసారి పశువుల పెంట లేదా మొక్కల మల్చింగ్ పొలంలో వేయండి. చెక్క బూడిదలో కూడా అధిక పొటాషియం ఉంటుంది. ఆమ్ల స్వభావం కలిగిన నేలల్లో సున్నం వేయడం వలన పొటాషియం నిల్వ సామర్థ్యాన్ని పెంచవచ్చు.

రసాయన నియంత్రణ

  • పొటాషియం (K) కలిగిన ఎరువులను ఉపయోగించండి. .
  • ఉదాహరణ: మ్యురేట్ ఆఫ్ పోటాష్(MOP), పొటాషియం నైట్రేట్(KNO3)
  • మీ నేల మరియు పంటకు తగిన ఉత్పత్తి మరియు మోతాదును తెలుసుకోవడానికి మీ వ్యవసాయ సలహాదారుని సంప్రదించండి.

మరిన్ని సిఫార్సులు:

  • పంట ఉత్పత్తిని మెరుగుపరుచుకోవడానికి పంట సీజన్ ప్రారంభానికి ముందు మట్టి పరీక్ష సిఫార్సు చేయబడింది.
  • పొలం తయారీ సమయంలో మరియు పూత సమయంలో ఎరువులు వేయడం ఉత్తమం.
  • ఆకులపై పిచికారీ కంటే నేలలో ఎరువులుగా వేయడం ద్వారా పొటాషియంను పంటలు మరింత సమర్థవంతంగా గ్రహిస్తాయి.

దీనికి కారణమేమిటి?

నేలలో తక్కువ పొటాషియం నిల్వలు ఉండడం వలన మొక్కలకు సరిగా పొటాషియం అందక పొటాషియం లోపం ఏర్పడుతుంది. తక్కువ pH గల నేలలు మరియు ఇసుక లేదా సేంద్రీయ పదార్థం తక్కువగా వున్నతేలికపాటి నేలల్లో కరువు వలన పొటాషియం భూమి లోపలకు పీల్చబడి సమస్యలు కలిగిస్తుంది. అధిక వర్షపాతం మరియు పంటలో అధికంగా నీరు పెట్టడం వలన పోషకాలు మొక్కల వేర్లకు అందక పొటాషియం లోపం ఏర్పడవచ్చు. అధిక మొత్తంలో వున్న భాస్వరం, మెగ్నీసియం మరియు ఇనుము కూడా పొటాషియంతో పోటీపడతాయి. మొక్కలో నీటి రవాణాకు కణజాలం గట్టిగా ఉంచడానికి మరియు వాతావరణంలో వాయువులను మార్పిడి చేయండం లోను పొటాషియం ముఖ్యపాత్రను పోషిస్తుంది. తరువాత మొక్కలకు పొటాషియంను అందించినప్పటికీ పొటాషియం లోపం యొక్క లక్షణాలను పూరించలేము.


నివారణా చర్యలు

  • అధిక ఆమ్ల లేక క్షార నేలలు తరుచుగా ప్రధాన మరియు చిన్న మూలకాల లోపాలకు దారి తీస్తాయి.
  • అవసరమైతే మట్టిలో పి హెచ్ మరియు సున్నం స్థాయిని పరీక్షించండి.
  • పోటాషియం గ్రహించడంలో అధిక సామర్థ్యము వున్న రకాల మొక్కలను సాగు చేయండి.
  • మొక్కలకు క్రమం తప్పకుండా నీటిని అందించండి.
  • పొలానికి అధికంగా నీరు పెట్టకండి.
  • పెంట లేదా కుళ్ళిన మొక్కల రూపములో సేంద్రియ పదార్థమును కలపండి.
  • మొక్కకు సరైన పోషకాలు సరఫరా అవ్వడానికి ఎరువులను సమతుల్యంగా వాడండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి