పొగాకు

ఫంగస్ గ్నాట్స్

Bradysia matogrossensis

కీటకం

క్లుప్తంగా

  • చిన్న, దోమల వంటి కీటకాలు.
  • పొగాకు మొలకలు వాలిపోతాయి.
  • నర్సరీలలో తరచుగా సమస్యలు ఏర్పడతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
పొగాకు

పొగాకు

లక్షణాలు

మీ పొగాకు నర్సరీలో ఫంగస్ దోమలు ఉన్నాయో లేదో తనిఖీ చేయడానికి: మొలకల పైన మీ చేతిని మెల్లగా ఊపండి. చిన్న నల్ల దోమల వంటి కీటకాలు ఎగిరిపోతాయి. మొలకల వేర్ల భాగంలో లార్వా తినడం వల్ల నష్టం జరుగుతుంది. ఇవి మొలకల యొక్క వేర్లను తింటాయి. దీనివలన మొక్కల పెరుగుదల పేలవంగా ఉండి మొక్కలు వాడిపోయి పసుపు రంగులోకి మారుతాయి, ఆకులు రాలిపోయి చివరికి మొక్కలు చనిపోతాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

బాసిల్లస్ తురింజియెన్సిస్ ఇస్రాయెలెన్సిస్‌లో మీ మొలకలను ముంచండి. ఇది లార్వా నియంత్రణలో సహాయపడుతుంది.

రసాయన నియంత్రణ

పెద్ద దోమలు కనపడిన వెంటనే మీరు వెంటనే వాటిని రసాయనికంగా నియంత్రించవలసిన అవసరం లేదు. ఇవి తక్కువ సంఖ్యలో ఉంటే పంటకు పెద్ద సమస్యలను కలిగించదు. చనిపోయిన మొలకల సంఖ్య పెరుగుతున్నట్లు మీరు గమనించినట్లయితే మాత్రమే రసాయనాలను ఉపయోగించండి. పెద్ద ఫంగస్ దోమలను నియంత్రించడంలో పిచికారీలు సహాయపడతాయి. తగిన పురుగుమందులను వాడడం ద్వారా లార్వాలను నియంత్రించవచ్చు. పురుగుమందులు లేదా ఏదైనా రసాయన ఉత్పత్తిని ఉపయోగిస్తున్నప్పుడు, రక్షణ దుస్తులను ధరించడం మరియు లేబుల్ సూచనలను జాగ్రత్తగా చదవడం చాలా ముఖ్యం. దేశాన్ని బట్టి నిబంధనలు మారుతూ ఉంటాయి, కాబట్టి మీరు మీ ప్రాంతానికి సంబంధించిన నిర్దిష్ట మార్గదర్శకాలను అనుసరించారని నిర్ధారించుకోండి. ఇది భద్రతకు హామీ ఇస్తుంది మరియు వీటిపై మందులు విజయవంతంగా పనిచేసే అవకాశాలను పెంచుతుంది.

దీనికి కారణమేమిటి?

నీరు నిల్వ ఉన్న చోట, ముఖ్యంగా చనిపోయిన ఆకులు మరియు సేంద్రియ పదార్థాలు పేరుకుపోయిన చోట ఇవి వృద్ధి చెందుతాయి. అందుకే నీటిపై తేలియాడే ట్రేలలో మొక్కలు పెరిగే నర్సరీలలో ఫంగస్ గ్నాట్స్ సర్వసాధారణం. సాధారణంగా విత్తనాలు మొలకెత్తిన వెంటనే మొలకలు చిన్నవిగా ఉన్నప్పుడు పెద్ద గ్నాట్ తేలియాడే ట్రేలలో గుడ్లు పెడుతుంది. వీటి లార్వా చిన్నగా, పారదర్శకంగా లేదా తెల్లటి రంగులో మెరిసే నల్లటి తలతో ఉంటాయి. వాటిని కంటితో గుర్తించడం అంత సులభం కాదు కానీ వేర్ల చుట్టూ ఉన్న మట్టిలో చిన్న పాయింట్లు కదులుతున్నట్లు మీరు చూడవచ్చు.


నివారణా చర్యలు

  • ఎగిరే పెద్ద కీటకాలు లేదా దెబ్బతిన్న మొలకల కోసం నర్సరీలను ముందుగానే తనిఖీ చేయడం ప్రారంభించండి.
  • పర్యవేక్షణ మరియు మాస్ ట్రాపింగ్ కోసం మీరు పసుపు జిగురు అట్టలను కూడా ఉపయోగించవచ్చు.
  • చిన్న శరీరం కలిగిన ఈ కీటకాల నియంత్రణకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
  • నీటి కుంటలు లేకుండా చూసుకోవాలి.
  • తేలియాడే ట్రేలు ఉండే చెరువు వ్యవస్థలలో ట్రేల మధ్య ఖాళీ ఉండకూడదు, ఎందుకంటే కీటకాలు తినే ఆల్గే పెరుగుదలకు ఇది అనుకూలంగా ఉంటుంది.
  • నర్సరీలలో ఎక్కువగా నీరు పెట్టకండి.
  • అధిక మోతాదులో ఎరువులను వాడకండి ఎందుకంటే ఇది నిర్జీవ సేంద్రియ పదార్ధాన్ని అధిక మోతాదులో పేరుకుపోయేటట్టు చేస్తుంది, ఇది ఈ కీటకాలను ఆకర్షిస్తుంది.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి